
సాక్షి, ఖమ్మం జిల్లా: ఖమ్మంలోని లింగయ్య నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జేసీబీలతో గుడిసెలను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులు యత్నించారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటూ భూదాన్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామంటున్న భూదాన్ భూ నిర్వాసితులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది.
అడ్డుకున్న భూదాన్ నిర్వాసితులపై దాడి జరిగింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ వ్యక్తులను భూదాన్ భూ నిర్వాసితులు తరిమికొట్టారు.
ప్రైవేట్ రౌడీలు వచ్చి పోలీసుల సమక్షంలో తమపై దాడికి పాల్పడుతున్న కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనంటే పోలీసుల సమక్షంలో రౌడీలు వచ్చి తమపై దాడి చేయడమా అంటూ నిర్వాసితులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment