సాక్షి, హైదరాబాద్: మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చెప్పాలి. ఢిల్లీ కేంద్రంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ బుషన్ ఘటన మరువకముందే మరో బ్రిజ్ బుషన్ ఆగడాల వెలుగులోకి వచ్చాయి. తాజాగా తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది.
అయితే అధికారులు మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదని.. లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ మంత్రికి ట్యాగ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్ చేశామని, స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోము. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
@raokavitha అక్క, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తాం. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపుల వార్తలపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి… https://t.co/O2rDflRUWU
— V Srinivas Goud (@VSrinivasGoud) August 13, 2023
Comments
Please login to add a commentAdd a comment