
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్.. తనపై బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఒక మహిళపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వీడియోకాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆమె.. తర్వాత దానిని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కాగా చతార్‌పూర్‌లోని మహారాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీరజ్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా మహిళపై సెక్షన్ 385 కింద కేసు బుక్ చేసినట్లు డీఎస్పీ శశాంక్ జైన్ తెలిపారు. కాగా ఆ మహిళకు చెందిన నెంబర్ నుంచి కూడా గతంలో ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఆ మహిళ తన దగ్గర ఉన్న వీడియో క్లిప్‌లతో నీరజ్ నుంచి ఎంత డబ్బు డిమాండ్ చేస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే మొదట తనకు కాల్ వచ్చినప్పుడు తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వారు ఎవరైనా కాల్ చేసినట్లు భావించి ఫోన్ ఎత్తాను. అయితే ఆ తర్వాత నాకు కాల్ చేసిన సదరు మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. ఆ తర్వాత నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ప్రయత్నించడంతో కాల్ కట్ చేశాను అంటూ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ చెప్పుకొచ్చారు.
చదవండి: జీవితంపై విరక్తి: భార్యను చంపి భర్త ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment