నాకు లొంగకపోతే.. నీకు పెళ్లికాకుండా చూస్తా! | Man Molested On Girl In Hyderabad | Sakshi
Sakshi News home page

బెదిరించి యువతిపై లైంగికదాడికి యత్నం 

Published Wed, Nov 17 2021 8:21 AM | Last Updated on Sat, Nov 20 2021 11:16 AM

Man Molested On Girl In Hyderabad - Sakshi

నిందితుడు నవీన్‌

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): నీ తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.. నువ్వు లొంగకపోతే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ ఓ యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన పూర్ణకంటి నవీన్‌(29) గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేస్తూ రహ్మత్‌నగర్‌లో అద్దెకుంటున్నాడు.

గత రెండు సంవత్సరాల నుంచి స్థానికంగా నివసిస్తున్న విద్యార్థినిని వెంబడిస్తూ, వేధిస్తూ తనతో రాకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. పలుమార్లు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆదివారం ఉదయం నవీన్‌ ఆ యువతి ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఆమె తీయలేదు. వెంటనే బాధితురాలు 100కు డయల్‌ చేసింది. పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకొని నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తాను కాలేజీకి వెళ్లే సమయంలో వెంబడిస్తూ బైక్‌పై బలవంతంగా కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తన తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తానని వేధిస్తున్నట్లు కూడా ఆరోపించింది. పోలీసులు నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ నవీన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement