65 ఏళ్ల కిందటి రికార్డును సమం చేసిన పాక్‌ వైస్‌ కెప్టెన్‌ | Saud Shakeel Becomes Joint Fastest Batter To Score 1000 Runs For Pakistan In Test Cricket | Sakshi
Sakshi News home page

65 ఏళ్ల కిందటి రికార్డును సమం చేసిన పాక్‌ వైస్‌ కెప్టెన్‌

Published Thu, Aug 22 2024 11:45 AM | Last Updated on Thu, Aug 22 2024 12:10 PM

Saud Shakeel Becomes Joint Fastest Batter To Score 1000 Runs For Pakistan In Test Cricket

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌ వైస్‌ కెప్టెన్‌ సౌద్‌ షకీల్‌ 65 ఏళ్ల కిందటి ఓ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో పాక్‌ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సయీద్‌ అహ్మద్‌ సరసన నిలిచాడు. సయిద్‌ అహ్మద్‌, సౌద్‌ షకీల్‌ ఇద్దరూ కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. 

సయీద్‌ అహ్మద్‌ 1959లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్‌ సాధించగా.. షకీల్‌ తాజాగా ఈ ఘనతను సాధించాడు. పాక్‌ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న టాప్‌-5 ఆటగాళ్ల జాబితాలో సౌద్‌, సయీద్‌ తర్వాత సాదిక్‌ మొహమ్మద్‌ (22), జావిద్‌ మియాందాద్‌ (23), తౌఫిక్‌ ఉమర్‌ (24) ఉన్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ తొలి సెషన్‌ సమయానికి 56 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సౌద్‌ షకీల్‌ 75, మొహమ్మద్‌ రిజ్వాన్‌ 65 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో పాక్‌ అబ్దుల్లా షఫీక్‌ (2), సైమ్‌ అయూబ్‌ (56), షాన్‌ మసూద్‌ (6), బాబర్‌ ఆజమ్‌ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్‌ ఇస్తాం, హసన్‌ మహ్మూద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

సౌద్‌ షకీల్‌ 20 ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు..
37, 76, 63, 94, 23, 53, 22, 55*, 125*, 32, 208*, 30, 57, 28, 24, 9, 24, 5, 2, 75*

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement