పాకిస్తాన్ యువ ఆటగాడు సౌద్ షకీల్‌పై ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌద్ షకీల్ భవిష్యత్తులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్ధాయికి చేరుకుంటాడని అక్మల్ కొనియాడాడు. సౌద్ షకీల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో షకీల్ అదరగొడుతున్నాడు.
గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో షకీల్ సంచలన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన షకీల్.. 87.5 సగటుతో 875 పరుగులు చేశాడు. అదేవిధంగా శ్రీలంకపై గడ్డపై టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్‌గా రికార్డెలకెక్కాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్‌తో అక్మల్ మాట్లాడుతూ.. "సౌథ్ షకీల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉంది.
అతడిని పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దగ్గర నుంచి చూశాను. ప్రపంచ క్రికెట్‌లో షకీల్ అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడు. అతడు కచ్చితంగా విరాట్ కోహ్లి, బాబర్ ఆజం అంతటి వాడవుతాడు. వచ్చే మూడు నాలుగేళ్లలో వారి స్ధాయికి షకీల్ చేరుకుంటాడని ఆశిస్తున్నా. క్లిష్టమైన పరిస్ధితుల్లో జట్టు ఉన్నప్పుడు అతడు ఆడిన విధానం అద్భుతం. టెస్టుల్లో ఆడటం చాలా కష్టం. చిన్న వయస్సులోనే షకీల్ ఈ విధంగా ఆడటం.. పాకిస్తాన్‌కు శుభసూచికమని" చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment