Black mailing
-
మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బెదిరింపులు!
సాక్షి, అమరావతి : బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్)’ వేసి...అనంతరం బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. అయితే ఈ మాయలేడి బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజస్ పరిశ్రమను.. వైఎస్సార్ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది. దండుకునే దందా.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్) పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్ కేసును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్ అనిపించారు. పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ‘హనీట్రాప్ స్పెషలిస్ట్’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు గురిపెట్టింది. రెడ్‌బుక్ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్లో మరో అంకానికి తెరతీసింది. వలపు వల.. ఆపై బ్లాక్ మెయిలింగ్ వలపు వల, బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్ పోర్టులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్ వరల్డ్ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్‌ను కూడా అతను నిర్వహించే వాడు. ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్‌దేవీ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. అంతా చట్టబద్ధంగానే.. తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్‌పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్‌కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్‌కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మెజిస్ట్రీట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేసి అక్కడి మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రీట్ రిమాండ్ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సర్కారే లీకులిచ్చి.. భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ను గురువారం విచారణాధికారిగా నియమించింది. -
బ్లాక్ మెయిలింగ్: భర్త సంసారానికి పనికిరాడని తెలిసినా కూడా!
దిశ పోలీస్స్టేషన్లతో కొత్త దశ మొదలైంది. చిన్నారులు, మహిళల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఇవి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కాపురాలను చక్కదిద్దుతున్నాయి. కడప అర్బన్ : సమాజంలో భార్యాభర్తల అన్యోన్యతతో కుటుంబ అభివృద్ధి, తద్వారా పిల్లల శ్రేయస్సు, వారి ద్వారా సమాజాభివృద్ధి సుసాధ్యమవుతుంది. వారి మధ్య కలతలు కాపురంలో చిచ్చు రేపుతున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ, నగర స్థాయికి వచ్చిన వారు తాము చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల ‘బిజీ లైఫ్’తో తమ పిల్లల బాగోగులను పట్టించుకునే స్థితిలో వుండరు. దీంతో పిల్లలు శారీరక పెరుగుదల, ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధిస్తున్నారు. కానీ తమ దైనందిన జీవితంలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను ఎలా గౌరవించాలి. తాను జీవితాంతం తోడు నీడగా వుండాల్సిన భార్య, భర్త స్థానాలు ఎలా వుండాలి? అనే విధానాలపై ‘మానసిక పరిపక్వత’ చెందక అవగాహన రాహిత్యంతో ‘సంసార జీవితాల’ను దూరం చేసుకుంటున్నారు. పూర్వకాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు వుండేవి. అవ్వా,తాతలు తమ పిల్లలకు, మనువలు, మనువరాళ్లకు మంచి, చెడ్డా, కుటుంబ జీవన విధానం, సమాజంలో మెలిగే పద్ధతులను నేర్పించేవారు. రానురాను ఆ విధానంలో వచ్చిన మార్పులతో చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయి, జీవన విధానాలను నగరజీవితాలుగా మార్చుకుని భర్త,భార్య, పిల్లలుగా మారిపోయి ఆర్థికంగా మెరుగు పడాలనే తాపత్రయంలో పడిపోయారు. కాలక్రమేణ వారి పిల్లల కార్పొరేట్ చదువులపై వున్న శ్రద్ధ, వారి క్రమశిక్షణతో జీవితాన్ని సాగించేలా చూడాలనే విధానం సన్నగిల్లిపోయింది. అంతేగాక ఆడ,మగ పిల్లలను చిన్నతనం నుంచే వారికి ఇచ్చే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పెరిగి పెద్దవాళ్లయిన తరువాత కూడా అదే విధానం అవలంబించడం వల్ల జీవితగమనంలో విభేదాలు తలెత్తుతున్నాయి. సమస్యల చుట్టూ పరిభ్రమిస్తున్న జీవితాలు ► ఆధునిక సాంకేతికతతో ‘సెల్‌ఫోన్’ లేకుండా చిన్న పిల్లాడి నుంచి పెద్దల వరకు వుండలేకపోతున్నారు. ‘సెల్‌ఫోన్’ దైనందిన జీవితంలో భాగమవడంతోపాటు, వ్యసనంగా మారింది. ‘దిశ’ మహిళా అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ వారు భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న కలతలకు కారణాలను తెలుసుకుని ‘కౌన్సెలింగ్’ అనే బ్రహ్మాస్త్రంతో తొలగించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఈ విధానం ద్వారా చాలా కేసుల్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు. ► 18 ఏళ్ల వయసు రాగానే, పూర్తవకముందే కొందరు ఆడపిల్లలు తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా తాను ప్రేమించిన యువకుడే సర్వస్వం అంటూ ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎంత త్వరగా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, వీరిలో కొందరు అంతే త్వరగా విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ► కొందరు తమ సెల్ఫోన్ల ద్వారా ఇంటిలో పడకగది నుంచి స్నానాల గదుల వరకు ఒకరిపై మరొకరు నమ్మకం లేక వీడియోలను తీసుకుంటూ వారి సంసారాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. ► విద్యావంతులైన వారే కొందరు ఆడపిల్లలు తమ వైవాహిక జీవితాన్ని ఆరు నెలలకు గానీ, ఏడాది పూర్తవక ముందే భర్త సంసారానికి పనికిరాడని నిర్ణయించుకుంటున్నారు. ‘కౌన్సెలింగ్ పీరియడ్’ రెండు నెలల కాలం పూర్తవక ముందే ‘కక్షసాధింపు’ ధోరణిలో ప్రవర్తిస్తూ విడిపోతున్నారు. కడప ‘దిశ’ పోలీస్ స్టేషన్ ద్వారా అందిస్తున్న సేవలు ► కడప దిశ పోలీస్‌స్టేషన్‌కు నేరుగాగానీ, జిల్లా ఎస్పీ నిర్వహించే ‘స్పందన’ ద్వారా వచ్చే భార్యాభర్తల, మహిళల, చిన్నపిల్లల సమస్యలు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను డీఎస్పీ స్థాయి అధికారి దృష్టికి వస్తాయి. ఆయన ఆదేశాల మేరకు మొదట బాధితుల సమస్యలను తెలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రాథమికంగా మనస్పర్థలను తొలగించేందుకు ఇక్కడి సిబ్బంది ప్రయత్నిస్తారు. లేదంటే మొదటి రెండు నెలలు ‘కూలింగ్ పీరియడ్’లో మూడు లేదా ఐదు కౌన్సెలింగ్‌లను నిర్వహించి వారి మధ్య విభేదాలను తొలగించి సజావుగా కాపురం చేసుకునేలా ప్రయత్నిస్తారు. కలువలేని పరిస్థితుల్లో వారి ఇష్ట ప్రకారం ఎఫ్.ఐ.ఆర్‌లను తమ పరిధిలో గానీ, ఆయా పోలీస్స్టేషన్ల ద్వారా నమోదు చేయిస్తారు. తరువాత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఈ కౌన్సెలింగ్‌లను ప్రతి మంగళవారం, శనివారం నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌కు భార్యాభర్తలను విడివిడిగా పోలీసు అధికారి, మనస్తత్వశాస్త్ర నిపుణులు, న్యాయవాదులు, ఎన్జీఓ సంఘానికి చెందిన సభ్యుల సమక్షంలో విచారణ చేస్తారు. తరువాత ఇద్దరిని కలిపి విచారణ చేసి విడిపోతే కష్ట,నష్టాలు, కలిసుంటే జీవితాంతం సంసారం సాఫీగా సాగుతుందని ‘పోస్ట్ మేరిటల్ కౌన్సెలింగ్’ విధానం ద్వారా వివరిస్తారు. గతంలో ప్రతి మంగళవారం, శనివారం కౌన్సెలింగ్‌ను ఐదు జంటలలోపు నిర్వహించేవారు. ప్రస్తుతం 10 నుంచి 15 జంటలకు నిర్వహించాల్సి వస్తోంది. ► కొందరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఆడపిల్లలకు తక్కువ వయసులోనే వివాహం చేస్తుంటారు. వారికి వైవాహిక జీవితంపై అవగాహన వుండదు. అలాంటి జంటలకు కౌన్సెలింగ్ ద్వారా వారి మధ్య మనస్పర్థలు తొలగించి, వారిని ఒక్కటిగా చేసి పంపిస్తున్నారు. ► ఉద్యోగం వుంటే ఆర్థిక స్వేచ్ఛ కలిగి వుంటుందని కొందరు మహిళలు గానీ, పురుషులుగానీ వివాహేతర సంబంధాలు, రెండో వివాహంపై మొగ్గు చూపుతూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరిని కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా కలుపుతున్నారు. కొందరు ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా అవగాహన రాహిత్యంతో దూరంగానే వుంటున్నారు. మచ్చుకుకొన్ని.. ► పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాక తన భర్త సంసారానికి పనికిరాడని తెలుసుకుని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోనే కుమిలిపోయి నరకం అనుభవించింది. డబ్బుల కోసం తన భర్త మరో వివాహానికి సిద్ధపడితే పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వాస్తవాలను విచారణ చేసి వారు విడిపోతేనే మంచిదని భావించారు. ► తనను ప్రేమించిన సమయంలో ఫొటోలు తీసుకున్న యువతిని, వేరే వివాహం చేసుకున్న తరువాత ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చి ‘బ్లాక్ మెయిలింగ్’కు పాల్పడిన ఓ యువకుడిని పిలిపించి, సదరు న్యూడ్ ఫొటోలను తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేశారు. ► ఓ తొమ్మిదినెలల పసిబాబును, భార్యను మనస్పర్థలతో దూరం చేసుకున్న భర్తను ఒకేఒక్క కౌన్సెలింగ్ ద్వారా వారిని కలిపి పంపించారు. ► కొందరు భర్తలు మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసలుగా మారి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే ‘డీ ఆడిక్షన్’ సెంటర్లకు పంపించి వారిని కలిపేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే మనస్పర్థలకు చెక్ భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో కృషి చేస్తున్నాం. ప్రతి మంగళ, శనివారాలలో ‘కౌన్సెలింగ్’ను నిర్వహించి వారి మధ్య అభిప్రాయ భేదాలను తొలగించి న్యాయం జరిగేలా చూస్తున్నాం. మహిళలు, చిన్నారుల పట్ల జరిగే నేరాల నియంత్రణకు అహర్నిశలు పనిచేస్తున్నాం. ‘దిశ’ యాప్‌ను జిల్లా వ్యాప్తంగా మహిళల చేత డౌన్లోడ్ చేయించాం. ఆపద సమయాలలో ఆదుకుంటున్నాం. – ఎస్.రమాకాంత్, కడప ‘దిశ’ డీఎస్పీ -
బలవంతంగా లోబర్చుకున్నాడు.. ఆ ఫోటోలు భర్తకు చూపిస్తానంటున్నాడు..!
శిష్యరికం చేసిన అమ్మాయిని తీర్చిదిద్దవలసిన బృహత్తర బాధ్యత కలిగిన ఓ కామంధ కోచ్, ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేసిన ఉదంతం న్యూఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కామాంధ కోచ్ సదరు యువతిని బలవంతంగా లోబర్చుకుని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు తనతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలను భర్త చూపిస్తానని బెదిరించి 43.5 లక్షలు కాజేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కామంధ కోచ్‌పై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని విచారిస్తామని పేర్కొన్నారు. నిందితుడితో 2012లో పరిచయం ఏర్పడిందని, జాతీయ క్రీడలకు ప్రిపేర్ అయ్యే క్రమంలో తాను కోచింగ్ అకాడమీ చేరానని, 2015లో కోచ్ తనను బలవంత పెట్టి లోబర్చుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. కోచ్ 2018లో తాను సంపాదించిన మొత్తంలో వాటా ఇవ్వాలని బెదిరించాడని, ఆ సమయంలో తాను దాదాపు అర కోటి వరకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసానని బాధితురాలు తెలిపింది. 2021లో తనకు వివాహం అయ్యాక కోచ్ బెదిరింపులు పతాక స్థాయికి చేరాయని, అతను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో గడిపిన ప్రైవేట్ ఫోటోలను భర్తకు చూపిస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. బాబా హరిదాస్ నగర్ పోలీసులు బాధితురాలి పేరును కానీ నిందితుడి పేరును కానీ బహిర్గతం చేయలేదు. కాగా, ఇటీవలికాలంలో కోచ్‌లు తమ వద్ద శిష్యరికం చేసే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఎక్కువై పోయాయి. గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న యువతులకు కల్లబొల్లి మాటలు చెప్పి లోబర్చుకుని బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు,సామాన్య ప్రజలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రేమికులను కత్తితో బెదిరించి.. కొండపైకి తీసుకెళ్లి వివస్త్రలను చేసి..
జయపురం(భువనేశ్వర్): ప్రేమికులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్ డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర శనివారం తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు శుక్రవారం మాట్లాడుతూ ఉండగా వారి వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి భయపెట్టారు. తమ వద్దనున్న కత్తిని చూపించి ప్రేమికులను సమీప కొండపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు దుండగులతో కలిసి ప్రేమికులను నగ్నంగా చేసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని హెచ్చరించి, రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే తమ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేల నగదును ప్రేమికులు దుండగులకు ఇచ్చారని వెల్లడించారు. శనివారం మరో రూ.13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, మిగతా రూ.30 వేలు నెల రోజుల్లో ఇస్తామని ప్రేమికులు దుండగులకు చెప్పినట్లు తెలిపారు. అనంతరం బందువుల సాయంతో వీరు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి 5 దుండగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైనవారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్ గరడ, దీపక్ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
నాకు లొంగకపోతే.. నీకు పెళ్లికాకుండా చూస్తా!
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నీ తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.. నువ్వు లొంగకపోతే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ ఓ యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన పూర్ణకంటి నవీన్(29) గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తూ రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి స్థానికంగా నివసిస్తున్న విద్యార్థినిని వెంబడిస్తూ, వేధిస్తూ తనతో రాకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. పలుమార్లు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆదివారం ఉదయం నవీన్ ఆ యువతి ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఆమె తీయలేదు. వెంటనే బాధితురాలు 100కు డయల్ చేసింది. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకొని నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను కాలేజీకి వెళ్లే సమయంలో వెంబడిస్తూ బైక్‌పై బలవంతంగా కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తన తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తానని వేధిస్తున్నట్లు కూడా ఆరోపించింది. పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ నవీన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యేతో మహిళ అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్.. తనపై బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఒక మహిళపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వీడియోకాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఆమె.. తర్వాత దానిని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. కాగా చతార్‌పూర్‌లోని మహారాజ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీరజ్ దీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా మహిళపై సెక్షన్ 385 కింద కేసు బుక్ చేసినట్లు డీఎస్పీ శశాంక్ జైన్ తెలిపారు. కాగా ఆ మహిళకు చెందిన నెంబర్ నుంచి కూడా గతంలో ఎస్ఎంఎస్లు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఆ మహిళ తన దగ్గర ఉన్న వీడియో క్లిప్‌లతో నీరజ్ నుంచి ఎంత డబ్బు డిమాండ్ చేస్తుందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మొదట తనకు కాల్ వచ్చినప్పుడు తన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వారు ఎవరైనా కాల్ చేసినట్లు భావించి ఫోన్ ఎత్తాను. అయితే ఆ తర్వాత నాకు కాల్ చేసిన సదరు మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. ఆ తర్వాత నన్ను బ్లాక్‌మెయిలింగ్ చేయడానికి ప్రయత్నించడంతో కాల్ కట్ చేశాను అంటూ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ చెప్పుకొచ్చారు. చదవండి: జీవితంపై విరక్తి: భార్యను చంపి భర్త ఆత్మహత్య ‘మాయలేడి’ మామూలుది కాదు.. ఎన్ని కేసులో -
Cyber Crime: అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది..
శిరీష (పేరు మార్చడమైంది) నిద్రలేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. కాసేపు ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ చూసి, విసుగనిపించి గదిలోనుంచి బయటకు వచ్చేసింది. నెల రోజులుగా ఇదే తంతు. చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉంటే గడిచే రోజులు కావు. ఆలోచిస్తూనే తల్లి ఇచ్చిన టిఫిన్‌ను ముగించి, తిరిగి ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్ కావడంతో ఎవరై ఉంటారనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. ఆ వచ్చిన ఫోన్ కాల్‌తో శిరీష్ ముఖం వెలిగిపోయింది. ఆన్లైన్లో వచ్చిన జాబ్ ఆఫర్‌కి రాత్రే అప్లై చేసింది. తెల్లవారుజామునే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యినట్టు ఫోన్ వచ్చింది. నాలుగు రోజులు గడిచాయి. ఎంత పిలిచినా శిరీష గది దాటి రావడం లేదు. దాంతో తల్లే తన గదిలోకి వెళ్లి భోజనం పెట్టి వస్తూ ఉంది. ‘ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడ్డావు. ఇప్పుడేమయ్యింది. ఇలా ఎందుకున్నావ్’ అంటూ తల్లి అడుగుతూనే ఉంది. కానీ, శిరీష మౌనంగా ఉంటోంది. ‘ఉద్యోగం లేదన్నారేమో.. అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది’ అనుకుంటూ.. కూతురును సముదాయించింది తల్లి. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన తల్లికి ఉరేసుకుంటూ కనిపించిన కూతుర్ని చూసి గుండెలదిరాయి. భర్తను లేపి, శిరీషను ముప్పు నుంచి తప్పించింది. విషయమేంటని నిలదీస్తే.. శిరీష చెప్పింది విని తల్లీతండ్రి తలలు పట్టుకున్నారు. పర్సనల్ ఫొటోలు పంపిస్తే.. ఫోన్ ఇంటర్వ్యూలోనే జాబ్‌కి ఎంపిక చేస్తారని రవి (పేరు మార్చడమైంది) అనే వ్యక్తి రోజూ ఫోన్ చేస్తుండేవాడు. కాల్ వచ్చిన ప్రతీసారి రిప్లై ఇవ్వమంటూ కోరాడు. చేసేది ఫ్రంట్ ఆఫీస్ జాబ్ కాబట్టి, అందంగా ఉండాలని చెప్పేవాడు. శిరీష అందంగా హీరోయిన్గా ఉండటం వల్లే ఈ జాబ్‌కి ఎంపిక చేసినట్టుగా చెప్పేవాడు. తక్కువ వ్యవధిలో బాగా తెలిసిన వ్యక్తిలా ఫోన్లోనే పరిచయం పెంచుకున్నాడు రవి. పర్సనల్ ఫొటోలు షేర్చేయమని చెప్పాడు. జాబ్ వస్తుందనే గ్యారెంటీ మీద రవి మీద నమ్మకంతో అతడు అడిగిన విధంగా ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేసింది శిరీష. ఆ మరుసటి రోజు నుంచే ఫొటోలను అడ్డు పెట్టుకొని రవి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శిరీష పంపించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో విధి లేక అతను అడిగిన డబ్బును కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చింది. కానీ, ఇంటి పరిస్థితి బాగోలేకపోవడం, తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వాళ్లేమవుతారో అని భయపడి చనిపోదామని నిర్ణయించుకుంది. 16 రాష్ట్రాలు.. 600 మంది యువతులు రిక్రూటర్‌గా నటించి దేశవ్యాప్తంగా 600 మంది మహిళలను మోసం చేసిన చెన్నైకి చెందిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. రాజ్ చెజియాన్ అనే వ్యక్తి రిక్రూటర్‌గా నటించి, 16 రాష్ట్రాలకు చెందిన యువతులను ఆకర్షించి, ఉద్యోగం నెపంతో వారి నగ్న, ప్రైవేట్ చిత్రాలను అతనితో పంచుకునేలా చేశాడు. ఎంక్వైరీలో మోసపోయిన యువతుల్లో హైదరాబాద్ నుండి కూడా 60 మంది ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. అతను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం మహిళలు అప్లై చేసుకున్న పోర్టల్‌ను చూసేవాడు. మహిళా ఉద్యోగుల అప్లికేషన్లు పెరుగుతుండటం గ్రహించి, ఈ పథకం వేశాడు. తప్పుడు పేరుతో ఫోన్ కాల్స్.. చేజియాన్ ఫైవ్ స్టార్ హోటల్ డైరెక్టర్ ప్రదీప్‌గా నటిస్తూ యువతులకు ఫోన్ కాల్స్ చేసేవాడు. మహిళలను ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ నుండి పిలుపు కోసం ఎదురుచూడమని చెప్పేవాడు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం కాబట్టి అభ్యర్థి శరీర ఆకృతి గురించి సంస్థ నిబంధనలు పొందిపరిచి ఉందని, అందుకు వాట్సాప్ ద్వారా మహిళలను పలు కోణాల నుండి నగ్న చిత్రాలను పంచుకోవాలని కోరేవాడు. వీడియో కాల్ చేసి, సదరు మహిళను నగ్నంగా ఉండమని, ఆ దృశ్యాలను రికార్డు చేసేవాడు. చివరకు సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్దనున్న ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో మహిళల నగ్న ఫోటోలు భద్రపరచి ఉండటం గమనించారు. ఈ చిత్రాలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. ఉద్యోగ మోసాలు గుర్తించండిలా... ►అర్హత లేకపోయినా సులువుగా ఉద్యోగం ఇస్తాం అనే విషయాన్ని నమ్మకూడదు. ►వర్క్‌ఫ్రమ్ పేరుతో అధిక ఆదాయం ఎర చూపి, అర్హత లేకపోయినా ఇచ్చే ఉద్యోగాలు దాదాపుగా మోసపూరితమైనవే అని గుర్తించాలి. తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు అని అనుమానించాలి. ►సోషల్ మీడియా మోసాలు అధిక ఆదాయానికి బదులుగా కొన్ని సరళమైన పనులు (ఫాలో, లైక్, షేర్, కామెంట్.. వంటివి) చేయటానికి ఆఫర్ ద్వారా బాధితుడు ఆకర్షితుడవుతాడు. ఇది కూడా తగదని గుర్తించాలి. ►కెరీర్ కన్సల్టింగ్ మోసాలలో రెజ్యూమ్ రైటింగ్, ఫార్వర్డింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదా ఇతర వృత్తి సంబంధిత సేవలను ఆఫర్ చేస్తుంటారు. ►ఇంటర్వ్యూ అయిన వెంటనే సదరు ‘ఇంటర్వ్యూయర్’ మిమ్మల్ని సంప్రదించడం, ఆఫర్లు చెప్పడం చేస్తారు. ►ఇ–మెయిళ్ళు, టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అవతలి వారికి షేర్ చేయకూడదు. ►సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగమైనా చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయమని కోరండి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫేండేషన్ ఫౌండర్ -
విద్యార్థినిపై అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు
హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): సహ విద్యార్థినిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు శనివారం హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని.. సీనియర్ విద్యార్థులైన కొత్త శివారెడ్డి(ప్రకాశం జిల్లా ఉప్పలపాడు), పిన్నబోయిన కృష్ణవంశీ(విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు) జన్మదిన వేడుకలకంటూ గతేడాది ఫిబ్రవరిలో తమ రూమ్‌కు పిలిచారు. తీరా రూమ్‌కు వచ్చిన తర్వాత ఎవ్వరూ లేకపోవటంతో కంగారుపడ్డ ఆ విద్యార్థిని.. వెంటనే వారిని ప్రశ్నించింది. ఇంతలో వారు ఆమెను బలవంతంగా నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే.. వీడియాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. దీంతో ఎంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ విద్యార్థిని చివరకు శివారెడ్డి, కృష్ణవంశీల వేధింపులు తట్టుకోలేక.. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. కానీ కాలేజీ యాజమాన్యం శివారెడ్డి, కృష్ణవంశీని మందలించి.. వారి ఫోన్లలోని వీడియోలను డిలీట్ చేయించి వదిలివేసింది. ఈ విషయం బయటపడితే కాలేజీ అప్రతిష్ట పాలవుతుందని, భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వబోమని విద్యార్థినికి నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న శివారెడ్డి, కృష్ణవంశీ ఇటీవల తమ ఫోన్లలో ఆయా వీడియోలను రికవరీ చేసుకోవటమే కాక ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లికి చెందిన దొడ్ల ప్రవీణ్‌కుమార్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. దీంతో ప్రవీణ్ తన కామ వాంఛ తీర్చాలని.. లేకపోతే వీడియోలను బయటపెడతానంటూ విద్యార్థినిని వేధించడం మొదలుపెట్టాడు. రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ విద్యార్థిని.. రెండ్రోజుల క్రితం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సీఐ నాయుడు నిందితులైన కృష్ణవంశీ, శివారెడ్డి, ప్రవీణ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 376 డీ, 354 ఏ, ఐటీ యాక్ట్ సెక్షన్ 67 క్రింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. వీరిని నూజివీడు కోర్టులో ప్రవేశపెట్టి.. దర్యాప్తు కోసం రిమాండ్ కోరుతామని చెప్పారు. అత్యాచారం ఘటనను కప్పిపుచ్చేందుకు, నేరాన్ని మాఫీ చేసేందుకు ప్రయత్నించిన ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యానికి కూడా నోటిసులిస్తామని డీఎస్పీ ప్రసాదరావు చెప్పారు. విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కాపాడటం చట్టరీత్యా నేరమేనన్నారు. -
నన్ను కాదని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే
బంజారాహిల్స్: నన్ను కాదని ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నావో నాతో కలిసి దిగిన ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఇన్‌కం ట్యాక్స్ క్వార్టర్స్ సమీపంలో నివసించే యువతి(25) ఈవెంట్స్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఇటీవల ఆమెకు ఫేస్బుక్లో సౌదీలో ఉంటున్న రియాద్ బిన్ ఖాలిద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ కుదరడంతో గత ఏడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా రియాద్‌లో తీవ్ర మార్పు వచ్చింది. ఆమె గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ను తన వద్దే ఉంచుకొని ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో రియాద్ నుంచి విడిపోయిన ఆమె తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే రియాద్ ఆమె తల్లికి ఫోన్ చేసి తనను కాదని వేరొకరికి ఇచ్చిన పెళ్లి చేస్తే బతకనివ్వనని తనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు తన వద్ద ఉన్నాయని వాటిని విడుదల చేస్తానంటూ హెచ్చరించసాగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రియాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : దొంగతనంగా ఓ యువతి నగ్న చిత్రాలను సేకరించిన డబ్బులివ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఓ యువకుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. వివరాలివీ.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ ఫొటోలు ఆమె స్నేహితురాలి ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. వాటిని గుంటూరుకు చెందిన షేక్ ఆజాద్ దొంగచాటుగా తన సెల్‌లోకి పంపుకున్నాడు. అనంతరం ఆ ఫొటోలను నెట్లో అప్లోడ్ చేస్తానంటూ వాట్సాప్‌లో బెదిరింపులు ప్రారంభించాడు. ముందుగా కొన్ని ఫొటోలను కూడా ఆమెకు పంపాడు. ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి రూ.4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే అన్నంత పనీ చేస్తానని హెచ్చరికలు చేశాడు. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం సికింద్రాబాద్ వచ్చిన ఆజాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అతని వద్ద ఉన్న నగ్నచిత్రాల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు పంపారు. వివాహితకు వేధింపులు, వ్యక్తికి 4 రోజుల జైలు శిక్ష వివాహిత వెంట పడి వేధిస్తున్న వ్యక్తికి న్యాయస్థానం నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్ ఎస్ఐ జగదీష్ సమాచారం మేరకు.. జూబ్లీహిల్స్ రోడ్ నం-5లోని దుర్గాభవానీ నగర్లో నివసించే ఇ.కృష్ణ(36) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదే బస్తీలో నివసిస్తున్న వివాహితతో కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక సారి ఆమెను తీసుకొని వెళ్లిపోగా బస్తీవాసులు తమదైన రీతిలో గుణపాటం చెప్పారు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా మూడు రోజుల క్రితం ఆమె వెళ్లే సమయంలో వెంబడిస్తూ వేధింపులకు గురి చేయడంతో బాధితురాలి భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 70(సి) కింద పోలీసులు కేసు నమోదు చేసి పదవ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం నిందితుడికి నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అశ్లీల వెబ్సైట్ల కేసులో మరో ఇద్దరు అరెస్ట్ టాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ రేటింగ్‌తో సొమ్ము చేసుకుంటున్న పలు అశ్లీల వెబ్సైట్ల నిర్వాహకులిద్దరిని సీఐడీ సైబర్‌క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్టు అదనపు డీజీపీ గోవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. అహ్మదాబాద్ మహాసేన జిల్లాకు చెందిన తాకూర్ మహేష్‌కుమార్ జయంతి, తాకూర్ బాల్సిన్హ్ను అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. ట్రాన్సిస్ట్ వారెంట్‌పై ఇద్దరిని హైదరాబాద్ తీసుకువచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు, ఆర్టిస్టుల ఫోటోలతో మార్ఫింగ్ చేసి ఐదు అశ్లీల సైట్లలో అప్లోడ్ చేశారని, ఈ సైట్ల హిట్స్‌తో నెలకు రూ.35వేలు సంపాదిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వీరి నుంచి నాలుగు ల్యాప్‌ట్యాపులు, రెండు సెల్ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు గోవింద్ వెల్లడించారు. -
డబ్బులిస్తావా.. రైడ్ చేయించమంటావా?
► రెవెన్యూ అధికారికి బ్లాక్‌మెయిలింగ్ లెటర్ ► ఫేవర్ చేయాలంటే నగదు చెల్లించాలని కోరిన వైనం ► గట్టు శివానంద పేరుతో ఖాతా నంబర్ పంపిన సంఘటన ► లెటర్‌పై ఏసీబీ డీఎస్పీకి వీఆర్వో ఫిర్యాదు బుచ్చిరెడ్డిపాళెం: ‘క్లరికల్ క్యాడర్ వ్యక్తిని నేను. నీపై ఆరోపణలతో కూడిన ఫైల్ నా వద్ద ఉంది. నీకు ఫేవర్ కావాలంటే నేను పంపుతున్న ఖాతా నంబర్లో రూ.30 వేలు జమచేయ్. లేకుండా నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్‌కు పట్టిన గతి నీకూ పడుతుంది’. అంటూ ఓ వ్యక్తి మండలంలోని పెనుబల్లి గ్రామ రెవెన్యూ అధికారికి పంపిన బ్లాక్‌మెయిలింగ్ లెటర్ సంచలనం సృష్టిస్తోంది. దీనిపై సదరు వీఆర్వో ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించగా, విచారణ జరుపుతామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్సైకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. అంతేకాకుండా లెటర్లో ఉన్న చిరునామాకు వీఆర్వోనే వెళ్లి విచారణ జరిపి వ్యక్తి ఉంటే తనకు తెలియజేయాలని ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి ఉచిత సలహా ఇచ్చిన ఉదంతమిది. వివరాల్లోకి వెళ్లితే... మండలంలోని పెనుబల్లి వీఆర్వోకు ఈనెల 25న పోస్ట్ ద్వారా ఓ లెటర్ వచ్చింది. అందులో వీఆర్వో పేరును సంబోధిస్తూ రాసి ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘నేను పనిచేసేది క్లరికల్ క్యాడరే అయినా మీకు సంబంధించినంతవరకు కీలకస్థానమే. పవన్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీపై ఆరోపణలు చేస్తూ అందుకు తగిన ఆధారాలు పంపాడు. ఆ ఫైల్ ఇప్పుడు నా వద్ద ఉంది. నేను ఎక్కడ పనిచేస్తాననేది ముఖ్యం కాదు. ఆరోపణల పర్యవసానం ముఖ్యం. మీకు ఫేవర్ చేద్దామనే ఆపాను. మీపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో నాకు అనవసరం. మీకు ఫేవర్ చేసినందుకు రూ.30 వేలు ఆశిస్తున్నాం. మాకు పొలిటికల్ బ్యాకప్ ఉంది. మీ సహకారం మాకు అవసరం లేదు అని అనుకుంటే మీ ఇబ్బందులు మీరు పడవచ్చు. మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. రొటీన్ ప్రాసెస్‌లాగా మీ ఫైల్ టేబుల్ అవుతుంది. తరువాత ట్రాప్‌కు కావాల్సిన విక్టిమ్‌ను రెడీ చేసుకుని మీ బినామీల గురించి ఆరాతీసిన తరువాత చర్యలుంటాయి. ఉదాహరణకు నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్, పంచాయతీరాజ్ డీఈఈలపై ఫిర్యాదులు వచ్చాయి. ఇద్దరినీ అప్రోచ్ అయ్యాను. డీఈఈ మనీ పేచేశారు. ఫైల్ మాయం చేశాం. సబ్‌రిజిస్ట్రార్ లైట్ తీసుకున్నాడు. దాంతో మేం ఫిబ్రవరి 22వ తేదీన ఫైల్ టేబుల్ చేశాం. ఈ నెల ఫస్ట్‌వీక్ అతనిపై రైడ్ జరిగి, సస్పెండ్ అయి ౖజñ ల్లో ఉన్నాడు. ఒకటి మాత్రం నిజం మీపై ఎలిగేషన్స్ తీవ్రంగా ఉన్నాయి. మా ఫేవర్ కావాలంటే పైసలు పే చేయండి,అలాకాకుండా నన్నే మనీ పే చేయమంటారా అంటూ బద్నామ్ చేయాలని చూస్తే మీకే నష్టం. మా జాగ్రత్తలో మేముంటాం. మీరు 28,29వ తేదీల్లో మనీ పే చేసేటట్లయితే గట్టు శివానంద, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతానంబరు 20310 467791లో పే చేయండి. అంటూ లెటర్‌ను వీఆర్వోకు పంపారు’. ఏసీబీని ఆశ్రయించిన వీఆర్వో: తనకు వచ్చిన బ్లాక్‌మెయిలింగ్ లెటర్‌పై వీఆర్వో ఏసీబీ డీఎస్పీని బుధవారం ఆశ్రయించారు. లెటర్‌ను చూపారు. తిరుపతిలో ఉన్న తమ శాఖ అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తామని తనకు హామీ ఇచ్చినట్లు వీఆర్వో తెలిపారు. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని ఎస్సై: తనపై వచ్చిన బ్లాక్ మెయిలింగ్ లెటర్‌పై ఆర్ఐలు, వీఆర్వోలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వీఆర్వో ఫిర్యాదు చేసినా ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేయలేదు. ఇవ్వన్నీ ఫేక్ లెటర్స్ అని కొట్టిపడేశారు. ఆ చిరునామాలో ఉంటే తదుపరి చర్యలు తీసుకుంటానని ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు. -
సాయిరామ్ గ్యాంగ్‌పై మరో కేసు
ఇప్పటి వరకు 24మంది బాధితుల గుర్తింపు మహిళా పోలీసులతో కౌన్సెలింగ్ బాధితులు ముందుకు రావాలని సూచన విజయవాడ సిటీ : కళాశాల విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సాయిరామ్ గ్యాంగ్‌పై మరో కేసు నమోదైం ది. నగరానికి చెందిన ఓ బాధిత కు టుంబం ఫిర్యాదు మేరకు మహిళా పో లీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరామ్ అలియాస్ రామ్‌చరణ్ తన సహచరులతో కలిసి ఏడాదిన్నర కాలంగా కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరి ట మభ్యపెట్టి రహస్యంగా నీలి చిత్రాలు తీసి బెదిరిస్తున్న విష యం తెలిసిందే. వీరిపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 23న సాయిరామ్, పర్శపు దీపక్, పసుమతి అభిలాష్ కుమార్, షేక్ ము న్నాను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో మైనర్‌ను జువనైల్‌హోంకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీ సులు ఇచ్చిన భరోసాతో నగరానికి చెందిన ఓ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వీరి మాయలో పడిన విద్యార్థినితో నీలి చిత్రాలను తీసి సాయిరామ్ గ్యాంగ్ బ్లాక్‌మెయిలింగ్ చేసింది. ఆమె నీలి చిత్రాల విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. పరువుపోతుందని భావించిన బా ధిత కుటుంబం విషయాన్ని బయటకు చెప్పుకోలేదు. నిందితుల అరెస్టు సందర్భంగా పోలీసులు ఇచ్చిన భరోసాతో జరిగిన విషయాన్ని పేర్కొంటూ పోలీ సులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బాధితులకు కౌన్సెలింగ్ నిందితులను అరెస్టు చేసే నాటికి 10 మంది బాధితులు మాత్రమే తమ కు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కొం తకాలంగా మరికొందరు విద్యార్థినులను వీరు వలలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించారు. నింది తుల ఫోన్‌కాల్స్, పంపిన ఎస్.ఎం.ఎస్‌లను పరిశీలించిన పోలీసులు.. ఇప్పటి వరకు సాయిరామ్ గ్యాంగ్ చేతిలో 24 మంది మోసపోయినట్టు గుర్తించారు. వీరిని, వీరి కుటుంబ స భ్యులను పిలిపించి మహిళా పోలీ సులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ధైర్యంగా ముందుకు రండి సాయిరామ్ గ్యాంగ్ లేదా మరే ఇతర ముఠాల చేతిలో ఈ తరహా మోసానికి గురైన బాధితులు ధై ర్యంగా పోలీసులకు సమాచారం ఇ వ్వాలని నగర పోలీసు అధికారులు కోరుతున్నారు. మోసపోయిన వా రు మిన్నకుండవద్దని, బాధితులు పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీరి వివరాల ను గోప్యంగా ఉంచడంతో పాటు ఎఫ్ఐఆర్లో పేర్లు, ఇతర వివరాలు నమోదు చేయబోమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
కీచక టీచర్
పలమనేరు, న్యూస్‌లైన్: నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కాస్త డబ్బున్న అమాయక టీచర్లను టార్గెట్ చేసి వారి బలహీనతలతో ఆడుకుంటున్నాడు. తన కోర్కెలు తీర్చుకుని రహస్యంగా వాటిని వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ పబ్బంగడుపుకుంటున్నాడు. ఇతని బారిన పడి ఎందరో మహిళా టీచర్లు బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. సమాజంలో బాగా డబ్బున్న వ్యక్తిగా చలామణి అవుతూ తన విలాసాలు, అక్రమాల కోసం అమాయక టీచర్ల జీవితాలతో చెలగాటమాడుకునే ఈ నయవంచకుడి నిజస్వరూపంపై ధైర్యం చేసి ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతని చరిత్ర ఆదివారం వెలుగు చూసింది. ఉపాధ్యాయ లోకం తలదించుకునే ఈ సంఘటన గంగవరం మండలంలో జరిగింది. సోమల మండలం సూరయ్యగారిపల్లెకు చెందిన చంద్రమౌళి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గంగవరం మండలంలో పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహమైంది. ఇతని భార్య సైతం ఉపాధ్యాయురాలే. ఇదిలా ఉండగా ఇదే మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్‌పై ఇతని కన్నుపడింది. సీఆర్సీ సమావేశాలు జరిగినప్పుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సమస్యల్లో ఉన్న టీచర్లను ఆదుకోవడమే తన లక్ష్యమని నమ్మబలికాడు. తనకు బ్యాంకు మేనేజర్లతో పాటు చిట్‌ఫండ్ కంపెనీల వారితో పరిచయాలున్నాయని, ఎటువంటి రుణాలు కావాలన్నా ఇప్పిస్తానంటూ చెప్పాడు. దీంతో అతన్ని నమ్మిన ఆమె ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణం కావాలని కోరింది. ఆ పని తాను చేస్తానంటూ బాధితురాలి వద్ద తొలుత రూ.2.5లక్షల వరకు చెక్కులను తీసుకున్నాడు. వాటి ఆధారంగా డబ్బు డ్రా చేసుకున్నాడు. అయితే ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది. దీంతో చంద్రమౌళి కారణంగా తమ కుటుంబంలో కలహాలొస్తాయని భావించిన ఆమె తన డబ్బు తనకు చెల్లించాలని పట్టుబట్టింది. దీంతో చిట్‌ఫండ్‌లో లోన్ మంజూరైందని వెంటనే సంతకాలు చేయడానికి తిరుపతి రావాలని బాధితురాలితో నమ్మబలికాడు. ఆమెను తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని అందించాడు. ఆపై తనకు అవసరమైన విధంగా బాధితురాలిని సెల్ఫోన్లో చిత్రీకరించాడు. కొంతసేపటికి తేరుకున్న బాధితురాలికి ఆ వీడియోలను చూపెట్టి దీన్ని యూటూబ్‌లో పెడతానంటూ బెదిరిం చాడు. అంతేకాకుండా బాధితురాలు చిట్‌ఫండ్ కంపెనీలో రుణం కోసం తెచ్చుకున్న పలు ఖాళీ చెక్కులు, ప్రోనోట్లపై బెదిరించి సంతకాలు చేయించుకున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే విషయం బయటపెడతానంటూ బాధితురాలిని భయపెట్టాడు. విధిలేని పరిస్థితుల్లో ఆమె జరిగిన విషయాన్ని భర్తకు వివరించింది. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగరాదని ధైర్యం చేసి పలమనేరు సీఐ బాలయ్యకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. నయవంచక టీచర్ బారినపడిన బాధితులు ఎందరో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ బాలయ్య తెలిపారు. అక్రమ కేసులు ఎత్తివేయాలి : సీఐటీయూ తిరుపతి సిటీ, న్యూస్‌లైన్ : పలమనేరు ఏరియా ఆస్పత్రిలో సమస్యలపై ధర్నా చేసిన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. సీటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన కౌన్సి ల్ సమావేశంలో ఆయన జిల్లా అధ్యక్షుడు చైతన్యతో కలిసి మాట్లాడా రు. ఈ నెల 3వ తేదీన ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశ్నించిన సీఐటీయూ నాయకులు ఓబుల్రాజు, గిరిధర్గుప్తాపై అక్ర మ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. -
ఫేస్.. బుక్కయ్యారు!
సామాజిక అనుసంధాన వేదిక అయిన ఫేస్‌బుక్‌ను కొందరు బ్లాక్‌మెయిలింగ్‌కు వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖుల పేరిట నకిలీ అకౌంట్లను తెరిచి దుర్వినియోగం చేస్తున్నారు. అశ్లీల చిత్రాలు, రాతలతో వెగటు పుట్టిస్తూ పరువును బజారుకీడుస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇప్పటికే ఎందరో వీఐపీలు వివరణలు ఇచ్చుకున్న సందర్భాలున్నాయి. ఇదే పరంపరలో ఫేస్బుక్ మాయాజాలం కోరుట్లలో కలకలం రేపింది. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల అశ్లీల చిత్రాలు సోమవారం రాత్రి కోరుట్లకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం కొందరు ప్రముఖ నాయకులకు దడ పుట్టిస్తోంది. ఈ విషయమై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాలు తీస్తున్న క్రమంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కోరుట్ల, న్యూస్‌లైన్ : నెల క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన ఓ యువకుడు ఓ మహిళతో అశ్లీలంగా ఉన్న చిత్రాలు పట్టణానికి చెందిన ఓ మహిళ ఫేస్బుక్ అకౌంట్లలో ప్రత్యక్షమయ్యాయి. ఈ యువకునితోపాటు మరికొందరు స్థానికులకు సంబంధించిన అసభ్యకరమైన చిత్రాలు, వీడియో క్లిప్పింగ్‌లు అదే ఫేస్బుక్ అకౌంట్లలో కనిపించాయి. సదరు ఫేస్బుక్ అకౌంట్లో మహిళగా చెప్పుకున్న వ్యక్తి చాటింగ్ పేరిట ఎరవేసి కొందరి అశ్లీల చిత్రాలు సంపాదించి అవే చిత్రాల ఆసరాతో వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతున్నట్లు వెల్లడైంది. దీంతో సదరు బాధితులు తమకు జరిగిన మోసంపై పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే సదరు ఫేస్బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. రూ.లక్షల్లో గుంజారు.. నెల క్రితం బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు స్థానికులు ఒకరిద్దరిని పోలీసు ఠాణాకు పిలిపించి విచారించారు. ఆ సమయంలో కల్లూర్ రోడ్లో నివాసముండే ఓ యువకునితో చాటింగ్ చేసిన ఫేస్బుక్ మహిళ.. అతని అశ్లీల చిత్రాలు సంపాదించి అనంతరం అవే ఫొటోలతో బెదిరించి తన అకౌంట్లో రూ.24వేలు వేయించుకున్నట్లు తేలింది. ఇదేరీతిలో మహిళ పేరిట ఫేస్బుక్ అకౌంట్నిర్వహిస్తున్న వ్యక్తి పట్టణానికి చెందిన వివిధ పార్టీల ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారి అశ్లీల ఫొటోలు సంపాదించి మళ్లీ వాటిని అందరికి పంపుతామని బెదిరింపులు మొదలెట్టారు. అంతా ప్రముఖులు కావడంతో తమ పరువు పోతుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా సదరు ఫేస్బుక్ మహిళ చెప్పిన అకౌంట్లో రూ.లక్షల్లో డబ్బులు వేసి మిన్నకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా ఆ అకౌంట్ నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ మహిళ పేరిట ఉన్నట్లు వెల్లైడె ంది. పోలీసులు మరింత లోతుకు వెళ్లగా సదరు బ్యాంకు అకౌంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తి పరారైనట్లు సమాచారం. తర్వాత కొద్దిరోజులు పోలీసుల విచారణకు బ్రేక్ పడింది. కొత్త అకౌంట్‌తో మళ్లీ బ్లాక్మెయిల్ పోలీసుల విచారణతో మహిళ పేరిట ఫేస్బుక్ అకౌంట్ నిర్వహిస్తున్నట్లు తేలిన వ్యక్తి జాగ్రత్తపడి దుబాయ్‌కి పరారైనట్లు సమాచారం. దుబాయ్ వెళ్లిన సదరు వ్యక్తి మళ్లీ కోరుట్లకు చెందిన మరో మహిళ పేరిట బోగస్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మళ్లీ ప్రముఖులతో చాటింగ్ మొదలెట్టినట్లు తెలిసింది. నెల రోజుల క్రితం పట్టణానికి చెందిన పలువురు ఇదే రీతిలో మోసపోయిన విషయాన్ని పెద్దగా పట్టించుకోని మరికొన్ని పార్టీల నాయకులు కొందరు మళ్లీ సదరు ఫేస్బుక్ అకౌంట్ వ్యక్తితో చాటింగ్ మొదలెట్టారు. ఈ క్రమంలో చాటింగ్ చేస్తున్న నాయకులు అశ్లీల ఫొటోలు సంపాదించిన ఫేస్బుక్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి మళ్లీ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ బెదిరింపులను కొందరు నాయకులు పట్టించుకోకపోవడంతో వారి అశ్లీల ఫొటోలను సోమవారం ఫేస్బుక్లో పెట్టినట్లు తెలిసింది. దీంతో ఉలిక్కిపడ్డ సదరు నాయకులు సోమవారం సీఐ మహేష్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మళ్లీ కూపీ లాగి నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బోగస్ ఫేస్బుక్ అకౌంట్ కథ ఏమిటి? పోలీసుల విచారణలో మహిళల పేరిట బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కథలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాడని తేలింది. ఆ వ్యక్తిగతంలో తనకు ప్రియురాలిగా ఉన్న కోరుట్లకు చెందిన ఓ యువతి ఫొటోలను సంపాదించి వాటినే ఫేస్బుక్లో పెట్టి ప్రముఖులతో చాటింగ్ చేస్తూ వారికి అశ్లీల మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వలవేసి చివరికి వారి అశ్లీల ఫొటోలను సేకరించినట్లు తెలుస్తోంది. బోగస్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తి కోదాడకు చెందిన మహిళతో సంబంధాలు నెరుపుతూ ఆమె అకౌంట్లో డబ్బులు వేయించి ఆమె సాయంతోనే డ్రా చేసుకున్నట్లు సమాచారం. నెలరోజలు క్రితం ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారై దుబాయ్‌కి చేరుకుని, అక్కడనుంచే మళ్లీ బోగస్ ఫేస్‌బుక్‌ల పేరిట మాయ చేస్తున్నట్లు తెలిసింది. ఇదంతా నడుపుతున్నది ఒక్కరేనా.. ఇంకా ఎవరికైనా పాత్ర ఉందా.. ఈ వ్యవహారంలో మహిళలు ఎవరైనా ఉన్నారా.. కోరుట్ల వాసుల వివరాలు స్థానికులకు సంబంధం లేకుండా ఎలా తెలుస్తున్నాయి.. అన్న అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. పోలీసులు మరింత పకడ్బందీగా విచారణ సాగిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.