- ఇప్పటి వరకు 24మంది బాధితుల గుర్తింపు
- మహిళా పోలీసులతో కౌన్సెలింగ్
- బాధితులు ముందుకు రావాలని సూచన
విజయవాడ సిటీ : కళాశాల విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సాయిరామ్ గ్యాంగ్‌పై మరో కేసు నమోదైం ది. నగరానికి చెందిన ఓ బాధిత కు టుంబం ఫిర్యాదు మేరకు మహిళా పో లీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరామ్ అలియాస్ రామ్‌చరణ్ తన సహచరులతో కలిసి ఏడాదిన్నర కాలంగా కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరి ట మభ్యపెట్టి రహస్యంగా నీలి చిత్రాలు తీసి బెదిరిస్తున్న విష యం తెలిసిందే. వీరిపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 23న సాయిరామ్, పర్శపు దీపక్, పసుమతి అభిలాష్ కుమార్, షేక్ ము న్నాను అరెస్టు చేశారు.
ఈ కేసులో మరో మైనర్‌ను జువనైల్‌హోంకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీ సులు ఇచ్చిన భరోసాతో నగరానికి చెందిన ఓ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వీరి మాయలో పడిన విద్యార్థినితో నీలి చిత్రాలను తీసి సాయిరామ్ గ్యాంగ్ బ్లాక్‌మెయిలింగ్ చేసింది. ఆమె నీలి చిత్రాల విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. పరువుపోతుందని భావించిన బా ధిత కుటుంబం విషయాన్ని బయటకు చెప్పుకోలేదు. నిందితుల అరెస్టు సందర్భంగా పోలీసులు ఇచ్చిన భరోసాతో జరిగిన విషయాన్ని పేర్కొంటూ పోలీ సులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
బాధితులకు కౌన్సెలింగ్
నిందితులను అరెస్టు చేసే నాటికి 10 మంది బాధితులు మాత్రమే తమ కు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కొం తకాలంగా మరికొందరు విద్యార్థినులను వీరు వలలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించారు. నింది తుల ఫోన్‌కాల్స్, పంపిన ఎస్.ఎం.ఎస్‌లను పరిశీలించిన పోలీసులు.. ఇప్పటి వరకు సాయిరామ్ గ్యాంగ్ చేతిలో 24 మంది మోసపోయినట్టు గుర్తించారు. వీరిని, వీరి కుటుంబ స భ్యులను పిలిపించి మహిళా పోలీ సులతో కౌన్సెలింగ్ నిర్వహించారు.
ధైర్యంగా ముందుకు రండి
సాయిరామ్ గ్యాంగ్ లేదా మరే ఇతర ముఠాల చేతిలో ఈ తరహా మోసానికి గురైన బాధితులు ధై ర్యంగా పోలీసులకు సమాచారం ఇ వ్వాలని నగర పోలీసు అధికారులు కోరుతున్నారు. మోసపోయిన వా రు మిన్నకుండవద్దని, బాధితులు పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీరి వివరాల ను గోప్యంగా ఉంచడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు, ఇతర వివరాలు నమోదు చేయబోమని పోలీసు అధికారులు పేర్కొన్నారు.