residents
-
Sambhal: సొంత ఇళ్లను కూలగొట్టుకుంటున్న మైనారిటీలు
బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల పురాతన శివాలయం బయటపడింది. ఈ వార్త సంచలనంగా మారడంతో ఈ పురాతన ఆలయం చుట్టుపక్కలగల మైనారిటీ వర్గాల వారు తమ ఇళ్లను కూల్చివేసుకుంటున్నారు.పురాతన శివాలయం ఆనవాళ్లు వెలుగు చూసిన దరిమిలా జిల్లా యంత్రాంగం ఆ చుట్టుపక్కల గల ఆక్రమణను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. ఇంతలోనే అప్రమత్తమైన స్థానిక మైనారిటీ వర్గాలవారు తమ ఇళ్లను కూల్చివేయడం ప్రారంభించారు. ఆక్రమణల పేరుతో జిల్లా అధికారులు తమ ఇళ్లను కూల్చివేసేలోగానే, ఇంటిలోని విలువైన వస్తువులను మరో చోటుకు తరలించి, తమ ఇళ్లను మైనారిటీ వర్గాలవారు కూల్చివేసుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ సంభాల్‌లో విద్యుత్ చౌర్యానికి పాల్పడున్న వారిపై దాడులకు ఉపక్రమించింది. ఇటీవలే అక్రమ నిర్మాణం ఆరోపణలపై నోటీసు అందుకున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ ఇంటిపై విద్యుత్ అధికారులు దాడులు చేశారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో జరుగుతున్న విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి రూ.1.3 కోట్ల జరిమానా విధించారు. విద్యుత్ అధికారుల దాడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.నవంబర్‌లో సంభాల్‌లోని జుమా మసీదు వద్ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే నిర్వహించిన సమయంలో జరిగిన హింస, కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. 20 మందికి పైగా జనం గాయపడ్డారు. మొఘల్ పాలనలో హిందూ దేవాలయ అవశేషాలపై మసీదు నిర్మించారనే వాదనల నేపధ్యంలో ఏఎన్ఐ సర్వే జరిగింది. అయితే ఇంతలో జిల్లా అధికారులు మసీదుకు కిలోమీటరు దూరంలో ఒక పురాతన ఆలయ ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడ కొన్ని విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో 1978 అల్లర్ల తర్వాత మూతపడిన ఈ ఆలయాన్ని అధికారులు తెరిచాయి. కాగా ఆలయ ప్రాచీనతను నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ చేసే బాధ్యతను సంబంధిత అధికారులు ఏఎస్ఐకి అప్పగించారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు -
ఖమ్మం లింగయ్యనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మంలోని లింగయ్య నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీబీలతో గుడిసెలను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులు యత్నించారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ భూదాన్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామంటున్న భూదాన్ భూ నిర్వాసితులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది.అడ్డుకున్న భూదాన్ నిర్వాసితులపై దాడి జరిగింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ వ్యక్తులను భూదాన్ భూ నిర్వాసితులు తరిమికొట్టారు.ప్రైవేట్ రౌడీలు వచ్చి పోలీసుల సమక్షంలో తమపై దాడికి పాల్పడుతున్న కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే పోలీసుల సమక్షంలో రౌడీలు వచ్చి తమపై దాడి చేయడమా అంటూ నిర్వాసితులు మండిపడ్డారు. -
అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య దర్శనం: అమిత్ షా
భోపాల్: మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలను అయోధ్య దర్శనానికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఖర్చు లేకుండా దశలవారీగా అందర్నీ అయోధ్యకు తీసుకెళ్తాం అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నవంబర్ 15కు ప్రచారాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. నేను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని రాహుల్ గాంధీ అడిగేవారు. ఇప్పుడు చెబుతున్నా జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది" అని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తమ కుమారుల భవిష్యత్ కోసమే ప్రాకులాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ తమ కుమారులను సీఎం చేయాలని చూస్తున్నారని తెలిపిన అమిత్ షా.. కేవలం సంతానం కోసమే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని మండిపడ్డారు. ఇదీ చదవండి: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు -
హామీలు నెరవేర్చకపోతే.. అక్కడ నాయకుల పని ఫినిష్! బంధించి..
ప్రజలు చేత ప్రత్యక్ష్యంగా ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే ప్రతి నాయకుడు తనని గెలిపిస్తే ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత గెలిచాక అసలు వాటిని గుర్తుంచుకునే తీరికే లేనట్లు ప్రవర్తిస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజలు గానీ, వారికిచ్చిన హామీలు గానీ వారికి గుర్తేరావు, ఔనా! ఐతే ఇక్కడ ఆ ఊరిలో మాత్రం అలా కుదరదట. నాయకులు హామీలు నెరవేర్చకపోతే ఇక అంతే సంగతులు. ప్రజలే అక్కడ వారిని బహిరంగంగా శిక్షిస్తారు. మళ్లీ ఇలాంటి పని చేయకుండా వారిలో మార్పు వచ్చేలా చేస్తారట. వివరాల్లోకెళ్తే..ఇటలీలో ఓ చిన్న పట్టణంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ తాము ఎన్నుకున్న నాయకుడు తప్పుడుగా వ్యవహరించినా, తప్పుడు పనులు చేసినా ఇక అంతే సంగతులు. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయినా.. వారిని బోనులో బంధించి నీటిలో ముంచేస్తారు. అలా అని వారిని చనిపోయేంత వరకు నీటిలో ముంచేయరు. తాము చేసిన తప్పు వారికి అవగతమయ్యేలా జస్ట్ ఒక్క సెకను మాత్రమే అలా బోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది వారికి ఒక అవమానంలా అనిపించి ఎలాంటి తప్పులు దొర్లకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడమే తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఇది ఇటలీలోని టోంకాలో సాంప్రదాయకంగా జరుగుతుంది. ప్రతి ఏడాది జూన్ చివరిలో జరిగే విజిలియన్ వేడుకలో ఇది ఒక భాగం. అంతేగాదు ఈ శిక్షలను జూన్ 26కు ముందు, చివరి ఆదివారం విధిస్తారు. గతేడాది 2022 జూన్ 19న దీనిని నిర్వహించారు. 2023, జూన్ 25 ఈ కార్యక్రమం ఉంటుంది. (చదవండి: మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..) -
దాడులను తీవ్రతరం చేసిన రష్యా...బలవంతంగా ఉక్రెయిన్ పౌరుల తరలింపు
ఇప్పట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపొవడం లేదా ఒకకొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు. ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది. అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది. దీంతో రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. వారి నివాస స్థలాలను రష్యా బలగాలు ఆక్రమించుకుని వారిని డ్నీపర్ నది వెంబడి పారిపోవాల్సిందిగా పౌరులపై ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారికి కనీస ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీన్ని రష్యా బలగాలు తరిలింపు చర్యగా పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ....ఉక్రెయిన్ దళాలతో ముఖాముఖీ తలపడేందుకు రష్యా బలగాలు ఇలా చేస్తున్నాయంటూ ఆక్రోశించారు. నగరవాసులను బలవంతంగా ఖాళీ చేయించి రష్యా బలగాలు అపార్ట్మెంట్లోకి చొరబడుతున్నారని ఆరోపించారు. అలాగే ఖైర్సన్లోని క్లినిక్‌లు, ఆస్పత్రులు రోగులకు సేవలందించడం లేదని, స్థానికులు కనీస ప్రాథమిక అవసరాల లేమితో అల్లాడుతున్నారని చెప్పారు. అంతేగాక ఉక్రెయిన్ బలగాలు ఖైర్సన్ని తిరిగి స్వాధీనం చేసుకోనివ్వకుండా నియంత్రించేలా వంతెనలను కూల్చి ప్రధాన ఆహార పదార్థాలు, ఆయుధాల సరఫరా రవాణాలపై రష్యా మిసైల్ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సాయుధ దళాల కమాండర్ వాలెరీ జలుజ్నీ మాట్లాడుతూ...గత కొద్ది రోజులుగా రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రతిరోజు సుమారు 80కి పైగా దాడులు చేస్తోంది. ఒక్క శుక్రవారం రష్యా బలగాలు జరిపిన దాడుల్లో సుమారు తొమ్మిది మంది పౌరులు మరణించగా, 16 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పెద్ద ఎత్తున సైనిక సమీకరణలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సైనిక సమీకరణలు ఇంకా అయిపోలేదని, సుమారు 3 లక్షల మంది సైనికుల రిజర్వ్‌ను సమీకరించడమే తమ లక్ష్యం అని పుతిన్ చెబుతున్నారు. -
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నిరసన
-
పవన్ కల్యాణ్ తీరుపై విశాఖ వాసుల ఆందోళన
-
బాంబులతో దద్ధరిల్లిన ఉక్రెయిన్ ...ఘోరంగా విరుచుకుపడ్డ రష్యా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ఘోరంగా వరుస బాంబులతో విరుచుకుపడింది రష్యా. అందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా కురిపించిన బాంబు వర్షంలో కీవ్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ బ్రిడ్జ్ ఆఫ్ గ్లాస్ పై దారుణంగా బాంబు దాడి జరిగింది. దీంతో వంతెన బూడిదతో కప్పబడినట్లుగా నిర్మానుష్యంగా మారింది. అలాగే ఎప్పుడూ జనాలతో అత్యంత రద్దీగా ఉండే షెవ్చెంకో పార్కుపై కూడా దాడులు జరిగాయి. అక్కడ మొత్తం దట్టమైన పొగ వ్యాపించి విధ్యంసకరంగా మారింది. మరోక వీడియోలో ఈ బాంబు దాడుల సమయంలో వీధుల గుండా వెళ్తున్న అమ్మాయి కనపిస్తుంది. ఆమె భయం భయంగా వెళ్తుంటే ఆమెకు సమీపంలోనే క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆమె భయంతో వేగంగా పరిగెడుతూ వెళ్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ మిసైల్ దాడిలో చిక్కుకుని అల్లకల్లోలంగా మారింది. The Bridge of Glass in the very heart of Kyiv pic.twitter.com/CvsRfTEAoJ — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) October 10, 2022 Shevchenko Park in central Kyiv now. Probably the city’s busiest park, usually packed with people and street musicians pic.twitter.com/9kIS4rBiKq — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 A girl was recording herself as she walked through what looks like Shevchenko Park in Kyiv this morning. She was almost killed by a Russian rocket pic.twitter.com/1Fa40ypcyg — Matthew Luxmoore (@mjluxmoore) October 10, 2022 (చదవండి: ‘కెర్చ్ వంతెన’కు ప్రతీకారం.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు) -
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు!
హోసూరు(బెంగళూరు): క్రిష్ణగిరి జిల్లాలో అడవుల విస్తీర్ణం అధికం. కొన్ని గ్రామాల్లో అడవుల్లో విసిరేసినట్లుగా ఉంటాయి. అక్కడికి రోడ్లు ఉండవు. కాలిబాటల్లోనే వెళ్లాలి. మధ్యలో అడవి ఏనుగులు, వన్యమృగాల దాడులు జరుగుతూ ఉండవచ్చు. వీటికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఒక గ్రామాన్నే ఖాళీ చేశారు. డెంకణీకోట సమీపంలోని క్రిష్ణగిరి– ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో దట్టమైన అడవిలో ఉండే పుల్లహళ్లి గ్రామం కథ ఇది. ఈ ఊరు పాడుబడిన నివాసాలతో ఖాళీగా దర్శనమిస్తుంది. మొండిగోడలే మిగిలాయి ఒకప్పుడు కళకళ ఒకప్పుడు ఈ పల్లెలో వందకుపైగా కుటుంబాలు ఉండేవి. గ్రామస్థులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఈ గ్రామానికి వెళ్లాలంటే ధర్మపురి జిల్లా పంజపల్లి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగులు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడేవారు. రోజూ బడికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి పోవాలన్నా అన్ని కిలోమీటర్లు నడవలేక అలసిపోయేవారు. దీంతో ఈ ఊరివారితో పెళ్లి సంబంధాలు కలుపుకోవాలన్నా వేరేఊరివారు భయపడేవారు. తమ ఊరికి రోడ్డు వేయాలని ప్రజలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గత్యంతరం లేక గ్రామస్థులు సుమారు ఐదారేళ్ల కిందట ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇప్పుడా గ్రామంలో ఒక్క మనిషి కూడా లేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇళ్లు శిథిలావస్థకు చేరుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి రోడ్లు, ఆస్పత్రి, బడి వంటి వసతులను కల్పించి నివాసయోగం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చదవండి: Job Opportunities: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్‌టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు! -
నెల రోజుల్లో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
దేవీపట్నం: అర్హులైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నెలరోజుల వ్యవధిలోనే గ్రామాల వారీగా ప్యాకేజీ సొమ్మును అందజేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ సి. శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఒ.ఆనంద్‌తో కలసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు పునరావాస కాలనీలను సందర్శించారు. ఇందుకూరు పంచాయతీలో నిర్మించిన పెదభీంపల్లి3, ఇందుకూరు2, ముసుళ్లకుంట కాలనీలను సందర్శించారు. ఇళ్లు, మరుగుదొడ్లు, రహదారులు, డ్రెయిన్లు, పాఠశాల, అంగన్వాడీ, గ్రామసచివాలయం, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దాదాపు రూ.90 కోట్ల మేర బిల్లులు నిర్వాసితులకు అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అనర్హుల జాబితాలో ఉన్నవారి వాస్తవాలను పరిశీలించి.. 10 రోజుల్లో ప్యాకేజీ పొందేందుకు అర్హులా కాదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. అనంతరం కొండమొదలు పంచాయతీలోని కొంతమందికి గంగవరం మండలం నేలదోనెలపాడు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. -
ఎలుకలు చేసిన పని.. ఇబ్బందుల్లో 2000 మంది..
లండన్: ఎలుకల సంగతి అందరికీ తెలిసిందే.. తాము తినేవే కాదు అడ్డం వచ్చిన ఏ వస్తువులను కూడా వదలిపెట్టవు. తమ ఇంట్లో ఎలుకలు ఉన్నవారికి వీటి శాడిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ తరహాలోనే ఎలుకల కారణంగా ఏకంగా రెండు వేల మంది ఇంటర్నెట్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే. (చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..) ఇటీవల ఆ ఎలుకల గుంపు ఇంటర్నెట్ కేబుళ్లను సైతం వదలక, ఇష్టం వచ్చినట్లు కొరికిపడేశాయి. దీంతో టోరిడ్జ్ ప్రాంతంలో 1800 మంది, డేవాన్ ప్రాంతంలో 200 మంది వరకు వైఫై సేవలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. బీటీ, వొడాఫోన్, ప్లస్‌నెట్,స్కై, ఇతర కంపెనీల సేవలు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేగాక అక్టోబర్ 14న వీటి చర్యలకు దాదాపు ఏడు గంటల పాటు కాల్స్ సేవలు నిలిచిపోయాయి. గత రెండు నెలల నుంచి ఆ ప్రాంత స్థానికుల ఇంటర్నెట్ సౌకర్యంగా సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనిపై స్థానిక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. బిడ్ఫర్డ్, క్లోవెల్లీ, హార్ట్‌ల్యాండ్ ప్రాంతాల్లో టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాల్లో దాదాపు 1800 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మునుపటి పరిస్థితి తీసుకొచ్చేందుకు వారికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
పునరావాసం కోసం నిర్వాసితుల ఆందోళన
-
ఐపీఎల్ మ్యాచులు ఇక్కడ వద్దంటు సీఎంకు లేఖ
ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ ముంబైలో విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడేలో ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయా లేదా అన్న సందేహం మొదలైంది. ఇటీవల బీసీసీఐ మెంబర్ మ్యాచులకు సంబంధించి వేదికలో ఎటువంటి మార్పులు లేవని స్పష్టత వచ్చింది. కానీ ప్రస్తుతం వాంఖడే సమీపంలోని స్థానికులు కేసులు కారణంగా ముంబై వేదికను మార్చాలంటూ సీఎం ఉద్దవ్‌ఠాక్రేకు లేఖ రాశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) తన ప్రణాళికను రూపొందించినప్పుడు దేశంలో కోవిడ్ -19 కేసుల పరిస్థితి సాధారణంగానే నమోదు అయ్యేవి. అయితే, గత రెండు వారాలు, దేశంలోని అన్ని నగరాల్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసలు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తోంది. వీటి నివారణకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో మాత్రం అనుకున్నట్లుగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ముంబై వేదికను మార్చాలని కోరుతూ వాంఖడే స్టేడియం సమీపంలోని నివాసితులు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు లేఖ రాశారు. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేకపోయినా , ఆటగాళ్లు వేదిక చేరుకున్నాక తమ అభిమాన ఆటగాడిని చూడాలన్న కోరికతో అభిమానులు గూమికూడే అవకాశం ఉంది. తద్వారా కరోనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికను మార్చవలసిందిగా అక్కడి స్థానికులు సీఎంకు లేఖ రాశారు. వివాహాలు, మరణాలు మొదలైన మతపరమైన, ఇతర సామాజిక కార్యకలాపాల విషయంలో ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఎలా అనుమతినిస్తుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. ( చదవండి: వాంఖడేలో చాపకింద నీరులా కరోనా.. తాజాగా మరో ముగ్గురికి ) -
విదేశీయులకు కిక్కిచ్చి స్థానికులను జైలుకి..
ఆరు దశాబ్దాలుగా మద్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్న గుజరాత్ రాష్ట్రం ఆ నిషేధ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మద్యం నిషేధ చట్టాలను కఠినతరం చేసేందుకు తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను కూడా ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ కింద ఎవరైనా స్థానికులు లిక్కర్ బాటిళ్లతో దొరికినా, అమ్మినట్టు తెలిసినా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కఠినమైన నిబంధనలు కేవలం స్థానికులకు మాత్రమేనట. విదేశీయులకు, సందర్శకులకు మాత్రం ఫుల్ కిక్కిచ్చేలా ఆల్కాహాల్‌ను అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను ప్రస్తుతం గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతమున్న నిషేధ చట్టంలో ఆల్కాహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా కేవలం మూడేళ్ల జైలు శిక్ష విధించేవారు. ఆల్కాహాల్ సేవించి ఏదైనా గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే వారికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షపడేది. కానీ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి మరింత కఠినంగా శిక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ రూపాణి ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. ఓబీసీలు, పటేదార్లు రెండు కమ్యూనిటీ డిమాండ్ల నేపథ్యంలో తలమునకలవుతున్న అధికార పార్టీ ఎన్నికల్లో నెగ్గేందుకు ఎలాగైనా పట్టుసాధించాలని దృష్టిసారిస్తోంది. మహిళల ఓట్లు తమ బ్యాలెట్‌లోనే పడేలా చూసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటోంది. ఓబీసీ కమ్యూనిటీ నేత అల్పేష్ థాకోర్ సైతం ఎస్సీ, ఎస్టీలకు మద్దతిస్తూ కఠినతరమైన నిషేధ చట్టాన్ని మంచిగా అమలుచేయాలని పిలుపునిచ్చారు. అయితే వరల్డ్ క్లాస్ బిజినెస్ ఈవెంట్లకు మాత్రం సౌలభ్యమిచ్చేలా ఈ నిషేధ చట్ట ఆర్డినెన్స్‌ను తీసుకొస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే విదేశీయులకు సౌకర్యవంతంగా ఉండేలా మద్య నిషేధ పాలసీ అమలుచేయాలని ఆ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ సూచించింది. ఈ మేరకు విదేశీయులకు కిక్కిచ్చేలా, స్థానికులకు మాత్రమే నిషేధ చట్టాన్ని కఠినతరం చేశారు. -
సీనియర్ రెసిడెంట్ల కౌన్సెలింగ్ గందరగోళం
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం జరిగిన సీనియర్ రెసిడెంట్ల కౌన్సిలింగ్లో గందరగోళం ఏర్పడింది. మేనేజ్మెంట్ కోటాకు, కన్వీనర్ కోటాకు ప్రత్యేకంగా సీనియర్ రెసిడెంట్ల కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కడ పని చేయాలనే విషయాన్ని ఆర్డర్ ద్వారా ఇస్తామని అధికారులు చెప్పడంతో పీజీ వైద్యులు ఆందోళన చేశారు. మెరిట్ ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. కౌన్సెలింగ్ బాయ్‌కాట్ చేసి డీఎంఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీనియర్ రెసిడెంట్లుగా ఏడాదిపాటు పనిచేసేలా అధికారులు సిద్ధమవడంతో బాయ్‌కాట్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవ్వాల్సిన కౌన్సెలింగ్ 12 గంటల వరకు నిలిచిపోయింది. ప్రభుత్వం సీనియర్ రెసిడెంట్లకు నెలనెలా గౌరవ వేతనంగా అందజేసే నిధులు విడుదలకు బడ్జెట్ లేవనే సాకుతో ప్రైవేటు వైద్య కళాశాలల్లో పని చేయించాలని చేస్తోందని వైద్యులు వాపోయారు. సీనియర్ రెసిడెంట్లను ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు రిక్రూట్మెంట్ ద్వారా నియమించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు కళాశాలల్లో పని చేయబోమని స్పష్టం చేశారు. వైద్యుల ఆందోళనతో స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గతంలో మాదిరిగానే కౌన్సెలింగ్ నిర్వహించాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు ఆదేశాలిచ్చారు. దీంతో మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫర్నీకుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్, ఇతర అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. వైద్యులకు మద్దతు తెలిపిన అప్పిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కౌన్సెలింగ్‌కు వచ్చి వైద్యులకు మద్దతు తెలిపారు. ఎలాంటి జీవో విడుదల చేయకుండా ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ వైద్యులను నియమించాలనుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాన్ని సహించబోమని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా కౌన్సెలింగ్ నిర్వహించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
చెట్టుకు విషమిచ్చి చంపారు!
చెన్నై: తమిళనాడులోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఇప్పుడు ఓ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వారి పోరాటం ఓ మర్రి చెట్టు గురించి. వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది. ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మామూలుగానైతే చెట్టు వయసైపోయిందని భావించేవారు గానీ.. దానితో అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించలేదు. దాన్ని కావాలనే విషమిచ్చి ఎండిపోయేలా చేశారని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు. ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ పార్క్‌కు ఎదురుగా ఉండటంతో.. అది అడ్డుగా ఉందని భావించి వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం -
శ్రీకాకులంలో అణుప్రకంపనలు
-
నెలకు రూ.1.70లక్షలు ఇస్తుందట!
స్విట్లర్లాండ్ ప్రజలకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఆఫర్ ను ప్రకటించనుంది. తన పౌరులకు నెలకు కచ్చితమైన ఆదాయాన్ని సమకూర్చేలా ప్రణాళికలు రచిస్తోందిట. స్విట్జర్లాండ్ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ కొత్త చట్టం ప్రకారం పౌరులు అందరికి బేషరతుగా 2,500 ఫ్రాంక్‌లు (ఒక స్విస్ ఫ్రాంక్ ఒక డాలర్ ప్రస్తుతం సమానం) చెల్లించే ప్రతిపాదనను పరిశీలిస్తోందట. అంటే ఏ పనీ చేయకపోయినా నెలకు సుమారు లక్షా 70 వేల రూపాయలు ఒక్కో కుటుంబానికి కచ్చితమైన వేతనం లభించనుంది. అంతేకాదు పిల్లలకు కూడా 625 డాలర్లను చెల్లించేందుకు యోచిస్తోందట. కళాకారులు, రచయితలు, ఇతర మేధావులు ఈ పథకాన్ని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన పట్ల స్థానిక రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ చర్య వల్ల ప్రజల్లో పనిచేయాలనే కాంక్ష తగ్గుతుందని ఆరోపిస్తున్నాయి. అటు ఈ స్టయిఫండ్ వల్ల యువతలో సోమరితనం పెరిగి, నైపుణ్యత తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ధనిక దేశంలో ఈ తరహా అవకాశాన్ని ప్రజలకు దగ్గర చేయడం గొప్ప ప్రయోగం అవుతుందని యూనివర్శిటీ ఆఫ్ లుసానే పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఆండ్రియాస్ లాడ్నర్ వివరించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ పథకానికి గాను సంవత్సరానికి రెండువందల బిలియన్ డాలర్లు ఖర్చుకానుంది. దీనిపై దేశవ్యాప్తంగా జూన్ 5 న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. మరోవైపు ఆర్థిక వేతన హామీ పథకంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్న మొట్టమొదటి దేశంగా స్విస్ అవతరించింది. కాగా ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం2014 లో స్విట్లర్లాండ్ వ్యక్తి సగటు ఆదాయంలో అయిదవ స్థానాన్ని అక్రమించింది. -
ప్లాట్లుగా పోర్న్ స్టూడియో.. వద్దంటున్న జనం!
వాయవ్య ఇంగ్లండ్ బ్రిస్టల్ నగరంలోని బ్లూ మూవీ స్టూడియో.. నిన్నమొన్నటి వరకు ఘాటైన శృంగార దృశ్యాల చిత్రీకరణలతో హోరెత్తేది. ఈ స్టూడియోలో నిత్యం పోర్న్ సినిమాలు నిర్మించి.. వాటిని లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. ఈ స్టూడియోను ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి అమ్మేయాలని తాజాగా యజమాని నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని స్థానిక కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్లూ మూవీ స్టూడియోను ఫ్లాట్లుగా చేసి అమ్మితే.. వలసదారులే వాటిని కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుదారని, పోర్న్‌స్టార్లు అంటే వలసదారులకు చాలా ఇష్టమని స్థానిక కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 35 మంది కాలనీ వాసులు ఆందోళనబాటపట్టారు. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా మారిస్తే.. ఇక్కడి తమ ఇళ్లను అమ్మేసుకోని వేరే చోటుకి వెళ్లిపోతామని వారిలో కొందరు హెచ్చరిస్తున్నారు. బ్రిస్టల్ సెయింట్ జార్జ్‌లోని ఈ స్టూడియోను నిన్నమొన్నటి వరకు ఫిల్ బేరి స్టూడియోగా వాడుకున్నాడు. పోర్న్ స్టార్ క్యాథీ బేరి భర్త అయిన ఫిల్ల్ ఈ నివాసంలో పోర్న్ దృశ్యాలు తీసి.. వాటిని లైవ్ ప్రసారం చేసేవాడు. అయితే, దీని యజమాని మైక్ హాబిన్స్ ఇంటిని 40 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లుగా మార్చి.. అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా నగరంలో నెలకొన్న ఇళ్ల సంక్షోభం పరిష్కారానికి కొంత సహకారం అందించాలని ఆయన భావిస్తున్నారు. అయితే, హాబిన్స్ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. పోర్న్ స్టూడియో వల్ల తమకు గతంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, ఎదైనా సమస్య వస్తే.. దానిని యజమాని దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించేవారని, ఇప్పుడు దీనిని ఫ్లాట్లుగా చేస్తే.. ఇందులో ఉండేందుకు విదేశీ ఉద్యోగులే ముందుకొస్తారని, అలా 35 మంది వరకు వలసదారులు తమ కాలనీలోకి వస్తే సమస్యలు వచ్చే అవకాశముంటుందని స్థానికంగా నివాసముండే 38 ఏళ్ల నవోమి మ్యాగ్స్ పేర్కొంది. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా చేస్తే.. దాని ఎదురుగా ఉన్న తమ ఇంటిని అమ్మేస్తామని ఆమె హెచ్చరిస్తున్నది. -
ఆరడుగుల జాగా కోసం..
♦ మృతదేహం ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు ♦ ఉదారత చాటుకున్న రిటైర్డ్ ఉద్యోగి, లారీడ్రైవర్ కోదాడ: ఆ ఆరడుగుల జాగా కోసం ఓ పేద వలస కుటుంబం నానా పాట్లు పడింది. మృతదేహం ఖననాన్ని కొందరు స్థానికులు అడ్డుకోగా.. అదే సమయంలో మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించేందుకు ఇద్దరు వ్యక్తులు సహకరించి మానవత్వాన్ని చాటారు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన డేవిడ్సన్ కుటుంబం కోదాడకు వలస వచ్చింది. రోడ్డు వెంట టెంట్ వేసుకుని నివాసం ఉంటోంది. ఈ కుటుంబం గ్రామాల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ ఉయ్యాలలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. డేవిడ్సన్ తండ్రి రాయిసన్ (85) ఎండ వేడికి ఆదివారం రాత్రి మరణించాడు. వారు క్రైస్తవులు కావడంతో ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాలి. అయితే, కోదాడలో వారికి శ్మశానవాటిక లేకపోవంతో డేవిడ్ తన తండ్రి మృతదేహాన్ని పెద్ద చెరువు సమీపంలో ఖననం చేసేందుకు తీసుకెళ్లాడు. గొయ్యి తవ్వుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఏం చేయాలో తోచక డేవిడ్ తన తండ్రి శవంతో రోడ్డు మీదికొచ్చాడు. మార్నింగ్ వాక్కు వెళ్లిన ఒక విశ్రాంత ఉద్యోగి గమనించి అతడిని విచారించాడు. మృతదేహాన్ని సొంత రాష్ట్రం ఒడిశాకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో రూ.10 వేలు అందించాడు. డేవిడ్సన్ తన తండ్రి శవంతో కోదాడ బైపాస్‌రోడ్డుకు వెళ్లాడు. కోదాడ నుంచి సిమెంట్ లోడ్‌తో ఒడిశా వెళుతున్న లారీడ్రైవర్ సైతం మానవతను చాటుకున్నాడు. మృతదేహాన్ని ఉచితంగా తీసుకెళ్లడానికి అంగీకరించాడు. ఎట్టకేలకు మృతదేహం తీసుకుని కుటుంబంతోసహా ఒడిశా వెళ్లాడు. -
ఎవరి పంథా వారిది..!
♦ నగరవాసుల పుట్టిముంచుతున్న సైబర్ నేరగాళ్లు ♦ మూడు ముఠాలకు చెందిన 11మంది అరెస్టు ♦ రూ.5 లక్షలు స్వాధీనం, రూ.46.47 లక్షలు ఫ్రీజ్ ఆన్లైన్ ఆధారంగా వలవేసి అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు తమ పంథాలను మార్చుకుంటూ నగరవాసులను ముంచేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఒక గ్యాంగ్... క్రెడిట్ కార్డ్స్ అప్‌గ్రేడ్ అంటే మరో ముఠా, ఇన్య్సూరెన్స్ బోనస్ పేరుతో మరో గ్యాంగ్... నగరవాసుల నుంచి రూ.25.3 లక్షలు కాజేశారు. ఆయా ముఠాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు జాయింట్ కమిషనర్ (క్రైం) డాక్టర్ టి.ప్రభాకరరావు తెలిపారు. శనివారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేసీఎస్ రఘువీర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. ఆయా నిందితుల నుంచి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.46.47 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. -సాక్షి, సిటీబ్యూరో బంధువులే..ముఠాగా ఆగ్రాకు చెందిన తరుణ్ గుప్తా విశాఖపట్నంలో పని చేస్తున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన రామోజీరావు బంధువు ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వారు ముగ్గురూ కలిసి మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌ను ఆసరాగా చేసుకుని ‘స్కిల్ డెవలప్మెంట్ మానిటరింగ్ (ఎస్డీఎమ్) సర్వీసెస్’ పేరు తో ఓ వెబ్సైట్ ఏర్పాటు చేశారు. దీని హోమ్ పేజ్‌లో దేశంలోని రాష్ట్రాలను ఐదు జోన్లుగా విభజించినట్లు చూపించారు. ప్రతి జోన్‌లోనూ వివిధ రకాలైన సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఆసక్తి ఉన్న కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చని ఎర వేశారు. దీనిపై స్పందించిన పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రస్తుతం తాము చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి విలువల్నీ చూపిస్తూ ఈ-మెయిల్స్ చేశాయి. వీటికి సమాధానం ఇచ్చిన సైబర్ నేరగాళ్లు తాము సూచించిన ప్రాజెక్టుల విలువలో ఒక శాతం ఈఎండీ (ఎర్న్ మనీ డిపాజిట్) చెల్లించాలంటూ సమాధానం ఇచ్చారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న తర్వాత ప్రాజెక్టు రాకుంటే ఈఎండీ తిరిగి ఇచ్చేస్తామని, ఇందు కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు సైతం ఉన్నాయంటూ ఈ-మెయిల్ చేశారు. దీంతో అనేక కంపెనీలు సైబర్ నేరగాళ్లు సూచించినట్లే ఈఎండీలు చెల్లించారు. అయితే ‘సర్వీసెస్’ సంస్థ చెప్పినట్లు టెండర్లు ఓపెన్ చేసే తేదీ నాడు వీరెవ్వరికీ ఎలాంటి ఈ-మెయిల్ సమాచారం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయా కంపెనీలు ఆరా తీయగా..అసలు మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో నగరానికి చెందిన రెండు కంపెనీలు తమను ఎస్డీఎం సర్వీసెస్ నిర్వాహకులు రూ.16.2 లక్షలు మోసం చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ ఆగ్రాలో ఉంటున్న ప్రియాంక గుప్త, రామోజీరావులను అరెస్టు చేశారు. వీరు దేశ వ్యాప్తంగా రూ.83 లక్షల మేర వసూలు చేసినట్లు గుర్తిం చారు. తరుణ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు గుర్తించిన అధికారులు పీటీ వారెంట్‌పై తేవాలని నిర్ణయించారు. ‘లాప్స్ పాలసీ’ల పేరుతో లూటీ... లాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీపై భారీ మొత్తం ఇస్తామని ఎరవేసిన ఉత్తరాది గ్యాంగ్ నగరానికి చెందిన వృద్ధుడు టి.మల్లయ్య నుంచి రూ.8.3 లక్షలు కాజేసింది. న్యూఢిల్లీకి చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు సూత్రధారులుగా ఓ ముఠా ఏర్పాటు చేశారు. షాన్ మహ్మద్, మనీష్‌కుమార్, వరుణ్‌యాదవ్, విపుల్సోని, అశోక్ యాదవ్ సహా మరికొందరు టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకుని, వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వాటి కస్టమర్స్ డేటాను సంపాదించారు. ఆయా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పాలసీలు కట్టి, మధ్యలో మానేసిన ‘లాప్స్ పాలసీదారులను’ టార్గెట్‌గా చేసుకున్నారు. వారికి ఫోన్లు చేసే టెలీకాలర్స్ లాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ చెప్పి వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఈ రకంగా మల్లయ్య నుంచి రూ.8.3 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి నుంచి డబ్బును బోగస్ పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు టెలీకాలర్లుగా వ్యవహరించి షాన్ మహ్మద్, మనీష్‌కుమార్, వరుణ్‌యాదవ్, విపుల్సోని, అశోక్ యాదవ్‌లను అరెస్టు చే సి, పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. రివార్డ్స్ పేరుతో ‘అసలుకే’ మోసం... రివార్డ్ పాయింట్స్ పేరుతో క్రెడిట్‌కార్డ్స్ వినియోగదారుల నుంచి డేటాను సంగ్రహిస్తూ టోకరా వేస్తున్న ఢిల్లీ గ్యాంగ్ గుట్టరట్టైంది. ప్రమోద్ కుమార్ కేసరి, దినేష్ లక్రా, హరీష్ భాద్రీ, మనోజ్‌కుమార్ భైన్వాల్ న్యూ ఢిల్లీ కేంద్రంగా ముఠాగా ఏర్పడ్డారు. వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్‌కార్డ్ వినియోగదారుల డేటాను సంగ్రహించే ఈ ముఠా బ్యాంకు పేరుతో వారికి ఫోన్లు చేసి, ప్రత్యేక రివార్డ్ పాయింట్లను జమ చేస్తామంటూ కార్డ్ నెంబర్ నుంచి సీవీవీ కోడ్ వరకు సంగ్రహిస్తుంది. అనేక సందర్భాల్లో బాధితుల నుంచి వన్ టైమ్ పాస్వర్డ్స్నూ సంగ్రహించింది. వీటిని వినియోగించి కొనుగోళ్లు చేయడానికి ‘ఈ షాప్ట్రిక్స్. కామ్’వెబ్సైట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ-షాప్ ట్రిక్స్ వెబ్సైట్ నిర్వాహకులైన మనోజ్, హర్షిత్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వినియోగదారుల నుంచి సేకరించిన కార్డ్ డేటాతో ఈ వెబ్సైట్లో కనిష్టంగా రూ.7 వేలకు ఓ ప్యాక్‌ను ఖరీదు చేస్తారు. నాసిరకం షూస్, కళ్లజోడు, పర్సులతో కూడిన ఈ ప్యాక్‌ను వినియోదారుడికే పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా సదరు వినియోగదారుడే తన కార్డుతో ఖరీదు చేసినట్లు బుకాయించే అవకాశం ఉంటుంది. వినియోగదారుడి కార్డు నుంచి స్వాహా చేసిన మొత్తంలో ఈ ప్యాక్ ఖరీదు పోను మిగిలిన దాంట్లో 65 శాతం వెబ్సైట్ నిర్వాహకులు, 35 శాతం కాల్‌సెంటర్ నిర్వాహకులు పంచుకునేవారు. నగరానికి చెందిన వ్యక్తులు వీరి భారిన పడి రూ.80 వేలు నష్టపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ వీపీ తివారీ దినేష్, ప్రమోద్, మనోజ్, హర్షిత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. -
హోలీపండుగలో నీటిని వృధా చేయొద్దు!
థానెః ముంబై మెట్రోపాలిటన్ డివిజన్ లోని థానే ప్రజలు నీరు అనవసరంగా వృధా చేయవద్దని స్థానిక కలెక్టర్ అశ్విని జోషి పిలుపునిచ్చారు. భారత సంప్రదాయ పండుగల్లో ఒకటైన హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలోఆమె ప్రజలకు నీటిని వృధా చేయవద్దని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా జనం వారంపాటు జరుపుకునే అనేక సంప్రదాయ కార్యక్రమాల్లో భాగంగా రైన్ డ్యాన్స్ లు వంటివి చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందని, అటువంటి వాటితో నీరు భారీగా వృధా అయ్యే అవకాశం ఉందని థానె కలెక్టర్ అశ్విని జోషి అన్నారు. జిల్లాలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, నీటి వృధాని అరికట్టడంలో భాగంగా జలపూజలు చేపట్టి జలజాగృతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవగాహన పెంచుకొని వృధాని అరికట్టాలని కోరారు. ముఖ్యంగా స్థానిక హౌసింగ్ సొసైటీలు, గృహ సముదాయాలు వాటర్ హార్వెస్టింగ్, రైసైక్లింగ్ పథకాలను ఆచరణలో పెట్టి , నీటి నిల్వలు పెంచేందుకు తోడ్పడాలని, అటువంటి ప్రాజెక్టులను జిల్లా ప్లానింగ్ కమిటి ముందుంచాలని జోషి కోరారు. జిల్లా షాపూర్ తాలూకాలోని ఆనకట్టలు, నదులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని జోషి పేర్కొన్నారు. జిల్లాలోని ఆరు నదుల్లోని నీటితో కలెక్టర్ జలపూజ కార్యక్రమాన్ని చేపట్టి, దీంతోపాటు జలరథ్ యాత్రను కూడ ప్రారంభించారు. యాత్రలో భాగంగా అన్ని తాలూకాల్లో ప్రజలకు నీటివృధా అరికట్టడంతోపాటు, వాడకంలో జాగ్రత్తలపై అవగాహన పెంచనున్నారు. -
షాపూర్లో విషప్రయోగం
♦ తాగునీటి బావిలో క్రిమిసంహార మందులు కలిపిన దుండగులు ♦ వాసన గుర్తించి అప్రమత్తమైన స్థానికులు ♦ తప్పిన ప్రమాదం రాయికోడ్ : తాగునీటి బావిలో క్రిమిసంహారకాలు కలిపిన సంఘటన మండలంలోని షాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ వాడలో ఉన్న బావి నీటిని స్థాని కులు తాగటానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఐదు రోజుల క్రితం నీరు వాసన వస్తుండడంతో అనుమానించిన కాలనీ వాసులు బావినీటి వినియోగాన్ని ఆపేశారు. వాసన తగ్గకపోవడంతో శనివారం పలువురు బావిలోకి దిగి చూడగా పలు క్రిమిసంహారక మంందు డబ్బాలు, కవర్లు లభించాయి. అనుమానంతో బావినీటిని వినియోగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషప్రయోగానికి యత్నించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీపీఎం మండల అధ్యక్షుడు దశరథ్ కోరారు. కాగా సంఘటనపై వివరాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
మెట్రో చిక్కులు..నగరవాసికి చుక్కలు!
మెట్రో రూట్లలో ట్రా‘ఫికర్’ ఎక్కువైంది. వర్షాలు..రోడ్లపై గుంతలు, మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు నగరవాసికి చుక్కలు చూపిస్తున్నాయి. పది కిలో మీటర్ల దూరానికి గంటన్నర సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సులు సైతం గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు సమయానికి గమ్యం చేరక..ఇటు ఇంధన ఖర్చులు పెరిగి జనం విలవిల్లాడుతున్నారు. బైకులు బైటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఆటోవాలాలు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. మొత్తంగా మెట్రో పనులు నగరవాసికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు, చర్యలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రంగా మారాయి. ట్రాఫిక్‌తో నానా అవస్థలు పడుతున్న జనం - పది కిలోమీటర్లు దాటాలంటే గంటన్నరకుపైగా సమయం - రోడ్లపై గుంతలతో వాహనచోదకులకు గుబులు - రోడ్ల విస్తరణను పట్టించుకోని మెట్రో అధికారులు మెట్రో రైలు ఎప్పుడు వస్తుందో దేవుడెరుగు...ఈ ప్రాజెక్టు పనులు మాత్రం నగరవాసులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ రోడ్డెక్కాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు...ఇలా ప్రతి ఒక్కరూ మెట్రో పనుల వల్ల సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఇప్పటికే రోడ్లపై గుంతలు, సూదుల్లా మొనదేలిన రాళ్లు, అడుగు తీసి...అడుగు వేసేందుకు హడలెత్తిపోతున్న రహదారుల్లో నానాయాతన పడుతున్న నగరవాసులకు మెట్రో పనులు మరింత నరకం చూపెడుతున్నాయి. బండి ఇంధనం కూడా బాగానే కాలుతోంది. ఖర్చు పెరుగుతోంది. అనుకున్న పనులు సమయానికి కావడం లేదు. మెట్రో పనులు జరుగుతున్న కొన్నిప్రాంతాల్లో రక్షణ చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి. ఇక వర్షాకాలం కావడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు వచ్చి చేరడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా 28.87 కిలోమీటర్ల ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్ 1) రూట్లో, 14.78 కిలోమీటర్ల జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్ 2) రూట్ , 27.51 కిలోమీటర్ల నాగోల్-శిల్పరామం (కారిడార్ 3) రూట్లో జరుగుతున్న మెట్రో రైలు పనులు ప్రమాదాలకు, ట్రాఫికర్‌కు కేరాఫ్‌గా మారుతున్నాయి. ప్రత్యామ్నాయ రూట్లున్నా ఫలితం సున్నా.. పలు మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ,హెచ్ఎంఆర్ విభాగాలు ప్రత్యామ్నాయ రూట్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ప్రధాన మార్గాల్లో మాత్రం ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడం, మెట్రో పనులు జరిగేందుకు రహదారి మధ్యలో బారికేడ్లు వేయడం అనివార్యమవడంతో రహదారులు కుంచించుకుపోయి ట్రాఫిక్ జంఝాటం తప్పడంలేదు. ట్రాఫిక్ విభాగం అంచనా ప్రకారం అత్యధిక చిక్కులు ఈ ప్రాంతాల్లోనే... - పంజగుట్ట, నాంపల్లి, ఎంజే మార్కెట్, చాదర్‌ఘాట్ బ్రిడ్జి, లక్డికాపూల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంది. ఒకవైపు మెట్రో పనులు..మరోవైపు వేలాది వాహనాలు ఒకేసారి రహదారులను ముంచెత్తుతుండడంతో సగటు వాహన వేగం గణనీయంగా తగ్గుతోంది. - నాగోల్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎన్జీఆర్ఐ, మెట్టుగూడా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. - నాగోల్- మెట్టుగూడ రూట్లో ఆరులేన్ల రహదారి అందుబాటులో ఉండడంతో పనులకు ఎలాంటి ఆటంకం కలగడంలేదు. కొద్దిమేర సమస్య తీవ్రత తగ్గింది. ఇక ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు 97 ఆస్తులను ఇప్పటికే తొలగించారు. కబ్జాలను నిరోధించారు. ఇందుకోసం రూ.29.26 కోట్లు వ్యయం చేసినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. నిండా మునిగిన గ్రేటర్ ఆర్టీసీ! సాక్షి, సిటీబ్యూరో : మెట్రో రైలు పనుల వల్ల సిటీలో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్‌లు సాధారణమయ్యాయి. వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో మునుగుతోంది. ట్రాఫిక్ కారణంగా సిటీ బస్సులన్నీ గంటలకు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఆలస్యం ఇటు ప్రయాణికులను, అటు ఆర్టీసీని నష్టపరుస్తోంది. సాధారణంగా ఆర్టీసీ బస్సులు లీటర్ డీజిల్ వినియోగానికి 4.41 కిలోమీటర్ల సగటు దూరం పయనించాలి. కానీ ఏ ఒక్క బస్సు 3 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లడం లేదు. లీటరుకు 4 కిలోమీటర్ల చొప్పున అయితే ప్రతి రోజు ఒక బస్సు 250 కిలోమీటర్ల దూరం తిరగడానికి 63 లీటర్ల డీజిల్ సరిపోతుంది. కానీ గతుకుల రోడ్లు, ట్రాఫిక్ రద్దీ, మెట్రో గుంతల కారణంగా ఒక బస్సుకు 80 లీటర్లకు పైగా డీజిల్ వినియోగించవలసి వస్తోంది. పడిపోయిన కేఎంపీఎల్ కారణంగా 28 డిపోల పరిధిలో 3850 బస్సులు తిరిగేందుకు ప్రతి రోజు ఇంధన వినియోగం 2.42 లక్షల నుంచి 3.80 లక్షలకు పెరిగింది. మొత్తంగా ఆర్టీసీపైన ఇంధన భారం భారీగానే పెరిగింది. రూ.140 కోట్ల నష్టాలతో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది మింగుడుపడడం లేదు. ఆటోవాలాలకూ నష్టాలే మిగులుతున్నాయి. భారీగా ట్రిప్పుల రద్దు మెట్రో పనుల కారణంగా సిటీలో ఆర్టీసీ బస్సులు అనుకున్న మేర తిరగడం లేదు. ఆలస్యం అవుతున్నందున అధికారులు భారీగా ట్రిప్పులు రద్దు చేస్తున్నారు. సికింద్రాబాద్-కోఠీ (వయా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్), మార్గంలోనూ, సికింద్రాబాద్-మెహదీపట్నం (వయా పంజగుట్ట), సికింద్రాబాద్-బీహెచ్ఈఎల్ తదితర అన్ని రూట్లలో ప్రతి రోజు వేల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 1050 రూట్లలో సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. కానీ సగటున రోజుకు 5 వేల నుంచి 7 వేల ట్రిప్పులు రకరకాల కారణాల వల్ల రద్దవుతున్నాయి. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
- కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా - ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం - క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్
♦ కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా ♦ ‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం ♦ క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి.. గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్సైజ్ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్ బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది. మరెందరికో ‘కిక్’.. తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్బాగ్స్కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్లోడ్ చేసిన ‘లెట్స్మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్సైజ్ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మిక్స్ చేస్తే మస్తు మస్తే.. చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్ ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు. ఫటాఫట్.. బెని‘ఫిట్’ ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్. కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు. ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది. లెట్స్ మూవ్.. చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు. -
బుడగ జంగాల కన్నీటి కథ
-
పండగంటే పండగే
పండగంటే ముచ్చట్లు... మురిపాలు. ఇల్లు..బంధువులు. పిండి వంటలు... విందులు... వినోదాలు. తీరిక లేని జీవనం... ఎవరికి వారుగా సాగుతున్న ప్రయాణంలో అచ్చతెలుగు సంబరాల్లోని అసలుసిసలు మజాను మిస్సవుతున్నారు నగరవాసులు. ముంగిళ్లు లేని ఇళ్లలో ముగ్గులు పెట్టడం సాధ్యం కానట్టే... కన్నవారికి దూరంగా ఉన్న చోట... కన్న బిడ్డలకు భోగి పండ్లు పోయాలన్నా మనసు రాదు. ఇలాంటి ఇబ్బందులను గ్రహించి... అంతా ఒకే కుటుంబంగా... ఆనందంగా సంప్రదాయబద్ధ్దంగా సంక్రాంతిని ఆస్వాదించడానికి బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఐదు రోజుల సంబరాలు చేస్తున్నారు. ప్రముఖ రచయిత చల్లా ఉమ నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి పండగ విశేషాలు ఆమె మాటల్లోనే... తల్లిదండ్రులు పిల్లలకు ఆర్థికంగా మెరుగైన అవకాశాలు కల్పించటం, ఆస్థిపాస్తులు సమకూర్చటంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒక వేళ అవి ఇవ్వలేక పోతే పిల్లలకు అన్యాయం చేసినట్టుగా భావిస్తున్నారు. వాటన్నిటికన్నా పిల్లలకు ఇవ్వాల్సిన వారసత్వ సంపద భాషా, సంస్కృతి, సంప్రదాయాలు. వీటివల్లే వాళ్ల వ్యక్తిత్వానికి, అస్తిత్వానికి పునాదులు పడతాయి. వీటిని వారసత్వంగా అందించలేకపోతే వారికి ఎక్కువ అన్యాయం చేసినట్టు. నగరాల్లో పిల్లలు ఇలాంటి పండగలు, సంప్రదాయాలకు దూరం కాకుండా ఉండడానికే ఈ సంక్రాంతి పండగ నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఉద్యోగాలు, చదువుల వల్ల కుటుంబంలో ఒకరి కొకరు కలుసుకునే అవకాశాలు తక్కువవుతున్నాయి. చిన్నారులకు పండగంటే పిండి వంటలు, కొత్త బట్టలు, టీవీ... ఇవే తెలుసు. నగర యాంత్రిక జీవనం వల్ల ఏర్పడ్డ పరిస్థితి ఇది. ఈ క్రమంలోనే పూర్వంలా అంతా ఒకే కుటుంబంగా పండగ జరుపుకొనే వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నాం. ఈ పండగ పిల్లల కోసమే అయినా... అభిరుచి ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చిన ఇందులో పాల్గొనవచ్చు. ప్రాముఖ్యం తెలియాలి... పండగ సందడి పిల్లలకు రుచి చూపించాలి. ఆ సందడిలో సంప్రదాయాలు తెలుసుకోవటం, భాషా, మానవ సంబంధాల వికాసం.. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడిఉన్న అంశాలను వారు తెలుసుకోవాలి. ఇక్కడ చూసి, నేర్చుకుని, పెద్దయ్యాక ఈ సంప్రదాయాలను వాళ్ల పిల్లలకు నేర్పాలనేది మా ఆకాంక్ష. అలానే వచ్చినవారంతా ఎవరో చేస్తుంటే చూసి వెళ్లిపోకుండా... తలా ఒక పనిలో భాగస్వాములను చేస్తున్నాం. ఒకరు మామిడాకులు తెస్తే... మరొకరు రంగవల్లులకు రంగులద్దుతారు. అలా ఏంచేసినా కుటుంబంగానే చేయాలి. అప్పుడే అందులోని సంతోషం, గొప్పదనం తెలుస్తాయి. బొమ్మల కొలువు... 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలతో మెట్లు పెడతారు. పై మెట్టుపై దేవుడి బొమ్మలుంటాయి. జీవితంలో చూసే దృశ్యాలు, జంతువులు, పక్షులు, వృత్తులకు సంబంధించినవి, ప్రకృతి, సమాజంతో ఉండే అనుబంధాన్ని తెలిపేవి... ఇలా అంచలంచలుగా మానవ జీవిత సంబంధాలను ప్రతిబింబించేదే బొమ్మల కొలువు. ప్రస్తుతం ఇళ్లల్లో రోబోస్, రిమోట్ కార్లు, కార్టూన్ క్యారెక్టర్లతో కూడిన టెక్నో బొమ్మలే. మట్టి, కట్టె, లక్క బొమ్మలతో పిల్లలు ఆడుకోవటం చాలా తక్కువ. ఇక బొమ్మల కొలువు సంప్రదాయం గురించి వారికి తెలిసేదెప్పుడు! ఇక్కడ అలా కాదు... ఎవరికి నచ్చిన బొమ్మలు వారే తెచ్చుకుని కొలువులో అలంకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ వరకు ఇది కొలువుదీరుతుంది. బుధవారం సప్తపర్ణి ఆవరణలో తోరణాలు కట్టి, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టి, గంగిరెద్దుల వాళ్లని పిలిచి భోగి పండుగ జరుపుతున్నాం. సాయంత్రం సూర్యాస్తమయం లోపు అక్కడికి వచ్చిన చిన్నారులకు భోగి పండ్లు పోసి, మంగళ హారతులు పాడతారు. ఆ తరువాత సంప్రదాయబద్దంగా పేరంటమూ ఉంటుంది. -
కాలభైరవాలతో కలవరం
⇒రాజమండ్రిలో విజృంభిస్తున్న కుక్కలు ⇒బెంబేలెత్తుతున్న నగరవాసులు ⇒నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం సాక్షి, రాజమండ్రి : ఆ మూల, ఈ మూల; ఆ వాడ, ఈ వాడ అనిలేదు.. నగరంలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపుగుంపులుగా కనిపిస్తున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారుల గుండెల్ని గుబగుబలాడిస్తున్నాయి. అందుకు కారణం ఉంది. 2011లో ఒక్క మే నెలలోనే నగరంలో సుమారు 12 మంది రేబిస్ వ్యాధితో మరణించగా సుమారు 3000 మంది కుక్కకాట్లకు గురయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ నిండుకునేంత తీవ్రస్థాయిలో అప్పుడు కుక్కలు విజృంభించాయి. అనంతరం కుక్కలను నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. చట్టాలను సాకుగా చూపుతూ నిష్ఫలమైన చర్యలతో సరిపుచ్చుతున్నారు. కానీ.. కుక్కల నియంత్రణ పేరుతో 2011 నుంచి వరుసగా ఏడాదికి రూ.15 లక్షలు వెచ్చిస్తూ వస్తున్నారు. ఈ మూడేళ్లలో కాలభైరవాల (కుక్కల) సంఖ్య పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు.‘కుక్కలను చంపడం జంతు హింసా చట్టం ప్రకారం నేరం. బ్లూస్టార్ వంటి సంస్థలు కోర్టులో కేసులూ వేశాయి. ఈ నేపథ్యంలో సంతాన నిరోధక వ్యాక్సిన్ లు ఇవ్వడం ద్వారా నగరంలో మూడేళ్లలో కు క్కల సంఖ్యను తగ్గించేందుకు కార్యాచరణ రూపొం దించినట్టు 2011లో కుక్కల విజృంభణ అనంతరం అధికారులు ప్రకటించారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో కుక్కల్ని పట్టుకుని సంతాన నిరోధక టీకాలు వేయడం, బటన్ హోల్ సర్జరీ ద్వారా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయడం వంటి విధానాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 2012లో ముందుగా రూ.10 లక్షల అంచనాలు వేసి తర్వాత సవరించి రూ.15 లక్షలు ఖర్చు చేశారు. 2013 లో మరో రూ.15 లక్షలు, తాజాగా రూ.15 లక్షలు కుక్కల సంతాన నిరోధానికి ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కానీ నగరంలో ఎక్కడా కుక్కల సంఖ్య అదుపులోకి రాలేదు. నానాటికీ పెరుగుతున్నాయి.. రెండేళ్ల క్రితం చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 1.10 లక్షల కుక్కలుంటే ఒక్క రాజమండ్రిలోనే 10 వేలకు పైగా ఉన్నాయని అంచనా. కాగా అవి ఏడాదికి వెయ్యి వంతున పెరుగుతూ గత ఏడాదికి 12 వేలకు చేరుకున్నాయి. తాజాగా నగరంలో మూడు వేలు పెరిగి 15 వేలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వీటి బెడదపై ఈ ఏడాది జూలైలో నగర పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. కార్పొరేటర్లందరూ అ ధికారుల తీరును తప్పు బట్టినా పరిస్థితి మార లే దు. నగరవాసులకు నిత్యకలవరంగా మారిన ఈ బె డద విరగడకు ఇకనైనా అధికారులు నడుం కట్టాలి. -
గూడు దక్కేనా ?
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా తలదాచుకుంటున్న గూడు చెదుతుందోమోనన్న ఆవేదన తో సతమతమవుతున్నారు రాజధానిలోని నిరుపేద తెలుగువారు. పశ్చిమఢిల్లీలోని షాద్‌పూర్ డిపో సమీపంలోని కట్పుత్లీ కాలనీలో దాదాపు 50 తెలుగు కుటుంబాలు 40 ఏళ్లుగా నివాసముంటున్నాయి. ఎన్నోఏళ్లుగా ఉంటున్న స్థలాన్ని డీడీఏ రహేజా డెవలపర్స్ కంపెనీకి విక్రయించడంతో వీరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పునరావాసంలో భాగంగా తాత్కాలిక గృహాలతోపాటు శాశ్వత ప్రాతిపదికన బహుళ అంతస్తుల భవనం నిర్మించి ఇస్తామని సదరు కంపెనీ హామీ ఇస్తోంది. ఇప్పటికే ఆనందర్పర్బత్ ప్రాంతంలో తాత్కాలిక గృహాలను ఏర్పాటు చేశారు. అయితే తమకు లిఖిత పూర్వక హామీ ఇవ్వకుండానే ఇళ్లు ఖాళీ చేయమంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పస్తుతం ఉంటున్నవారికి సరిపడా ఇల్లు ఇవ్వడం లేదని, కొందరు ఫుట్‌పాత్‌ల పాలు కావాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు.దీనిపై స్థానిక తెలుగువారికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని కె.బాబురావు మాట్లాడుతూ..‘మేం అందరం 40 ఏండ్ల కింద ఈడికి వచ్చినం. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన బుడగజంగాల వాళ్లే! మేం మూలికల వైద్యం, కూలీ పనులతో పొట్టపోసుకుంటున్నం. నాయకులు కూడా మాకు ఈ స్థలంలనే ఇల్లులు కూడా కట్టించి ఇస్తమన్నరు. ఇప్పుడు డీడీఏ వోళ్లు ఈ స్థలం రహేజా కంపెనీకి అమ్మిన్నరంట. మాకు తెల్వనే తెల్వదు. వాళ్లేమో మీకు ఇండ్రు కట్టిస్తం ఈడి నుంచి పొమ్మటున్నరు. అక్కడ చూస్తే చిన్నచిన్న ఇల్లులు ఉన్నయి. మా కాలనీల ఉండేటోళ్లలో సగం మందికే కాగితాలున్నయని చెబుతున్నరు. మిగిలినోళ్లకు ఆధారం పోతుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోయిన పక్క సమాజమోళ్లలో 30 కుటుంబాలకు ఇళ్లు ఇయ్యలేదు. అడి గితే మీకు కాగితాలు లేవన్నరు. ఇక్కడ అంతకు మందు ఉన్న ఇళ్లు తాళాలేసిండ్రు. మేం ఇక్కడి నుంచి కదిలితే రేపు మా పరిస్థితి ఏంది ? డీడీఏ సార్లు, లీడర్లను కలిసినం. ఎవరూ పక్కాగా చెప్తలేరు. కాగితాలేమీ ఇవ్వట్లేరు. 14 అంతస్తులు కట్టిస్తమంటున్నరు. వాటిల్లో ఉండుండు మాకు కష్టం. మరీ రెండునెల్ల నుంచి పోలీసులు రాత్రుళ్లు వస్తున్నరు. బెదిరిస్తున్నరు. మొత్తం రూ.6.11 కోట్లకు రహేజావాళ్లకు స్థలం అమ్మిన్రంట. ఆ డబ్బులిస్తే మాకు స్థలం ఇస్తమంటున్నరు. తెలుగు నాయకులన్నా మా బాధలు పట్టించుకోవాలె. మేం దీనిపై హైకోర్టులో కేసు వేసినం. ఈనెల 11న వస్తదంట. మాకు న్యాయం చెయ్యాలని సార్లకు మొక్కుకుంటున్నం’ అంటూ వివరించారు. మేం ఎక్కడికి పోవాలే: కుష్టురోగుల ఆవేదన కట్పుత్లీ కాలనీలోనే దాదాపు 50 మంది తెలుగువారు కుష్టురోగంతో బాధపడుతున్నారు. వీరంతా ఎన్నోఏళ్లుగా కుటుంబాలతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు. జబ్బులున్న తమను సాధారణంగా ఉన్నవారితో కలుపుకోరని, మేం వేరుగా ఒక్కచోట బతుకుతున్నామని స్థానికుడు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శరణార్థుల కాలనీలో ఏర్పాటు చేసిన వసతుల మధ్య తాము బతకలేమని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. స్థానికంగా 1984లో స్థాపించిన లోక్‌మాతా కుష్టు ఆశ్రమంలో తాము తలదాచుకుంటున్నట్టు తెలిపారు. తెలిసినవారు దయతలిచి ఇచ్చే విరాళాలు, సహాయంతోనే తాము జీవిస్తున్నామని, ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలితే చెల్లాచెదురవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టలు సదును చేసుకున్నం -గురువయ్య మేం కొత్తల వచ్చినప్పుడు అంతా గుట్టలు, బొందలే ఉండే. అంతా సదును చేసుకొని గుడిసెలు ఏసుకున్నం. ఇప్పుడు ఈ రూపుకి వచ్చింది. మాకు కరెంట్, నీళ్లు అన్నీ వచ్చి కాస్త మంచిగుండే సరికి మళ్ల పొమంటున్నరు. ఈడ నుంచి ఏడికి పోవాలె? ఎట్ల బతకాలె? అధికారులే చెప్పాలె. నెల నుంచి తిండీ తిప్పల్లేవు -శకుంతల మేం ఈడ ఉండబట్టి 50 ఏండ్లు కావస్తుంది. నాభర్త, అత్త అంతా ఈడ బతికి.. ఈడనే పోయిండ్రు. కూలీనాలీ చేసుకొని బతికేటోళ్లం. ఇండ్లు కూలగొడతమని బెదిరిస్తున్నరు. రాత్రుళ్లు పోలీసోళ్లు వచ్చిపోతున్నరు. ఎప్పుడు ఎవరొస్తరో అని పనులు వదిలిపెట్టి ఇండ్లకాన్నే ఉంటున్నం. తిండీతిప్పలుగూడ లేవు. ఏడికిపోవాలే? -సంతోష 40 ఏళ్ల నుంచి ఈడ ఉంటున్నం. ఇప్పుడు రహేజోళ్లకి అమ్మినం పొంమంటున్నరు. అమ్మిన సంగతి కూడా మాకు తెల్వదు. ఇల్లు కట్టిస్తమని చెపుతున్నరు. మాకు నమ్మకం ఎట్ల. ఈడ మాకు ఇండ్లు కట్టిస్తమని మా ఎంపీ మాకెన్ అంతా చెప్పిండ్రు. ఇప్పుడు కాళీ చెయ్యమంటున్నరు. ఈడనే సస్తం -కమల గుంటలు పూడ్సుకొని, కంపచెట్లు కొట్టి సాపు చేసుకున్నం. గుడిసెలు ఏసుకున్నం. ఏండ్ల సంది మా పిల్లలు జల్లలు అంతా ఈడనే బతికినం. ఇప్పుడు కాళీ చెయ్యమంటే ఏడికి పోవాలి. ఈడ్నే పుట్టినం. ఈడ్నే సస్తం. కాళీచేసేది లేదు. ఈడ నుంచి అడుగు బయట పెడితె బతకడం కష్టం.