
బ్రిస్టల్: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో టాస్ ఆలస్యం కానుంది. మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో టాస్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసినా... రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. మరొకవైపు ప్రపంచకప్‌లో శ్రీలంకపై పాక్‌కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఏడు మ్యాచ్‌లాడగా ఏడింట్లోనూ శ్రీలంకపై పాక్‌దే పైచేయి.