![Hyd Police Warn Residents Against Burglaries During Dussehra Feastival - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/1/stephen.jpg.webp?itok=2nWrCY-Z)
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్‌లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్
రవీంద్ర పలు సూచనలు చేశారు.
► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్‌లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి.
► సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.
► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.
► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి.
► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment