ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.
ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.
“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.
తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment