Blue pictures
-
డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని..
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆన్లైన్ ప్రకటనల ద్వారా నీలి చిత్రాలను షేర్ చేసిన యువ ఇంజనీర్‌ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ పకీర్‌గూడెంకు చెందిన సోహెల్ (24) ఒక ళాశాలలో ఇంజనీరింగ్ పట్టా తీసుకుని వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. ఆ ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో జీతం రావడం లేదని మానేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నీలి చిత్రాలు అమ్మబడును అనే ఒక ప్రకటన చూసి ఆకర్షితుడైన సోహెల్ వాటిని పొందాలని భావించాడు. చదవండి: వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో.. వారిని ఆన్లైన్లో సంప్రదించటమే కాకుండా కొంత నగదు కూడా పంపించాడు. కొద్ది సేపటికే అతని మొబైల్‌కు ఒక లింక్ వచ్చింది. దానిని తెరిచి చూడగా 18 ఏళ్ల వయసులోపు పిల్లల నీలిచిత్రాలు 4వేల వరకు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని.. ఆ నీలిచిత్రాలను ఉపయోగించుకుని ఆన్లైన్లో డబ్బు సంపాదించాలని వాటిని తక్కువ ధరకు అమ్మబడును అని ఆన్లైన్లో ఒక ప్రకటన ఇచ్చాడు. దానిని చూసిన ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు. -
నగరం నుంచి అశ్లీల చిత్రాల అప్లోడ్
వేలకొద్దీ షేర్ చేస్తున్న అమెరికా ఉద్యోగి మాదాపూర్‌లో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు 29,288 పోర్న్ వీడియోలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లల అశ్లీల, నీలి చిత్రాలు, ఫొటోలను సేకరించి వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్న అమెరికా ఉద్యోగిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 29,288 చైల్డ్ పోర్నోగ్రఫీ చిత్రాలున్న ల్యాప్‌టాప్, ఐఫోన్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్కిర్క్ జాన్స్ మాదాపూర్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో లీగల్ విభాగంలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటుపడ్డాడు. కొద్ది రోజులుగా చిన్న పిల్లల నగ్న, అశ్లీల చిత్రాలను పోర్న్ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి... వాటిని తిరిగి ట్విట్టర్, గిగాట్రైబ్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్టు గత నెలలో ఢిల్లీలోని సీబీఐ, ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించారు. వారు వెంటనే రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐటీ యాక్ట్ 67 (ఏ), (బి)కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 490 గిగాట్రైబ్... 24 ట్విట్టర్ ఖాతాలు... ఈ మేరకు సీఐడీ అధికారులు మంగళవారం జేమ్స్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అతడు 490 గిగాట్రైబ్, 24 ట్విట్టర్ ఖాతాల్లో చిన్నపిల్లల అశ్లీలచిత్రాలను షేర్ చేసినట్టు గుర్తించారు. వెంటనే జేమ్స్‌ను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు సీఐడీ ఐజీ తెలిపారు. అతడి నుంచి 29,288 అశ్లీల చిత్రాలున్న ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నివేదిక వచ్చాకే నిర్ణయం : సీఎం
మైసూరు : రాయచూరులో గురువారం టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమంలో మంత్రి తన్వీర్ సేఠ్ తన మొబైల్లో నీలి చిత్రాలను చూశారన్న విషయం ఇప్పటి వరకు తనకు తెలియదని, ఈ విషయంపై తాను స్వయంగా మంత్రి తన్వీర్ సేఠ్‌కు ఫోన్ చేసి వివరణ కోరినట్లు సీఎం సిద్ధు తెలిపారు. శుక్రవారం ఉదయం బెల్గాం పర్యటనకు వెళ్లడానికి ముందు మైసూరు నగరంలోని రామకృష్ణ నగరలో ఉన్న తమ నివాసంలో ఆయన ప్రజా ఫిర్యాదుల అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి తన్వీర్ సేఠ్ తన మొబైల్లో నీలి చిత్రాలు చూశారన్న విషయం తనకు తెలియదని, మీడియాలో వచ్చిన కథనాలపై తాను పూర్తి వివరణ కోరినట్లు చెప్పారు. నీలి చిత్రాలు చూసిన మాట నిజమైతే రాజీనామా తీసుకుంటారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజా నిజాలు విచారణ చేయకుండానే రాజీమాను ఎలా తీసుకుంటారు అంటూ అయన మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు. పోలీసుల వేతనాల పెంపుపై ఇప్పటికే ఆర్థిక శాఖకు వివరాలు పంపించినట్లు సీఎం ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
నీలి చిత్రాలు చూపించి...
ముగ్గురు బాలికలపై అత్యాచారం బెంగళూరు: నీలి చిత్రాలను చూపించి ఓ మృగాడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడు. మైసూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మైసూరులోని శాంతినగర్‌లో నివసిస్తున్న నవాజ్ అహ్మద్ (30)కు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనిచేస్తుంటాడు. పిల్లలు శనివారం పాఠశాలకు వెళ్లారు. భార్య పుట్టింటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి పక్కనే ఉన్న 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలికలను ఇంట్లోకి పిలిచి జ్యూస్ ఇచ్చాడు. అనంతరం నీలి చిత్రాలను చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పకూడదని, ప్రతి రోజూ ఇదే సమయంలో వస్తే సినిమాలు చూద్దామని చెప్పి ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుణ్ని అరెస్టు చేశారు. -
పైశాచికం
నగరంలో దారుణం చిన్నారులపై లైంగికదాడులు పోలీసుల అదుపులో కామాంధులు కాటేదాన్/లంగర్‌హౌస్: నగరంలో కామాంధులు రెచ్చిపోయారు. అభం శుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నీలి చిత్రాలు చూపిస్తూ లైంగికదాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలను ఖండించాల్సిన బడాబాబులు నిందితులకు అండగా నిలవడం శోచనీయం. బాధితులను భయపెట్టారు.సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ సంఘటనలు మైలార్‌దేవ్‌పల్లి, లంగర్‌హౌస్, ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగాయి. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టాటానగర్ ప్రాంతంలోని ప్లాస్టిక్, స్క్రాబ్ గోదాములో మహ్మద్ అన్వర్(50) మేనేజర్గాపనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ధరమ్‌సింగ్, చింతాబాయి దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె(11) మైలార్‌దేవ్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడోతరగతి చదువుతోంది. తల్లి చింతాబాయి ప్లాస్టిక్ గోడౌన్లో దినసరి కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఇంటివద్ద ఒంటరిగా ఉన్న చిన్నారిపై కన్నేశాడు అన్వర్. సినిమా చూపిస్తానని మాయమాటలు చెప్పి రూమ్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ నీలిచిత్రం చూపించడమేగాక చిన్నారి పట్ల తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన అన్వర్ లైంగికదాడి విషయాన్ని ఎవరికి చెప్పరాదంటూ భయపెట్టాడు. అనంతరం ఇంటివద్దే వదిలిపెట్టాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో చిన్నారి స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడం గమనించిన తల్లి ఏమి జరిగిందని నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిని నిలదీయడంతో వైద్యపరీక్షలు చేయిస్తానని బేరానికి దిగాడు. వైద్యపరీక్షలు చేయించేందుకు నగరంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాకు చెందిన జహీరా కుటుంబం లంగర్‌హౌస్ హాషంనగర్‌లో నివాసముంటోంది. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం. కుమార్తె(7) ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతోంది. పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న ఆజం(35) వీరి ఇంటిపక్కనే నివాసముంటూ సన్నిహితంగా మెలిగేవాడు. జహీరా దంపతులు బయటకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న జహీరా కుమారుడికి డబ్బులు ఇచ్చి చాక్లెట్లు తెచ్చుకోమని పంపాడు. చిన్నారికి ఇంటిపక్కన ఉన్న ఖాళీ స్థలానికి తీసుకువెళ్లాడు. ఫోన్లో నీలిచిత్రాలు చూపిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటిరోజు చిన్నారి నొప్పితో ఏడుస్తుండడటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఆగ్రహం చెందిన వారు నిందితుడు ఆజంను నిలదీశారు. అత్యాచార ఘటన బహిర్గతం కావడంతో కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు. కామాంధుడు ఆజంకు వత్తాసు పలికారు. పోలీసుల వద్దకు వెళ్లకుండా ఇచ్చిన డబ్బుతో వైద్యం చేయించుకోవాలన్నారు. విషయం బయటపెడితే ఇక్కడ ఇళ్లల్లో పనిదొరకకపోవడమే కాదు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు చేశారు. భయంతో జహీరా స్వగ్రామానికి వెళ్లిపోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. డీసీపీ, ఏసీపీలు లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు పరిశీలించారు. ఈ కేసులో నిందితులకు మద్దతు తెలిపిన వారిని కూడా వదలబోమని వారు తెలిపారు. -
సాయిరామ్ గ్యాంగ్‌పై మరో కేసు
ఇప్పటి వరకు 24మంది బాధితుల గుర్తింపు మహిళా పోలీసులతో కౌన్సెలింగ్ బాధితులు ముందుకు రావాలని సూచన విజయవాడ సిటీ : కళాశాల విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సాయిరామ్ గ్యాంగ్‌పై మరో కేసు నమోదైం ది. నగరానికి చెందిన ఓ బాధిత కు టుంబం ఫిర్యాదు మేరకు మహిళా పో లీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరామ్ అలియాస్ రామ్‌చరణ్ తన సహచరులతో కలిసి ఏడాదిన్నర కాలంగా కాలేజీ విద్యార్థినులను ప్రేమ పేరి ట మభ్యపెట్టి రహస్యంగా నీలి చిత్రాలు తీసి బెదిరిస్తున్న విష యం తెలిసిందే. వీరిపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 23న సాయిరామ్, పర్శపు దీపక్, పసుమతి అభిలాష్ కుమార్, షేక్ ము న్నాను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో మైనర్‌ను జువనైల్‌హోంకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీ సులు ఇచ్చిన భరోసాతో నగరానికి చెందిన ఓ బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వీరి మాయలో పడిన విద్యార్థినితో నీలి చిత్రాలను తీసి సాయిరామ్ గ్యాంగ్ బ్లాక్‌మెయిలింగ్ చేసింది. ఆమె నీలి చిత్రాల విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి రూ.4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. పరువుపోతుందని భావించిన బా ధిత కుటుంబం విషయాన్ని బయటకు చెప్పుకోలేదు. నిందితుల అరెస్టు సందర్భంగా పోలీసులు ఇచ్చిన భరోసాతో జరిగిన విషయాన్ని పేర్కొంటూ పోలీ సులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బాధితులకు కౌన్సెలింగ్ నిందితులను అరెస్టు చేసే నాటికి 10 మంది బాధితులు మాత్రమే తమ కు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కొం తకాలంగా మరికొందరు విద్యార్థినులను వీరు వలలో వేసుకునేందుకు చేసిన ప్రయత్నాలను గుర్తించారు. నింది తుల ఫోన్‌కాల్స్, పంపిన ఎస్.ఎం.ఎస్‌లను పరిశీలించిన పోలీసులు.. ఇప్పటి వరకు సాయిరామ్ గ్యాంగ్ చేతిలో 24 మంది మోసపోయినట్టు గుర్తించారు. వీరిని, వీరి కుటుంబ స భ్యులను పిలిపించి మహిళా పోలీ సులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ధైర్యంగా ముందుకు రండి సాయిరామ్ గ్యాంగ్ లేదా మరే ఇతర ముఠాల చేతిలో ఈ తరహా మోసానికి గురైన బాధితులు ధై ర్యంగా పోలీసులకు సమాచారం ఇ వ్వాలని నగర పోలీసు అధికారులు కోరుతున్నారు. మోసపోయిన వా రు మిన్నకుండవద్దని, బాధితులు పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీరి వివరాల ను గోప్యంగా ఉంచడంతో పాటు ఎఫ్ఐఆర్లో పేర్లు, ఇతర వివరాలు నమోదు చేయబోమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
ఆకర్షించి.. అగాధంలోకి నెట్టి...
విద్యార్థినుల నీలిచిత్రాలు తీసిన ముఠా అరెస్టు తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త ధైర్యంగా పోలీసుల వద్దకు రండి వాళ్లంతా ఇంటర్ చదివే విద్యార్థినులు. తెలిసీ తెలియని వయస్సులో మోసగాళ్ల ‘ఆకర్షణ’లో పడ్డారు. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయంలో అగాధంలో చిక్కుకున్నారు. ఆ విష ‘వలయం’ నుంచి బయటకు రాలేక విలవిల్లాడారు. ఎట్టకేలకు ఓ బాధితురాలు ధైర్యం చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నీలిచిత్రాల ముఠా సభ్యులను కటకటాల్లోకి నెట్టారు. విజయవాడ సిటీ : నగరం మెట్రో సంస్కృతి వైపు శరవేగంగా అడుగులు వేస్తూనే..ప్రమాదకర సంకేతాలు(డేంజర్ సిగ్నల్స్) పంపుతోంది. మెట్రో కల్చర్‌ను అవకాశంగా తీసుకుని కాలేజీ విద్యార్థినులను ఆకర్షించి వలలో వేసుకుని నీలి చిత్రాలు తీసి..ఆపై బ్లాక్ మెయిలింగ్ చేసి సొమ్ము చేసుకునే ముఠాలు తయారయ్యాయి. ఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర కాలంగా ఏడుగురు సభ్యుల ముఠా 10మందికి పైగా ఇంటర్ చదివే కాలేజీ విద్యార్థినులను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసి..బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టు గుర్తించామని నగర పోలీసు కమిషనర్ ఎ.బి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం డీసీపీ(శాంతి భద్రతలు) తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. కానూరుకు చెందిన నిమ్మకూరి సాయిరాం అలియాస్ రాంచరణ్(పాత నేరస్తుడు), కృష్ణలంకకు చెందిన పరశపు దీపక్, గాంధీనగర్‌కు చెందిన పసుమతి అభిలాష్, నున్నకు చెందిన షేక్ మున్నా, మరో ఇద్దరు, ఓ మైనరు కలిసి ఈ అనైతిక చర్యలకు ఒడిగట్టినట్టు తెలిపారు. వీరు విద్యార్థినులను మభ్యపెట్టి తీసిన నీలిచిత్రాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమ ఇళ్లల్లో, గదుల్లో రహస్యంగా అమర్చిన కెమెరాలతోనూ, సెల్పోన్ల ద్వారా నీలి చిత్రాలు తీసినట్టు పోలీసులు గుర్తించారు. కొందరికి మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితిలో ఉండగా నీలి చిత్రాలు తీశారన్నారు. వీరు నీలి చిత్రాలు తీస్తున్న విషయం విద్యార్థినులకు తెలియదని, కొందరికి తెలిసినా బయటకు తెలిస్తే పరువుపోతుందని చెప్పుకోలేదన్నారు. నేరస్తులందరికీ అక్కా చెల్లెళ్లు ఉండటం విశేషమని పోలీసు కమిషనర్ చెప్పారు. ధైర్యంగా ముందుకు రండి... ఇంకా ఇలాంటి ముఠాలు ఉండొచ్చని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రావాలని, సున్నిత అంశం కాబట్టి బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయమని ఆయన అన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులుంటే నమ్మకమైన తెలిసిన వ్యక్తుల ద్వారా తగిన ఆధారాలు పోలీసులకు అందజేసినా సరిపోతుందన్నారు. కఠిన చర్యలు... విద్యార్థులు చదువుకోవడమే లక్ష్యంగా కళాశాలలకు వెళ్లాలని, అంతే తప్ప ఈవ్‌టీజింగ్ వంటి చర్యలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఇప్పటికే పోలీసు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు. తల్లిదండ్రులూ జాగ్రత్త కాలేజీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసు కమిషనర్ సూచించారు. వీరి చేతిలో మోసపోయిన వారిని పరిశీలిస్తే తల్లిదండ్రులు, సమాజం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్టు వెల్లడవుతోందన్నారు. మోసపోయిన వారిలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వారేనని, చిన్నపాటి బైకుపై తిరగడం..హోటల్స్‌కు వెళ్లడం వంటి చిన్నపాటి కోరికలకు వీరు లొంగిపోయారన్నారు. ఆ తర్వాత నిందితులు డబ్బులు కావాలంటే వంటిపై ఉన్న గొలుసులు, చెవి రింగులు కూడా ఇచ్చారన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రశంసలు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రహస్య విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు టీమును పోలీసు కమిషనర్ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీలు నక్కా సూర్యచంద్రరావు, కె.లావణ్యలక్ష్మీ, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘నెట్’లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు
ఐదుగురు బీటెక్ విద్యార్థులు, డ్రైవర్ అరెస్టు బోడుప్పల్: తమకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే నగ్న వీడియో చిత్రాలను ఇంటర్నెట్లో పెడతామని యువతిని బెదిరించిన ఆరుగురిని శుక్రవారం మేడిపల్లి పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక కారు డ్రైవర్ ఉన్నా డు. ఎస్ఐ టంగుటూరి శ్రీను కథనం ప్రకారం... నగరంలోని హైదర్‌గూడకు చెందిన దుగ్గిరాల గౌతం (19) బీటెక్ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కట్టేందు కు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును జల్సాలకు వాడుకున్నాడు. ఫీజు కట్టేందుకు ఏదో విధంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజేం దర్ అనే కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురు బీటె క్ విద్యార్థులు రోహిత్(19), అనరుద్(19), సందీప్(19) ప్రేంచంద్(19)లతో కలిసి ముఠా కట్టాడు. మే డిపల్లికి చెందిన మహిళ (35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ముఠాలోని అనురుధ్ ఆమెకు ఫోన్ చేసి.. ‘మీ నగ్న చిత్రాలు మావద్ద ఉన్నాయి. మాకు రూ.1.20 ల క్షలు ఇవ్వండి. లేకపోతే వాటిని ఇంటర్నెట్లో పెట్టేస్తాం. మీ భర్తకు పంపడంతో పాటు అందరి సెల్ఫోన్లకు పంపిస్తాం’ అని బెదిరించాడు. బాధితురాలు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులు గౌతం, రోహిత్, అనరుథ్, సందీప్, ప్రేంచంద్ డ్రైవర్ రాజేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
నీలిచిత్రాలు తీసిన వ్యక్తి అరెస్ట్
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో నీలిచిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్ర రమేశ్ అనే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గోదావరిఖని డీఎస్పీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్‌లో మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమేశ్ ఇద్దరు మహిళలను అశ్లీలంగా వీడియో తీశాడు. వీటిలో తాను కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ అశ్లీల చిత్రాలను ఇతర మొబైల్స్‌కు బ్లూటూత్ ద్వారా పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నీలిచిత్రాలను ఉద్దేశపూర్వకంగా తీసినట్లు తేలింది. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మహిళలను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడా? ఇతడికి ఇంకెవరైనా సహకరించారా? ఈయన బారినపడిన మహిళలు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ చెప్పారు. రమేశ్‌పై నిర్భయ చట్టంతోపాటు 292 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. మహిళలను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసినా, తీస్తున్నట్లు తెలిసినా తనకు(94407 95133) సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని, వీరితోపాటు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సకాలంలో సమాచారం ఇస్తే బాధితులకు నష్టాన్ని తగ్గించే వీలుంటుందని, బాధితులు పబ్లిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తానని పేర్కొన్నారు. -
అశ్లీల ఫొటోలను కనిపెట్టే టూల్!
లండన్: ఇంటర్నెట్లో అశ్లీల ఫొటోలను కనిపెట్టి, నెట్‌వర్క్‌ను క్లీన్ చేసేందుకు ఉపయోగపడే వ్యవస్థను నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చిన్నపిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలుగా మార్చి నెట్లో పెడితే గనక.. ఈ టూల్‌తో సులభంగా స్కాన్ చేసి వాటిని పట్టుకోవచ్చట. ఇంటర్నెట్ వినియోగదారుల ప్రైవసీ, హక్కులకు భంగం కలగకుండానే అన్ని రకాల అక్రమ ఫొటోలనూ వెతికేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీనిని ఉపయోగించి సర్వీసు ప్రొవైడర్లు కూడా తమ నెట్‌వర్క్‌ను క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అయితే భద్రతా కారణాల వల్ల పోలీసులు మాత్రమే ఉపయోగించేలా దీనిని రూపొందించారు. నెట్‌వర్క్‌లోనే కాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లోనూ అశ్లీల ఫొటోలను ఈ టూల్‌తో స్కాన్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లలో ఇతర సమాచారమేదీ తెలుసుకోకుండా అశ్లీల ఫొటోలను మాత్రమే ఈ టూల్‌తో స్కాన్ చేయొచ్చట. అశ్లీల ఫొటోలను స్కాన్చేసిన తర్వాత ఈ టూల్ నివేదిక ఇస్తుందని, దానిని పోలీసులు ప్రత్యేక ‘కీ’ సాయంతో తెరవగలరని పరిశోధకులు పేర్కొన్నారు.