bristol
-
ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
లండన్: బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్‌లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. సాధారణంగా ఓ హోటల్లో తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. మరికొన్ని ప్రముఖ హోటళ్లలో మాత్రం ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక ఫుడ్ ఐటెం కోసం నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విడ్డూరమే. అలాంటి విడ్డూరమే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్‌లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్‌వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారు. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం.. -
తొలి టి20లో దక్షిణాఫ్రికా గెలుపు
బ్రిస్టల్: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రీజా హెన్డ్రిక్స్ (53 బంతుల్లో 74; 10 ఫోర్లు, 1 సిక్స్), ఎయిడెన్ మార్క్రమ్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. లార్కన్ టకర్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జార్జ్ డాక్రెల్ (28 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లో చివరిదైన రెండో టి20 మ్యాచ్ నేడు జరుగుతుంది. -
ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది
ఇంగ్లండ్/ బ్రిస్టల్: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది. పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. (చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా ఇంగ్లండ్, బ్రిస్టల్ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి. అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లో డాక్టర్ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు. ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా (చదవండి: వైరల్: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..) కొద్ది కాలం తర్వాత లాక్డౌన్ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ. ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్‌కు గురైందని తెలిపింది. (చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్) ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది. చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు -
ప్రైవేటు కార్లను నిషేధిస్తున్న తొలి సిటీ
న్యూఢిల్లీ : డీజిల్, పెట్రోల్‌తో సంబంధం లేకుండా ప్రపంచంలో ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తున్న తొలి నగరం బ్రిటన్‌లోని యార్క్ సిటీ. పబ్లిక్ రవాణా బస్సులు, దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలు మినహా మిగతా ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నిషేధం సిటీవాల్స్ వరకు, నగరం చుట్టూ నిర్మించిన గోడల పరిధి వరకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. నగరం చుట్టూ రోమన్ కాలంలో నిర్మించిన గోడలు ఇప్పటికీ అక్కడ బలంగానే ఉన్నాయి. పబ్లిక్ రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా పెట్రోలు, డీజిల్ కార్లే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను కూడా నిషేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వచ్చే ఈ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. కాలుష్యానికి కారణం పర్యాటకులంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ విమర్శలను పర్యాటకుల మీదకు నెట్టింది. నగరంలోని 12 ప్రాంతాల్లో కాలుష్య ప్రమాణాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో 2030 నాటికల్లా నగరంలో కర్బన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకరావాలని నగర మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకొంది. అందులో భాగంగా 2023 నాటికి నగరంలో సంపూర్ణ కార్ల నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే నేపథ్యంలోనే 2021 సంవత్సరం నాటికి డీజిల్ కార్లను సంపూర్ణంగా నిషేధించాలని బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరం నిర్ణయం తీసుకుంది. -
ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోది..
బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయ్యింది. భారీ వర్షం పడటంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో వరల్డ్‌కప్‌లో మూడో మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వారం వ్యవధిలో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. భారత కాలమాన ప్రకారం సాయంత్రం గం. 6.30ని.లకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలుమార్లు పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్ జరపడం సాధ్యం కాదని తేల్చారు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితంగా ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయించారు. మ్యాచ్ రద్దయిన తర్వాత శ్రీలంక నాలుగు పాయింట్లతో ఉండగా, బంగ్లాదేశ్ మూడు పాయింట్లతో ఉంది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక-బంగ్లాలు తలో మ్యాచ్ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్తాన్‌తో శ్రీలంక ఆడాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. -
శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం
బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు సైతం వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం గం.3.00ని.లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. దాంతో మ్యాచ్ టాస్ వేయడానికి ఆలస్యం కానుంది. పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ సైతం రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో సఫారీలు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో పాటు ఒక మ్యాచ్ రద్దు కావడం సఫారీలకు శాపంగా మారింది. వర్షాలు ఇలానే పడితే పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. -
పాక్-శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం
బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్‌లో శుక్రవారం పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. వరుణుడు పదే పదే అంతరాయం కల్గించడంతో కనీసం టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం..3.00ని.లకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో పిచ్, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే చివరగా రాత్రి గం.8.30 ని.లకు పిచ్‌ను రిఫరీతో కలిసి పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పిచ్ చిత్తడిగా మారిపోవడంతో గ్రౌండ్స్‌మెన్ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. కనీసం 20 ఓవర్లు మ్యాచ్‌ను నిర్వహించాలని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. ఓవరాల్ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంకకు పాయింట్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకముందు ఇరు జట్లు ఏడుసార్లు వరల్డ్‌కప్‌లో తలపడగా అన్ని సందర్భాల్లోనూ పాక్‌నే విజయం వరించింది. -
పాక్-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ఆటంకం
బ్రిస్టల్: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో టాస్ ఆలస్యం కానుంది. మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో టాస్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసినా... రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. మరొకవైపు ప్రపంచకప్‌లో శ్రీలంకపై పాక్‌కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఏడు మ్యాచ్‌లాడగా ఏడింట్లోనూ శ్రీలంకపై పాక్‌దే పైచేయి. -
చివరి టీ20 ; భారత్ లక్ష్యం 199
బ్రిస్టల్ : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నిర్ణాయత్మక మూడో టీ20లో ఇంగ్లండ్ భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్, బట్లర్ దాటిగా ఆడటంతో స్కోర్ 7 ఓవర్లలోనే 82 పరుగులకు చేరింది. 8 ఓవర్లో సిదార్థ్ కౌల్ బట్లర్(34)ను అవుట్ చేయడంతో పరుగుల దాటికి అడ్డుకట్ట పడింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద జాసన్(67) వెనుదిరగడంతో పరుగుల వేగం కాస్త తగ్గింది. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హేల్స్ (30), బెయిర్‌స్టో(25), స్టోక్స్(14) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కొల్పోయి 198 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు, కౌల్ రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్‌లకు చెరో వికెటు దక్కింది. -
నది ఒడ్డున భయానక దృశ్యం.. పరుగులు
బ్రిస్టల్ : నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ వ్యక్తి శరీరాన్ని చూసి ప్రజలు పరుగులు తీశారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నదిపై ఉన్న బ్రిస్టల్ బ్రిడ్జి పక్కకు ఉన్న ప్రదేశంలోకి ఓ శవం కొట్టుకువచ్చింది. వ్యక్తి శరీరం మొత్తం తాళ్లు చుట్టి ఉండటంతో హడలిపోయిన ప్రజలు దాన్ని ‘మమ్మీ’ గా భావించారు. అయితే, వ్యక్తి శరీరం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఎలాంటి సమాచారం అందలేదని బ్రిస్టల్ పోస్ట్ పేర్కొంది. హాలోవీన్ సందర్భంగా బ్రిడ్జిపై వెళ్తున్న వారిని భయాందోళనలకు గురి చేసేందుకు కొందరు వ్యక్తులు ఈ పని చేసుంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ప్లాట్లుగా పోర్న్ స్టూడియో.. వద్దంటున్న జనం!
వాయవ్య ఇంగ్లండ్ బ్రిస్టల్ నగరంలోని బ్లూ మూవీ స్టూడియో.. నిన్నమొన్నటి వరకు ఘాటైన శృంగార దృశ్యాల చిత్రీకరణలతో హోరెత్తేది. ఈ స్టూడియోలో నిత్యం పోర్న్ సినిమాలు నిర్మించి.. వాటిని లైవ్ స్ట్రీమింగ్ చేసేవారు. ఈ స్టూడియోను ఇప్పుడు ఫ్లాట్లుగా మార్చి అమ్మేయాలని తాజాగా యజమాని నిర్ణయించడం కలకలం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని స్థానిక కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్లూ మూవీ స్టూడియోను ఫ్లాట్లుగా చేసి అమ్మితే.. వలసదారులే వాటిని కొనుగోలు చూపేందుకు ఆసక్తి చూపుదారని, పోర్న్‌స్టార్లు అంటే వలసదారులకు చాలా ఇష్టమని స్థానిక కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 35 మంది కాలనీ వాసులు ఆందోళనబాటపట్టారు. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా మారిస్తే.. ఇక్కడి తమ ఇళ్లను అమ్మేసుకోని వేరే చోటుకి వెళ్లిపోతామని వారిలో కొందరు హెచ్చరిస్తున్నారు. బ్రిస్టల్ సెయింట్ జార్జ్‌లోని ఈ స్టూడియోను నిన్నమొన్నటి వరకు ఫిల్ బేరి స్టూడియోగా వాడుకున్నాడు. పోర్న్ స్టార్ క్యాథీ బేరి భర్త అయిన ఫిల్ల్ ఈ నివాసంలో పోర్న్ దృశ్యాలు తీసి.. వాటిని లైవ్ ప్రసారం చేసేవాడు. అయితే, దీని యజమాని మైక్ హాబిన్స్ ఇంటిని 40 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లుగా మార్చి.. అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా నగరంలో నెలకొన్న ఇళ్ల సంక్షోభం పరిష్కారానికి కొంత సహకారం అందించాలని ఆయన భావిస్తున్నారు. అయితే, హాబిన్స్ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. పోర్న్ స్టూడియో వల్ల తమకు గతంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, ఎదైనా సమస్య వస్తే.. దానిని యజమాని దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించేవారని, ఇప్పుడు దీనిని ఫ్లాట్లుగా చేస్తే.. ఇందులో ఉండేందుకు విదేశీ ఉద్యోగులే ముందుకొస్తారని, అలా 35 మంది వరకు వలసదారులు తమ కాలనీలోకి వస్తే సమస్యలు వచ్చే అవకాశముంటుందని స్థానికంగా నివాసముండే 38 ఏళ్ల నవోమి మ్యాగ్స్ పేర్కొంది. ఈ స్టూడియోను ఫ్లాట్లుగా చేస్తే.. దాని ఎదురుగా ఉన్న తమ ఇంటిని అమ్మేస్తామని ఆమె హెచ్చరిస్తున్నది. -
రహస్యంగా వీడియో తీసి...
లండన్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాడు పనులకు పాల్పడి బ్రిటన్ లో జైలు పాలయ్యాడు. రహస్యంగా టీనేజర్లను అభ్యంతకరంగా చిత్రీకరించి తీసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు జొనాథన్ థామ్సన్-గ్లొవర్(53)కు కోర్టు సుమారు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిస్టల్ లోని క్లిఫ్టన్ కాలేజీలో 16 ఏళ్లపైగా పనిచేసిన థామ్సన్ 12 నుంచి 17 ఏళ్ల వయసున్న 120 టీనేజర్లను రహస్యంగా వీడియో తీశాడు. స్నానాలు, పడక గదుల్లో వారి కదలికలను చిత్రీకరించాడు. సెలవుల్లో పాఠశాల గోడల్లో కెమెరాలు అమర్చి వాటిని తన గదిలోని వీడియో రికార్లకు కనెక్ట్ చేశాడు. అతడి వద్ద 2500 గంటల ఫుటేజీ దొరికింది. జర్మనీకి చెందిన థామ్సన్ ను యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ గతేడాది అరెస్ట్ చేసింది. టీనేజర్లకు చెందిన అభ్యంతకర చిత్రాలను డౌన్ చేస్తున్నారన్న నేరంపై అతడిని అదుపులోకి తీసుకోగా రహస్య చిత్రీకరణ విషయం బయటపడింది. దోషిగా తేల్చిన టాండన్ క్రౌన్ కోర్టు.. అతడికి మూడు ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది. -
వర్షంతో తొలి వన్డే రద్దు
- రెండో వన్డే బుధవారం - ఆ మ్యాచ్‌కూ వరుణుడి గండం బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉదయం కొద్దిసేపు ఆగినా మళ్లీ మొదలై మధ్యాహ్నం వరకు ఆగలేదు. దీంతో మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం కార్డిఫ్‌లో జరుగుతుంది. అయితే బుధవారం ఆ నగరంలోనూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. -
పోరాడాల్సిన సమయం
►సచిన్ సలహాలు తీసుకున్నా ►ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తా ►సురేశ్ రైనా ఇంటర్వ్యూ లండన్: ప్రతి జట్టులోనూ ఒకరిద్దరు ప్రత్యేకమైన ఆటగాళ్లుంటారు. వారు తమ పాత్రకు మాత్రమే పరిమితం కాకుండా.. మైదానం లోపల, బయట చురుగ్గా వ్యవహరిస్తూ జట్టులో ఉత్సాహం నింపుతుంటారు. సహచరుల విజయాన్ని తన సక్సెస్‌గా భావిస్తూ సంతోషం పంచుకుంటారు. వారు జట్టులో ఉంటే ఎప్పుడూ కొత్త ఉత్సాహం తొణకిసలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆటగాళ్లలో ఒకడు సురేష్ రైనా. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు జట్టుతో కలిశాడు. టెస్టు సిరీస్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయి ఉన్న భారత జట్టులో తాను నూతనోత్సాహాన్ని నింపుతానని, పోరాడటమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమని రైనా చెబుతున్నాడు. వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైనాతో ఇంటర్వ్యూ బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత విరామంలో ఏం చేశారు? ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బయలుదేరడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పొందే ప్రయత్నం చేశాను. ఇందుకోసం ఢిల్లీ, నోయిడాలలో టర్ఫ్ వికెట్‌పై ప్రాక్టీస్‌తోపాటు కొన్ని మ్యాచ్‌లూ ఆడాను. లక్నోలో చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్ విద్యార్థిగా చదువుకున్నప్పటి స్పోర్ట్స్ కాలేజిలోనూ ప్రాక్టీస్ చేశాను. పదిరోజులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఇండోర్ స్టేడియంలో సాధన చేశాను. బీకేసీలో సచిన్ సలహాలేమైనా పొందారా? సచిన్ అక్కడికి బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చేవారు. అర్జున్ టెండూల్కర్ నెట్స్‌లో ప్రాక్టీస్‌కు వచ్చాక అతని వద్దకు వెళ్లి సలహాలిచ్చేవారు. అదే సమయంలో నేను వెళ్లి ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి సచిన్‌ను అడిగేవాణ్ని. సచిన్‌తోపాటు ప్రవీణ్ ఆమ్రేతో నా బ్యాటింగ్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించాను. వారి సలహాలు తీసుకున్నాను. ఇంగ్లండ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా సిద్ధమయ్యారు? స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ ఏమైనా చేశారా? స్వింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా టేపు వేసిన టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాను. తొలి వన్డేకు ముందు బ్రిస్టల్‌లో రెండు సెషన్లు సాధన చేస్తున్నాం. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవడానికి ఈ మాత్రం ప్రాక్టీస్ సరిపోతుంది. కచ్చితంగా ఇంగ్లండ్‌తో వన్డేల్లో రాణిస్తాననే నమ్మకం ఉంది. టెస్టు సిరీస్‌లో ఓడిన జట్టుతో కలిశారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుతో పాటు కలవడం గురించి చెప్పండి? ప్రస్తుతం జట్టు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటప్పుడే స్థైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అంతటి ఓటమిని అధిగమించి ముందుకు సాగడం కష్టమైన పనే అయినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు పోరాటపటిమను ప్రదర్శించాల్సివుంటుంది. అయితే కొత్త ఆటగాళ్ల రాక జట్టుకు నూతనోత్సాహం అందిస్తుంది. టెస్టు సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లు తమ పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారికి మేం కొత్త స్ఫూర్తిని అందిస్తాం. ఇది జట్టుగా పోరాడాల్సిన సమయం. సీనియర్ ఆటగాడిగా వన్డే జట్టులో చేరుతున్నారు.. జట్టులో సానుకూల దృక్పథం నింపే బాధ్యతను మీరే స్వయంగా తీసుకుంటారా? మైదానం లోపల, బయట ఎప్పుడూ జట్టులో ఉత్సాహం నింపేందుకే నేను ప్రయత్నిస్తుంటాను. వికెట్ పడినప్పుడు బౌలర్ లేదా ఫీల్డర్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించే మొదటి వ్యక్తిని నేను. ఇలాంటి చిన్న విషయాలే జట్టులో ఉత్సాహపూరిత వాతావరణం తెస్తాయి. ఒకరి నుంచి మరొకరికి ఇది స్ఫూర్తినిస్తుంది. ఈ విషయాన్ని మా కోచ్ వద్ద నేర్చుకున్నాను. మహి (ధోని) కూడా ఎవరైనా మంచి క్యాచ్ పట్టినప్పుడు, అద్భుతంగా ఫీల్డింగ్ చేసినప్పుడు వారి భుజం తట్టాలని చెబుతుంటాడు. దీని ద్వారా ఆటలో మనం ఎంతగా లీనమవుతున్నామన్న విషయం అర్థమవుతుందంటాడు. అందుకే మైదానంలో నా పనికి మాత్రమే పరిమితం కాకుండా ఇతరుల్ని ఉత్సాహపరుస్తూ సానుకూల దృక్పథం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాను. గత పదేళ్లుగా నేను దీన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడూ అదే చేస్తాను. వన్డేల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావాలని మీరు తపన పడుతుంటారు. నాలుగో స్థానంలో ఆడడానికి, ఆరో స్థానానికి ఏమైనా తేడా ఉంటుందా? రెండు కొత్త బంతుల నిబంధన వచ్చాక ఏ స్థానంలో ఆడినా దాదాపు ఒకేలా ఉంటోంది. కొద్దిసేపైనా కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా.. ప్రస్తుత టెయిలెండర్లు బ్యాటింగ్ బాగా చేయగలిగినవారు కాబట్టి వారితో కలిసి బ్యాటింగ్ చేయడం సులభమే. కానీ, ఆ సమయంలో దాదాపుగా పవర్ ప్లే అమల్లో ఉండి.. వికెట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే కనీసం ఒక బ్యాట్స్‌మన్ క్రీజులో నిలదొక్కుకుని చివరిదాకా ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. పార్ట్ టైమ్ ఆఫ్‌స్పిన్నర్‌గా మీ బాధ్యతను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారు? మ్యాచ్‌లో నాలుగైదు ఓవర్లు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకు తగ్గట్టుగానే నేను సిద్ధంగా ఉంటాను. అయితే ప్రధానంగా పరుగుల వేగాన్ని అడ్డుకోవడమే నా బాధ్యతగా ఉంటుంది. కానీ, ఇటీవల టెస్టు సిరీస్‌ను గమనించాక.. బంతితోనూ రాణించే దిశగా దృష్టి పెడుతున్నాను. సౌరవ్ గంగూలీతోనూ కొద్దిసేపు ముచ్చటించినట్లున్నారు.. ఏ విషయంపై మాట్లాడారు? స్వయంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన సౌరవ్.. సాంకేతిక పరమైన విషయాల్లో సలహాలిచ్చారు. ప్రధానంగా ఇంగ్లండ్‌లో బ్యాటింగ్‌కు మానసికంగా ఎలా సిద్ధం కావాలో చెప్పారు. బ్రిస్టల్‌లో మూడేళ్ల తరువాత.. బ్రిస్టల్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య సోమవారం జరిగే తొలి వన్డే కోసం బ్రిస్టల్‌లోని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడి బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ జరిగి ఇప్పటికి మూడేళ్లు కావడమే అందుకు కారణం. 2011, జూన్‌లో ఇంగ్లండ్, శ్రీలంకల మధ్య టి20 మ్యాచ్ జరిగాక మళ్లీ ఇక్కడ మ్యాచ్ జరగలేదు. ఇక వన్డే మ్యాచ్ అయితే 2010 జూలైలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగినదే చివరిది. అయితే సీటింగ్ సామర్థ్యం, సౌకర్యాలు మెరుగు పరచడం కోసం ఈ విరామం వచ్చింది. ప్రస్తుతం 15 వేల సీటింగ్ సామర్థ్యంతో గ్రౌండ్ సిద్ధమైంది. -
సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్
బ్రిస్టోల్: భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఎసెక్స్ తరుపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్-గ్లోసెష్టైర్ల మధ్య జరుగుతున్నసెకెండ్ ఇన్నింగ్స్‌లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న గౌతం వంద పరుగులు చేసి జట్టు మంచి ఇన్నింగ్స్ చేయడంలో తోడ్పడ్డాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో అనూహ్యంగా బరిలోకి దిగి తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. ఈ సెంచరీతో గౌతం గంభీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 34 వ సెంచరీ మార్కును చేరుకున్నాడు. -
సెంచరీతో ఆకట్టుకున్న గౌతం గంభీర్
బ్రిస్టోల్: భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న గౌతం గంభీర్ కౌంటీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఎసెక్స్ తరుపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా ఎసెక్స్-గ్లోసెష్టైర్ల మధ్య జరుగుతున్నసెకెండ్ ఇన్నింగ్స్‌లో అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. 144 బంతులు ఎదుర్కొన్న గౌతం వంద పరుగులు చేసి జట్టు మంచి ఇన్నింగ్స్ చేయడంలో తోడ్పడ్డాడు. ఎసెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు ప్రో 40 మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ హమీష్ రూథర్‌ఫోర్డ్ స్థానంలో అనూహ్యంగా బరిలోకి దిగి తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. ఈ సెంచరీతో గౌతం గంభీర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ లో 34 వ సెంచరీ మార్కును చేరుకున్నాడు. -
ఔను...అచ్చం అలాగే!
కాపీ కళలో కాకలు తీరిన ఆర్టిస్ట్ మైక్ రోమ్. అరవై ఆరు సంవత్సరాల మైక్, బ్రిస్టల్(ఇంగ్లండ్)లోని తన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మోనాలిసాలాంటి మాస్టర్పీస్లను వేగంగా గీస్తుంటాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వందలాది కళాఖండాలను ఒంటిచేత్తో గీశాడు మిస్టర్ రోమ్. ఈయన ఒకప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడు.తన భార్య పామ్ చనిపోయిన తరువాత రోమ్ను ఒంటరితనం ఆవహించింది. దాని నుంచి బయటపడడానికి తనను తాను ఎప్పుడు బిజీగా ఉంచుకోవడానికి ఈ కళ తనకు ఉపయోగపడింది. చిత్రకళలో ఎవరి దగ్గరా ఎలాంటి శిక్షణా తీసుకోని రోమ్ ‘సాధనను మించిన అనుభవం లేదు’ అని నమ్ముతాడు. రోమ్‌లోని ప్రతిభ మొదటిసారి కొందరు ఇంజనీర్ల దృష్టిలో పడింది. అప్పుడు ఆయన వారి ఆఫీస్‌లో పనిచేసేవాడు.రోమ్ను చిత్రాలు వేయించే దిశగా ఆ ఇంజనీర్లు ఎంతగానో ప్రోత్సహించారు.తాను ఒక చిత్రాన్ని చిత్రించే ముందు దాని తాలూకు ఒరిజినల్‌ను గ్యాలరీకి వెళ్లి చూసి వస్తాడు. ఆ తరువాతగానీ కుంచెకు పనిచెప్పడు రోమ్. ‘‘నేను గీసేవి నకిలీ అనుకోనక్కర్లేదు. వాటికంటూ ఒక సొంత విలువ ఉంది’’ అంటాడు రోమ్. ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి తీసుకుంటాడు. రోమ్ కాపీ చేసిన చిత్రాలు ఎన్నో గ్యాలరీలలో కొలువవుతుంటాయి. మంచి ధరకు అమ్ముడవుతుంటాయి. ‘‘చిత్రకళలలో నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికే మొదట ఈ పని మొదలు పెట్టాను’’ అంటున్న రోమ్ ఆ తరువాత ‘రెప్లికా’ ను ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు. ప్రసిద్ధ చిత్రాలను మాత్రమే కాపీ చేయాలనే నియమమేదీ పెట్టుకోలేదు. తన మనసుకు నచ్చిన అనామక చిత్రాలను కూడా కాపీ చేస్తుంటాడు.‘‘కాపీ కళ అనగానే కొంత చిన్నచూపు ఉంటుంది. గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది’’ అంటాడు రోమ్. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాలను అమ్మగలనంటున్నాడు మైక్ రోమ్.