ప్లాట్లుగా పోర్న్‌ స్టూడియో.. వద్దంటున్న జనం! | Residents oppose plans to turn porn studio into houses | Sakshi
Sakshi News home page

ప్లాట్లుగా పోర్న్‌ స్టూడియో.. వద్దంటున్న జనం!

Published Tue, Apr 19 2016 5:29 PM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

ప్లాట్లుగా పోర్న్‌ స్టూడియో.. వద్దంటున్న జనం! - Sakshi

ప్లాట్లుగా పోర్న్‌ స్టూడియో.. వద్దంటున్న జనం!

వాయవ్య ఇంగ్లండ్‌ బ్రిస్టల్ నగరంలోని బ్లూ మూవీ స్టూడియో.. నిన్నమొన్నటి వరకు ఘాటైన శృంగార దృశ్యాల చిత్రీకరణలతో హోరెత్తేది. ఈ స్టూడియోలో నిత్యం పోర్న్‌ సినిమాలు నిర్మించి.. వాటిని లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసేవారు. ఈ స్టూడియోను ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి అమ్మేయాలని తాజాగా యజమాని నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని స్థానిక కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్లూ మూవీ స్టూడియోను ఫ్లాట్లుగా చేసి అమ్మితే.. వలసదారులే వాటిని కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుదారని, పోర్న్‌స్టార్లు అంటే వలసదారులకు చాలా ఇష్టమని స్థానిక కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 35 మంది కాలనీ వాసులు ఆందోళనబాటపట్టారు. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా మారిస్తే.. ఇక్కడి తమ ఇళ్లను అమ్మేసుకోని వేరే చోటుకి వెళ్లిపోతామని వారిలో కొందరు హెచ్చరిస్తున్నారు.

బ్రిస్టల్‌ సెయింట్ జార్జ్‌లోని ఈ స్టూడియోను నిన్నమొన్నటి వరకు ఫిల్ బేరి స్టూడియోగా వాడుకున్నాడు. పోర్న్ స్టార్ క్యాథీ బేరి భర్త అయిన ఫిల్ల్ ఈ నివాసంలో పోర్న్‌ దృశ్యాలు తీసి.. వాటిని లైవ్ ప్రసారం చేసేవాడు. అయితే, దీని యజమాని మైక్ హాబిన్స్‌ ఇంటిని 40 డబుల్ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లుగా మార్చి.. అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా నగరంలో నెలకొన్న ఇళ్ల సంక్షోభం పరిష్కారానికి కొంత సహకారం అందించాలని ఆయన భావిస్తున్నారు.

అయితే, హాబిన్స్ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. పోర్న్ స్టూడియో వల్ల తమకు గతంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, ఎదైనా సమస్య వస్తే.. దానిని యజమాని దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించేవారని, ఇప్పుడు దీనిని ఫ్లాట్లుగా చేస్తే.. ఇందులో ఉండేందుకు విదేశీ ఉద్యోగులే ముందుకొస్తారని, అలా 35 మంది వరకు వలసదారులు తమ కాలనీలోకి వస్తే సమస్యలు వచ్చే అవకాశముంటుందని స్థానికంగా నివాసముండే 38 ఏళ్ల నవోమి మ్యాగ్స్‌ పేర్కొంది. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా చేస్తే.. దాని ఎదురుగా ఉన్న తమ ఇంటిని అమ్మేస్తామని ఆమె హెచ్చరిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement