Saud Shakeel
-
సౌద్ షకీల్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా పాక్!
రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజయం దిశగా పయనిస్తోంది. పాక్ స్పిన్నర్ల దాటికి పర్యాటక ఇంగ్లీష్ జట్టు విల్లవిల్లాడుతోంది. 77 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జో రూట్(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్నర్లు నోమన్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.షకీల్ సూపర్ సెంచరీ..అంతకుముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన సెంచరీతో షకీల్ గట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న షకీల్ 5 ఫోర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రెహాన్ ఆహ్మద్ 4 వికెట్లతో మెరవగా.. షోయబ్ బషీర్ మూడు, అట్కినసన్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్ చిత్తు -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?
పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్సీకి స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడింది. తమ సొంత గడ్డపై జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు నూతన సారథిని ఎంపిక చేయాలని పీసీబీ భావిస్తోంది.అయితే బాబర్ వారుసుడిగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పీసీబీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా పాక్ కెప్టెన్సీ ఎంపిక సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.అయితే పీసీబీ తమ జట్టు కెప్టెన్సీ రోల్ కోసం ముగ్గురు ఆటగాళ్లని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో మహ్మద్ రిజ్వాన్ పేరు లేదంట. జియో సూపర్ ఛానల్ రిపోర్ట్ ప్రకారం.. మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పాక్ క్రికెట్ బోర్డు తమ కెప్టెన్సీ కోసం సౌద్ షకీల్, ఫఖర్ జమాన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా అతడే?కాగా ఫఖర్ పేరును పరిగణలోకి తీసకున్నప్పటకి బోర్డు పెద్దలు మాత్రం షకీల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాక్ వైస్ కెప్టెన్‌గా షకీల్ బాధ్యతలు నిర్వర్తించాడు. పాక్ ఘోర పరాభావం పొందినప్పటకి షకీల్ మాత్రం తన ప్రదర్శనలతో ఆకట్టకున్నాడు. ఈ క్రమంలోనే తమ జట్టు వైట్ బాల్ కెప్టెన్సీని అప్పగించాలని పీసీబీ భావిస్తుందంట. మరోవైపు రిజ్వాన్ కెప్టెన్‌గా నియమించడాన్ని వర్క్‌లోడ్ కారణంగా ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వ్యతిరేకిస్తున్నట్లు వినికిడి. కాగా పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అనంతరం పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందు పాక్‌కు కొత్త కెప్టెన్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే? -
BAN vs PAK: పాకిస్తాన్ 448/5.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు. ఇక బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు. -
65 ఏళ్ల కిందటి రికార్డును సమం చేసిన పాక్ వైస్ కెప్టెన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ 65 ఏళ్ల కిందటి ఓ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సయీద్ అహ్మద్ సరసన నిలిచాడు. సయిద్ అహ్మద్, సౌద్ షకీల్ ఇద్దరూ కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. సయీద్ అహ్మద్ 1959లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించగా.. షకీల్ తాజాగా ఈ ఘనతను సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న టాప్-5 ఆటగాళ్ల జాబితాలో సౌద్, సయీద్ తర్వాత సాదిక్ మొహమ్మద్ (22), జావిద్ మియాందాద్ (23), తౌఫిక్ ఉమర్ (24) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్ తొలి సెషన్ సమయానికి 56 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సౌద్ షకీల్ 75, మొహమ్మద్ రిజ్వాన్ 65 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.సౌద్ షకీల్ 20 ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు..37, 76, 63, 94, 23, 53, 22, 55*, 125*, 32, 208*, 30, 57, 28, 24, 9, 24, 5, 2, 75* -
‘డచ్’ పని పట్టిన పాక్
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు, అసాధారణ బౌలింగ్ లేకపోయినా సమష్టి తత్వంతో ఆ జట్టు తొలి అడుగును విజయవంతంగా వేసింది. అసోసియేటెడ్ టీమ్ నెదర్లాండ్స్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తమ ఆటతో మ్యాచ్‌లో అక్కడక్కడ పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు నెదర్లాండ్స్ సులువుగానే తలవంచింది. ‘ఆరెంజ్’ జట్టు సంచలన విజయానికి ఈ ఆట సరిపోలేదు. సాక్షి, హైదరాబాద్: రెండు వామప్ మ్యాచ్‌లతో ఉప్పల్ స్టేడియంపై అంచనాకు వచ్చిన పాకిస్తాన్ ఈ వారం రోజుల అనుభవాన్ని అసలు మ్యాచ్‌లో సమర్థంగా వాడుకుంది. శుక్రవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ పోరులో పాక్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సౌద్ షకీల్ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 68; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బాస్ డి లీడ్ (68 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), విక్రమ్‌జిత్ సింగ్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. సెంచరీ భాగస్వామ్యం... కనీసం 300 పరుగులు నమోదు చేస్తాం. టాస్ సమయంలో పాక్ కెపె్టన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. అయితే దానికి చేరువగా వెళ్లడంలో పాక్ సఫలమైంది. ఆరంభ ఓవర్లలో ప్రదర్శన చూస్తే అది కష్టంగానే అనిపించినా రెండు కీలక భాగస్వామ్యాలు జట్టును ఆదుకున్నాయి. తొలి పవర్‌ప్లేలో 9.1 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫఖర్ (12), ఇమామ్ (15)లతో పాటు కెపె్టన్ బాబర్ ఆజమ్ (5) కూడా తొందరగా వెనుదిరిగారు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత చక్కటి షాట్లతో దూకుడు పెంచారు. ఈ క్రమంలో షకీల్ 32 బంతుల్లో, రిజ్వాన్ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి శతక భాగస్వామ్యం తర్వాత తక్కువ వ్యవధిలో పాక్ 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నవాజ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు), షాదాబ్ (34 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 70 బంతుల్లో 64 పరుగులు జత చేశారు. చివరి 2 వికెట్లకు కలిపి మరో 34 పరుగులు రావడం కూడా పాక్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. ఆ ఇద్దరు మినహా... ఛేదనలో నెదర్లాండ్స్‌కు విక్రమ్‌జిత్ చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. అయితే తక్కువ వ్యవధిలో జట్టు డౌడ్ (5), అకెర్మన్ (17) వికెట్లు కోల్పోయింది. దాంతో విక్రమ్‌జిత్‌కు డి లీడ్ జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 76 బంతుల్లో 70 పరుగులు జత చేసింది. అయితే 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విక్రమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తేజ నిడమనూరు (5) విఫలం కాగా, డచ్ ఆ వెంటనే మరో 2 చేజార్చుకుంది. అయితే డి లీడ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు టీమ్‌కు కాస్త ఆశలు ఉన్నాయి. 50 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. నవాజ్ చక్కటి బంతిని లీడ్ బౌల్డ్ కావడంతో ‘డచ్’ జట్టు ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ (సి అండ్ బి) వాన్ బీక్ 12; ఇమామ్ (సి) దత్ (బి) మీకెరెన్ 15; బాబర్ (సి) సాఖిబ్ (బి) అకెర్మన్ 5; రిజ్వాన్ (బి) డి లీడ్ 68; షకీల్ (సి) సాఖిబ్ (బి) దత్ 68; ఇఫ్తికార్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 9; నవాజ్ (రనౌట్) 39; షాదాబ్ ఖాన్ (బి) డి లీడ్ 32; హసన్ అలీ (ఎల్బీ) (బి) డి లీడ్ 0; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 13; రవూఫ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–15, 2–34, 3–38, 4–158, 5–182, 6–188, 7–252, 8–252, 9–267, 10–286. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–48–1, వాన్ బీక్ 6–0–30–1, అకెర్మన్ 8–1–39–2, మీకెరెన్ 6–0–40–1, డి లీడ్ 9–0–62–4, మెర్వ్ 6–0– 36– 0, విక్ర మ్జిత్ 2–0–16–0, సాఖిబ్ 2–0– 15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (సి) ఫఖర్ (బి) షాదాబ్ 52; మ్యాక్స్ డౌడ్ (సి) షాహిన్ (బి) హసన్ 5; అకెర్మన్ (బి) ఇఫ్తికార్ 17; డి లీడ్ (బి) నవాజ్ 67; తేజ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 5; ఎడ్వర్డ్స్ (ఎల్బీ) (బి) రవూఫ్ 0; సాఖిబ్ (ఎల్బీ) (బి) షాహిన్ 10; వాన్‌డర్ మెర్వ్ (రనౌట్) 4; వాన్ బీక్ (నాటౌట్) 28; దత్ (బి) హసన్ 1; మీకెరెన్ (బి) రవూఫ్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–28, 2–50, 3–120, 4–133, 5–133, 6–158, 7–164, 8–176, 9–184, 10–205. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 7–0–37–1, హసన్ అలీ 7–1–33–2, రవూఫ్ 9–0–43–3, ఇఫ్తికార్ అహ్మద్ 3–0–16–1, మొహమ్మద్ నవాజ్ 7–0– 31–1, షాదాబ్ ఖాన్ 8–0–45–1. ప్రపంచకప్‌లో నేడు అఫ్గానిస్తాన్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..!
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్‌లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడుతోంది. అర్ధ శతకాలతో ఆదుకున్నారు అయితే, పసికూనే కదా అని డచ్ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. హైదరాబాద్‌లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ అద్భుత ఆట తీరుతో పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంతకు ముందు.. 1983లో నాటింగ్‌హాంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్ మ్యాచ్‌లో షాహిద్ మహబూబ్తో కలిసి ఇమ్రాన్ ఖాన్ 144.. 2019లో బర్మింగ్‌హాంలో బాబర్ ఆజం- హ్యారిస్ సొహైల్ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక వరల్డ్‌కప్ డెబ్యుటెంట్స్ ఒకే మ్యాచ్‌లో ఫిఫ్టీ ప్లస్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో మజీద్ ఖాన్(65), ఆసిఫ్ ఇక్బాల్(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్హక్(65), ఉమర్ అక్మల్(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(65), సౌద్ షకీల్(68)-(2023లో హైదరాబాద్‌లో) నిలిచారు. చదవండి: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్ -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు'
పాకిస్తాన్ యువ ఆటగాడు సౌద్ షకీల్‌పై ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌద్ షకీల్ భవిష్యత్తులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్ధాయికి చేరుకుంటాడని అక్మల్ కొనియాడాడు. సౌద్ షకీల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో షకీల్ అదరగొడుతున్నాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో షకీల్ సంచలన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన షకీల్.. 87.5 సగటుతో 875 పరుగులు చేశాడు. అదేవిధంగా శ్రీలంకపై గడ్డపై టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్‌గా రికార్డెలకెక్కాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్‌తో అక్మల్ మాట్లాడుతూ.. "సౌథ్ షకీల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దగ్గర నుంచి చూశాను. ప్రపంచ క్రికెట్లో షకీల్ అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడు. అతడు కచ్చితంగా విరాట్ కోహ్లి, బాబర్ ఆజం అంతటి వాడవుతాడు. వచ్చే మూడు నాలుగేళ్లలో వారి స్ధాయికి షకీల్ చేరుకుంటాడని ఆశిస్తున్నా. క్లిష్టమైన పరిస్ధితుల్లో జట్టు ఉన్నప్పుడు అతడు ఆడిన విధానం అద్భుతం. టెస్టుల్లో ఆడటం చాలా కష్టం. చిన్న వయస్సులోనే షకీల్ ఈ విధంగా ఆడటం.. పాకిస్తాన్‌కు శుభసూచికమని" చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు
పాక్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఏడు టెస్ట్‌ల్లో కనీసం ఓ హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 27 ఏళ్ల షకీల్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 87.5 సగటున ఓ అజేయమైన డబుల్ సెంచరీ, అజేయమైన సెంచరీ, 5 హాఫ్ సెంచరీల (ఓ అజేయమైన హాఫ్ సెంచరీ) సాయంతో 875 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో షకీల్ వరుసగా (37 & 76), (63 & 94), (23 & 53), (22 & 55 నాటౌట్), (125 నాటౌట్ & 32), (208 నాటౌట్ & 30), 57 స్కోర్లు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు.. తన తొలి 7 టెస్ట్‌ల్లో ఈ ఘనత సాధించింది లేదు. కాగా, శ్రీలంక పర్యటనలో తొలి టెస్ట్ మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న పాక్.. లంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ పట్టు బిగించింది. నాలుగో రోజు ఆటలో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 576/5 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టుకు 410 తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అబ్దుల్లా షఫీక్ (201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్ (132) అజేయ శతకంతో మెరిశాడు. షాన్ మసూద్ (51), సౌద్ షకీల్ (57), మహ్మద్ రిజ్వాన్ (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం 410 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నిషాన్ మధుష్క (33), దిముత్ కరుణరత్నే (41) ఔట్ కాగా.. కుశాల్ మెండిస్ (12), ఏంజెలో మాథ్యూస్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండ్రోజుల ఆట (27, 28 తేదీలు) మిగిలి ఉంది. పాక్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. -
అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్, కోహ్లిలతో పాటు!
Pakistan And India stars reach new career highs after latest rankings update: పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు సాధించాడు. తద్వారా టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి టాప్-15లో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంకతో తమ తొలి సిరీస్ ఆడుతోంది. లంకతో మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ ఈ క్రమంలో.. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో సౌద్ షకీల్ అద్భుత అజేయ ద్విశతకం(208)తో మెరిశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి దూసుకువచ్చాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ర్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. రోహిత్ పది, కోహ్లి 14 స్థానాల్లో కొనసాగుతుండగా.. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక స్థానం కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు. నంబర్ 1గా అతడే.. అశ్విన్ సైతం అగ్రస్థానంలోనే.. ఇక టాప్-10 ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. నంబర్ 1గా కేన్ విలియమ్సన్ కొనసాగుతుండగా.. లబుషేన్, జో రూట్, ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. మరోవైపు.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హవా కొనసాగుతోంది. విండీస్ టూర్లో 14 వికెట్లతో అదరగొట్టిన అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా విండీస్‌తో రెండో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
శ్రీలంకపై పాక్ విజయం.. అంత ఓవరాక్షన్ అవసరం లేదు.. సిగ్గు పడాలి..!
శ్రీలంకతో ఇవాళ (జులై 20) ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్ హక్ (50 నాటౌట్).. కెప్టెన్ బాబర్ ఆజమ్ (24), సౌద్ షకీల్ (30)ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో పాక్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడి, తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన సౌద్ షకీల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం తర్వాత పాక్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ జట్టు ఆటగాళ్లు ఏదో సాధించామన్న రేంజ్లో ఓవరాక్షన్ చేశారు. ఏదో వరల్డ్‌కప్ గెలిచేసినట్లు ఫీలైపోయారు. వాస్తవానికి గెలుపు ఎవరిపై అయినా, ఎలాంటి పరిస్థితుల్లో సాధించినా, ఎవరు సాధించినా అంగీకరించాల్సిందే. అయితే, ఇక్కడ పాక్ సాధించిన గెలుపుకు అంత ఓవరాక్షన్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. July 20th, 2022 - 146th Test win for Pakistan July 20th, 2023 - 147th Test win for Pakistan The wait is over, Pakistan won a Test match after a gap of 365 days. pic.twitter.com/RrDQ9lPjWt — Johns. (@CricCrazyJohns) July 20, 2023 ఎందుకంటే, ఆ జట్టు 365 రోజుల్లో సాధించిన ఏకైక విజయం ఇది. ఈ మధ్యలో ఆ జట్టు పదుల సంఖ్యలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. సరిగా ఇదే రోజున (జులై 20) 2022లో ఆ జట్టు చివరిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచింది. ఈ విషయం తెలిసే కొందరు నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏడాదిలో ఒక్క విజయం సాధించినందుకు ఇంత సంబరం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా తమ ప్రదర్శనను చూసి సిగ్గు పడాల్సింది పోయి, ఏదో సాధించామన్నట్లు ఓవరాక్షన్ ఎందుకని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. ఏడాది తర్వాత సాధించిన విజయం కాబట్టి ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సౌద్ షకీల్ పుణ్యమా అని పాక్‌కు సరిగ్గా ఏడాది తర్వాత తొలి విజయం లభించింది. -
డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఈ పాక్ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు
పాకిస్తాన్ యువ బ్యాటర్ సౌద్ షకీల్ ప్రపంచ క్రికెట్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (208) బాదిన షకీల్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కనీసం 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక యావరేజ్ (99.94) రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉండగా.. షకీల్, బ్రాడ్‌మన్ వెనువెంటనే ఉన్నాడు. కెరీర్లో 11 ఇన్నింగ్స్‌ల తర్వాత షకీల్ సగటు 98.50గా ఉంది. డబుల్ సెంచరీకి ముందు అతని స్కోర్లు 32, 125 నాటౌట్, 55 నాటౌట్, 22, 53, 23, 94, 63, 76, 37గా ఉన్నాయి. 11 ఇన్నింగ్స్‌ల్లో షకీల్.. 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీ సాయంతో 788 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ అర్ధసెంచరీతో (64) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, కెరీర్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీల సాయంతో 98.50 సగటున 788 పరుగులు చేసిన షకీల్‌పై సోషల్‌మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాక్ అభిమానులు 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న డెవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్‌లతో పోలుస్తున్నారు.