శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుక్రికెట్‌కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్‌కు తెలియజేశాడు. పరిమిత ఓవర్లపై దృష్టిసారించేందుకే హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడిని నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కూడా అంగీకరించరింది. మేము హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము.
"మా వైట్-బాల్ జట్టులో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని భావిస్తున్నామని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా పేర్కొన్నాడు. కాగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్‌లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఇప్సటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ప్రాతినిథ్యం వహించాడు. హసరంగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బీలవ్‌కాండీ జట్టుకు సారధిగా ఉన్నాడు.
చదవండి: ODI WC 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు?
Comments
Please login to add a commentAdd a comment