
భోపాల్: ఎప్పుడూ ఫోన్‌లో ఆటలు ఆడుతూ ఉండడంతో తల్లి మందలించింది. పైగా ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టడంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ చత్తార్‌పూర్ జిల్లాలో జరిగింది. శాంతినగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్‌కు బానిసగా మారాడు. ఈ గేమ్ తరచూ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ ఆటలో రూ.40 వేలు ఖర్చు చేశాడు. ఇంట్లో సోదరితో ఉండి కుమారుడు గేమ్ ఆడుతూ ఉంది. పొలం పనులకు వెళ్లిన తల్లికి ఓ మెసేజ్ వచ్చింది.
బ్యాంక్ ఖాతాలో రూ.1,500 మాత్రమే ఉందని ఆ సందేశంలో ఉంది. ఇది చూసిన తల్లి వెంటనే కుమారుడిని తన వద్దకు పిలిపించింది. డబ్బులు ఏం చేశావని కుమారుడిని అడిగింది. తల్లి కోపంతో అడగడంతో కుమారుడు తడబడ్డాడు. మెల్లగా అడగడంతో డబ్బులు ఆన్‌లైన్ గేమ్ కోసం ఆడినట్లు తెలిపాడు. రూ.40 వేలు ఆన్‌లైన్ గేమ్‌తో వృథా చేశాడని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో కుమారుడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తల్లి మందలించిందనే కోపంతో ఇంటికొచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉన్న సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు కుమారుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment