
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్‌కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు.
సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది.
అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో టెస్ట్ ఆడాడు .
శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర
Comments
Please login to add a commentAdd a comment