chattarpur
-
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్‌గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है। उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया। मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023 కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు. గతేడాది జూన్‌లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు. చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం -
రూ.40 వేలు మాయం: బాలుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమింగ్
భోపాల్: ఎప్పుడూ ఫోన్లో ఆటలు ఆడుతూ ఉండడంతో తల్లి మందలించింది. పైగా ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పెట్టడంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ చత్తార్పూర్ జిల్లాలో జరిగింది. శాంతినగర్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్‌కు బానిసగా మారాడు. ఈ గేమ్ తరచూ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ ఆటలో రూ.40 వేలు ఖర్చు చేశాడు. ఇంట్లో సోదరితో ఉండి కుమారుడు గేమ్ ఆడుతూ ఉంది. పొలం పనులకు వెళ్లిన తల్లికి ఓ మెసేజ్ వచ్చింది. బ్యాంక్ ఖాతాలో రూ.1,500 మాత్రమే ఉందని ఆ సందేశంలో ఉంది. ఇది చూసిన తల్లి వెంటనే కుమారుడిని తన వద్దకు పిలిపించింది. డబ్బులు ఏం చేశావని కుమారుడిని అడిగింది. తల్లి కోపంతో అడగడంతో కుమారుడు తడబడ్డాడు. మెల్లగా అడగడంతో డబ్బులు ఆన్లైన్ గేమ్ కోసం ఆడినట్లు తెలిపాడు. రూ.40 వేలు ఆన్లైన్ గేమ్‌తో వృథా చేశాడని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో కుమారుడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తల్లి మందలించిందనే కోపంతో ఇంటికొచ్చి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉన్న సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు కుమారుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యేతో మహిళ అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్.. తనపై బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఒక మహిళపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వీడియోకాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆమె.. తర్వాత దానిని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కాగా చతార్‌పూర్‌లోని మహారాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీరజ్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా మహిళపై సెక్షన్ 385 కింద కేసు బుక్ చేసినట్లు డీఎస్పీ శశాంక్ జైన్ తెలిపారు. కాగా ఆ మహిళకు చెందిన నెంబర్ నుంచి కూడా గతంలో ఎస్ఎంఎస్లు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఆ మహిళ తన దగ్గర ఉన్న వీడియో క్లిప్‌లతో నీరజ్ నుంచి ఎంత డబ్బు డిమాండ్ చేస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మొదట తనకు కాల్ వచ్చినప్పుడు తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వారు ఎవరైనా కాల్ చేసినట్లు భావించి ఫోన్ ఎత్తాను. అయితే ఆ తర్వాత నాకు కాల్ చేసిన సదరు మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. ఆ తర్వాత నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ప్రయత్నించడంతో కాల్ కట్ చేశాను అంటూ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ చెప్పుకొచ్చారు. చదవండి: జీవితంపై విరక్తి: భార్యను చంపి భర్త ఆత్మహత్య ‘మాయలేడి’ మామూలుది కాదు.. ఎన్ని కేసులో -
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందగా, సుమారు 36మంది గాయపడ్డారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళతో సహా అయిదుగురు పురుషులు ఉన్నారు. రైసేన్ నుంచి ఛత్తార్పూర్ వెళుతుండగా బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. నీట మునిగిన బస్సును వెలికి తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఛత్తర్‌పూర్‌లో కూలిన భవనం: ఇద్దరు మృతి
-
భజ్జీ... బిజీ బిజీ
నేడు ఢిల్లీలో రిసెప్షన్ న్యూఢిల్లీ: పెళ్లి హడావుడి ముగిసిన తర్వాత కూడా భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంకా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనెల 27 నుంచి పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్న భజ్జీ ఇప్పుడు స్నేహితులకు పార్టీలు ఇవ్వడం, ఇతరత్రా అంశాలతో మరింత సందడి చేస్తున్నాడు. ఈనెల 29న పెళ్లి తంతు ముగిసిన తర్వాత 30న ఇంటికే పరిమితమైన హర్భజన్... సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శనివారం మాత్రం ఈ వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పిన్నర్ ఢిల్లీలోని చత్తర్‌పూర్‌లో తన స్నేహితుడి ఫామ్ హౌస్‌లో పార్టీని ఏర్పాటు చేశాడు. పసందైన విందుతో పాటు స్నేహితులకు కాక్ టెయిల్ పార్టీ ఇచ్చి అదరగొట్టాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్, కోహ్లి, యువరాజ్, ధావన్‌లు ఈ పార్టీకి హాజరైనట్లు సమాచారం. మరోవైపు ఆదివారం ఢిల్లీలో రిసెప్షన్‌కు భజ్జీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది.