లండన్: ఇంటర్నెట్‌లో అశ్లీల ఫొటోలను కనిపెట్టి, నెట్‌వర్క్‌ను క్లీన్ చేసేందుకు ఉపయోగపడే వ్యవస్థను నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చిన్నపిల్లల ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫొటోలుగా మార్చి నెట్‌లో పెడితే గనక.. ఈ టూల్‌తో సులభంగా స్కాన్ చేసి వాటిని పట్టుకోవచ్చట. ఇంటర్నెట్ వినియోగదారుల ప్రైవసీ, హక్కులకు భంగం కలగకుండానే అన్ని రకాల అక్రమ ఫొటోలనూ వెతికేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. దీనిని ఉపయోగించి సర్వీసు ప్రొవైడర్లు కూడా తమ నెట్‌వర్క్‌ను క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అయితే భద్రతా కారణాల వల్ల పోలీసులు మాత్రమే ఉపయోగించేలా దీనిని రూపొందించారు.
నెట్‌వర్క్‌లోనే కాకుండా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లోనూ అశ్లీల ఫొటోలను ఈ టూల్‌తో స్కాన్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లలో ఇతర సమాచారమేదీ తెలుసుకోకుండా అశ్లీల ఫొటోలను మాత్రమే ఈ టూల్‌తో స్కాన్ చేయొచ్చట. అశ్లీల ఫొటోలను స్కాన్‌చేసిన తర్వాత ఈ టూల్ నివేదిక ఇస్తుందని, దానిని పోలీసులు ప్రత్యేక ‘కీ’ సాయంతో తెరవగలరని పరిశోధకులు పేర్కొన్నారు.