
బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు సైతం వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం గం.3.00ని.లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది.
దాంతో మ్యాచ్ టాస్ వేయడానికి ఆలస్యం కానుంది. పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ సైతం రద్దయిన సంగతి తెలిసిందే. దాంతో సఫారీలు సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమితో పాటు ఒక మ్యాచ్ రద్దు కావడం సఫారీలకు శాపంగా మారింది. వర్షాలు ఇలానే పడితే పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment