భోపాల్: మధ్యప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలను అయోధ్య దర్శనానికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఎలాంటి ఖర్చు లేకుండా దశలవారీగా అందర్నీ అయోధ్యకు తీసుకెళ్తాం అని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు.
మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నవంబర్ 15కు ప్రచారాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. నేను బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రామ మందిర నిర్మాణ తేదీ ఎప్పుడని రాహుల్ గాంధీ అడిగేవారు. ఇప్పుడు చెబుతున్నా జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది" అని అమిత్ షా అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తమ కుమారుల భవిష్యత్ కోసమే ప్రాకులాడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ తమ కుమారులను సీఎం చేయాలని చూస్తున్నారని తెలిపిన అమిత్ షా.. కేవలం సంతానం కోసమే రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు
Comments
Please login to add a commentAdd a comment