లండన్: ఎలుకల సంగతి అందరికీ తెలిసిందే.. తాము తినేవే కాదు అడ్డం వచ్చిన ఏ వస్తువులను కూడా వదలిపెట్టవు. తమ ఇంట్లో ఎలుకలు ఉన్నవారికి వీటి శాడిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ తరహాలోనే ఎలుకల కారణంగా ఏకంగా రెండు వేల మంది ఇంటర్‌నెట్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే. (చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..)
ఇటీవల ఆ ఎలుకల గుంపు ఇంటర్‌నెట్ కేబుళ్లను సైతం వదలక, ఇష్టం వచ్చినట్లు కొరికిపడేశాయి. దీంతో టోరిడ్జ్ ప్రాంతంలో 1800 మంది, డేవాన్ ప్రాంతంలో 200 మంది వరకు వైఫై సేవలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. బీటీ, వొడాఫోన్, ప్లస్‌నెట్,స్కై, ఇతర కంపెనీల సేవలు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేగాక అక్టోబర్ 14న వీటి చర్యలకు దాదాపు ఏడు గంటల పాటు కాల్స్ సేవలు నిలిచిపోయాయి. గత రెండు నెలల నుంచి ఆ ప్రాంత స్థానికుల ఇంటర్నెట్ సౌకర్యంగా సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
దీనిపై స్థానిక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. బిడ్‌ఫర్డ్, క్లోవెల్లీ, హార్ట్‌ల్యాండ్ ప్రాంతాల్లో టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాల్లో దాదాపు 1800 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మునుపటి పరిస్థితి తీసుకొచ్చేందుకు వారికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు.
చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..
Comments
Please login to add a commentAdd a comment