‘నెట్’లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు | 'Threats to put pictures of the blue netlo | Sakshi
Sakshi News home page

‘నెట్’లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు

Published Sat, Aug 16 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

'Threats to put pictures of the blue netlo

  • ఐదుగురు బీటెక్ విద్యార్థులు, డ్రైవర్ అరెస్టు
  • బోడుప్పల్: తమకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే నగ్న వీడియో చిత్రాలను ఇంటర్నెట్‌లో పెడతామని యువతిని బెదిరించిన ఆరుగురిని శుక్రవారం మేడిపల్లి పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక కారు డ్రైవర్ ఉన్నా డు. ఎస్‌ఐ టంగుటూరి శ్రీను కథనం ప్రకారం...  

    నగరంలోని హైదర్‌గూడకు చెందిన దుగ్గిరాల గౌతం (19) బీటెక్ చదువుతున్నాడు.  కాలేజీ ఫీజు కట్టేందు కు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును జల్సాలకు వాడుకున్నాడు. ఫీజు కట్టేందుకు ఏదో విధంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజేం దర్ అనే కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురు బీటె క్ విద్యార్థులు  రోహిత్(19), అనరుద్(19), సందీప్(19) ప్రేంచంద్(19)లతో కలిసి ముఠా కట్టాడు.  మే డిపల్లికి చెందిన మహిళ (35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది.

    ముఠాలోని అనురుధ్ ఆమెకు ఫోన్ చేసి.. ‘మీ నగ్న చిత్రాలు మావద్ద ఉన్నాయి. మాకు రూ.1.20 ల క్షలు ఇవ్వండి. లేకపోతే వాటిని ఇంటర్నెట్‌లో పెట్టేస్తాం.  మీ భర్తకు పంపడంతో పాటు అందరి సెల్‌ఫోన్లకు పంపిస్తాం’ అని బెదిరించాడు.  బాధితురాలు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు నిందితులు గౌతం, రోహిత్, అనరుథ్, సందీప్, ప్రేంచంద్ డ్రైవర్ రాజేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement