Kamran Akmal
-
'వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి'.. పాక్‌పై ఆక్మల్ ఫైర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికలపడింది.బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాక్ విఫలమైంది. ఈ క్రమంలో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం గుప్పించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదని ఆక్మల్ జోస్యం చెప్పాడు."ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు ఆడే ఆర్హత లేదు. ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో పాక్ జట్టు పాల్గోవాలి. కనీసం వారిపైనా విజయం సాధిస్తే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆర్హత ఉందని భావించవచ్చు. గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో న్యూజిలాండ్‌ను చూసి నేర్చుకోవాలి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. కివీస్ బ్యాటర్లు సెటిల్ అయ్యాక మళ్లీ ఎదురుదాడికి దిగారు. పరిణితి చెందిన జట్టు చేసే పని అదే. కివీస్ లాంటి టాప్ క్లాస్‌కు జట్టుకు ఎల్లప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. రచిన్ రవీంద్ర గాయపడగా.. అతడి స్ధానంలో వచ్చిన విల్ యంగ్ సెంచరీతో మెరిశాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ భావిస్తోంది. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్ -
చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి హర్షిత్ రాణా వస్తాడు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ అరంగేట్రంలోనే అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy)నూ హర్షిత్ ఆడవచ్చని అంచనా వేశాడు.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షిత్ రాణా.. గతేడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నాడు కోల్‌కతా మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హర్షిత్‌కు జాతీయజట్టులో త్వరగానే అవకాశం వచ్చింది.ఆసీస్‌లో అరంగేట్రంఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పెర్త్ టెస్టులో నాలుగు వికెట్లతో మెరిశాడు. అయితే, అంతకంటే ముందే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు.కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చికానీ అనూహ్యంగా ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టాడు. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి మూడు వికెట్లు కూల్చాడు. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్(9)తో పాటు జాకొబ్ బెతల్(6) రూపంలో కీలక వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్ జేమీ ఓవర్టన్(19)ను కూడా అవుట్ చేశాడు.‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ వివాదం సంగతి పక్కనపెడితే... కీలక సమయంలో కీలక వికెట్లు తీయడం ద్వారా టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన హర్షిత్ రాణాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు‘‘హర్షిత్ రాణా బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. ఒకవేళ బుమ్రా గనుక ఫిట్‌గా లేకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయం. పేస్‌లో వైవిధ్యం చూపడంతో పాటు.. మూడు వికెట్లు తీసిన తీరు ఆకట్టుకుంది’’ అని కమ్రన్ అక్మల్ పేర్కొన్నాడు.అదే విధంగా స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి మాట్లాడుతూ.. ‘‘రవి బిష్ణోయి, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నారు. వీరిద్దరు గనుక చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే టీమిండియా స్పిన్ విభాగం మరింత పటిష్టంగా ఉండేది’’ అని కమ్రన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.మరోవైపు.. పాకిస్తాన్ మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ సైతం రవి బిష్ణోయి ప్రదర్శనను ప్రశంసించాడు. వికెట్లు తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేస్తున్న తీరు ఎంతో బాగుందని కొనియాడాడు. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని నాలుగో టీ20లో రాణించాడని పేర్కొన్నాడు.బుమ్రాకు వెన్నునొప్పికాగా టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్డే సిరీస్‌లో అతడికి ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేశారు.అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం బుమ్రాకు ఫిట్నెస్ ఆధారంగా చోటిచ్చారు. ఒకవేళ టోర్నీ నాటికి బుమ్రా పూర్తి ఫిట్‌గా లేకుంటే.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌కు చాన్స్ ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, కమ్రన్ అక్మల్ మాత్రం హర్షిత్ రాణా పేరును తెరమీదకు తెచ్చాడు.టీ20 సిరీస్ మనదేఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. కోల్‌కతా, చెన్నైలలో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో మాత్రం విఫలమైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో టీ20లో జయకేతనం ఎగురవేసి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలిచింది. ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరుగుతుంది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
మా దేశానికి వస్తే తప్పేంటి?: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్లో పర్యటించేందుకు భారత జట్టు ఎందుకు వెనకడుగువేస్తోందో తనకు అర్థం కావడం లేదంటున్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్. టీమిండియా కారణంగా ఇప్పటికే ఆసియా కప్ నిర్వహణ విషయంలో తమకు ఇబ్బంది కలిగిందని.. చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలా చేయడం సరికాదని వాపోయాడు. ఇరు దేశాల ప్రభుత్వ పెద్దలు చర్చించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశాడు.భద్రతా కారణాల వల్ల కాగా టీమిండియా 2008లో చివరగా పాకిస్తాన్లో పర్యటించింది. ఇక 2013 తర్వాత దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఐసీసీ, ఆసియా కప్ ఈవెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక గతేడాది ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులకు పాక్ దక్కించుకోగా.. భద్రతా కారణాల వల్ల తమ జట్టును అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించింది.ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అప్పటి అధ్యక్షుడు జై షా చొరవతో టీమిండియా మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఫైనల్లో లంకను ఓడించి రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య దేశంగా పాకిస్తాన్ ఎంపికైంది. అయితే, ఈసారి కూడా భారత జట్టు విషయంలో తటస్థ వేదిక గురించి చర్చ మొదలైంది.జై షా ఐసీసీ బాస్ కావడంతోబీసీసీఐ తమ జట్టును పాక్‌కు పంపేందుకు ససేమిరా అనగా.. పాకిస్తాన్ బోర్డు మాత్రం తాము ఈసారి వెనక్కితగ్గబోమని ఐసీసీకి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో పాక్ బోర్డు సందిగ్దంలో పడింది. మరోవైపు.. రషీద్ లతీఫ్ వంటి మాజీ క్రికెటర్లు మాత్రం జై షా వల్లే టీమిండియా తమ దేశానికి రాబోతోందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఆస్ట్రేలియా వంటి జట్టే మా దేశ పర్యటనకు వచ్చినపుడు టీమిండియా ఎందుకు రావడం లేదు?.. ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది.మా దేశానికి వస్తే తప్పేంటి?ఇందుకోసం ఇరు దేశాల ప్రభుత్వాల పెద్దలు కూర్చుని చర్చించాలి. అలా అయితే క్రికెట్‌కు ఎంతో మేలు చేకూరుతుంది. తొలుత ఆసియా కప్ నిర్వహణను పాక్ నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనే అలాగే వ్యవహరిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు? చాలా ఏళ్ల తర్వాత మా దేశంలో ఐసీసీ టోర్నీ జరుగబోతోంది. కానీ ఇలాంటి ఆటంకాలు వస్తే మేము ఏం చేయాలి? అయినా.. ఇండియా వెళ్లేందుకు మా ఆటగాళ్లకు మా ప్రభుత్వం అనుమతినిస్తున్నపుడు.. భారత ప్రభుత్వం ఎందుకు టీమిండియాను ఇక్కడికి పంపదు?.. దయచేసి రాజకీయాలకు అతీతంగా ఆటను చూడండి’’ అని కమ్రాన్ అక్మల్ విజ్ఞప్తి చేశాడు. -
'బాబర్, అఫ్రిది కాదు.. పాక్‌లో ఆ భారత క్రికెటర్‌కే ఫ్యాన్స్ ఎక్కువ'
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లి చాలా మందికి రోల్ మోడల్ అని ఆక్మల్ కొనియాడాడు. అదేవిధంగా విరాట్ పాకిస్తాన్లో బాగా పాపులర్ అని అతడు చెప్పుకొచ్చాడు."విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ తాము రిటైరయ్యే ముందు కనీసం ఒక్కసారైనా పాకిస్తాన్లో పర్యటించాలి. ఈ ఇద్దరూ వరల్డ్ క్రికెట్లో తమకంటూ ఒక క్రేజును సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడేందుకు వెళ్తూ ఉంటారు. వారిద్దరిని ఇష్టపడని అభిమాని అంటూ ఉండరు. బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో ఈ లెజండరీ క్రికెటర్లకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పాకిస్తాన్లో కూడా వీరిద్దరూ బాగా పాపులర్. ఏదో ఒక చోట కాదు దేశం మొత్తం రోకోలను ఆరాధిస్తారు. ఇక ప్రపంచంలోని చాలా మంది యువ క్రికెటర్లకు విరాట్ ఒక రోల్ మోడల్.కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్ పాకిస్తాన్లో పర్యటించాలని సగటు అభిమాని కోరుకుంటున్నాడు. . విరాట్ తన అండర్-19 రోజులలో పాకిస్తాన్‌కు వెళ్లాడు. కానీ అప్పుడు అతడు అభిమానుల నుంచి పెద్దగా ఆదరణ పొందలేకపోయాడు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కోహ్లి ఇప్పుడు పాకిస్తాన్‌కు వెళ్తే అతడికి అడుగడుగున అభిమానులు నీరాజనం పలుకుతారు. పాక్‌లో విరాట్‌కు ఉన్న ఫాలోయింగ్ మరో ఏ క్రికెటర్‌కు లేదు. అతడికి వీరాభిమానులు ఉన్నారు. విరాట్, రోహిత్‌లతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం మా దేశంలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్తానీ ఫ్యాన్స్ విరాట్, రోహిత్, బుమ్రాలను వారి స్వంత క్రికెట్ జట్టు ఆటగాళ్ల కంటే ఎక్కువగా ప్రేమిస్తారని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆక్మల్ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ పాకిస్తాన్లో పర్యటించినప్పటికి.. కోహ్లి, బుమ్రా మాత్రం సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు పాక్ గడ్డపై అడుగుపెట్టలేదు. -
ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: కమ్రాన్ ఆక్మల్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.అయితే ఈ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాళీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పీసీబీపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం కురిపించాడు. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువుపోతుందని ఆక్మల్ మండిపడ్డాడు."పాక్-బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కరాచీలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని మీకు ముందే తెలుసు కదా? అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు షెడ్యూల్ చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగడం మన దేశానికి అవమానకరం. మనకు కేవలం రెండు, మూడు స్టేడియంలు మాత్రమే లేవు. ఫైసలాబాద్ స్టేడియం కూడా ఉంది. అక్కడ కూడా మ్యాచ్‌ను నిర్వహించవచ్చు. అదొక టాప్ క్లాస్ స్టేడియం. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు అక్కడ జరిగాయి. అదేవిధంగా ముల్తాన్‌లో కూడా స్టేడియం ఉంది.ముల్తాన్ స్టేడియం చాలా బాగుంటుంది. అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ రెండు వేదికలో ఏదో ఒక స్టేడియంలో సెకెండ్ టెస్టును నిర్వహించాల్సింది. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను నిర్వహించాలన్నది సరైన నిర్ణయం కాదు. ఇది నిజంగా మనకు సిగ్గు చేటు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరును తీసుకువస్తుందని" తన యూట్యాబ్ ఛానల్లో పీసీబీపై అక్మల్ ఫైరయ్యాడు. -
హెడ్‌కోచ్‌గా గంభీర్.. బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బెటర్!
‘‘గంభీర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. అతడు ఏ జట్టుతో చేరితే.. ఆ జట్టు విజయాలు సాధిస్తుంది. అసలు టీమిండియాకు విదేశీ కోచ్‌ల అవసరమే లేదు.ఇండియాలోనే ఎంతో మంది ప్రతిభావంతులైన కోచ్‌లు ఉన్నారు. ద్రవిడ్ తర్వాత.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ కంటే అత్యుత్తమ ఆప్షన్ ఇంకొకటి ఉంటుందనుకోను.అతడొక అద్భుతమైన ఆటగాడు. గొప్ప కోచ్ కూడా కాగలడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్‌గా అతడే సరైనోడు. గంభీర్ తొలుత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉన్నాడు.అతడి మార్గ నిర్దేశనంలో లక్నో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. తర్వాత కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లాడు. ఆ జట్టు ఏకంగా చాంపియన్‌గా నిలిచింది.గంభీర్‌ది అత్యద్భుతమైన క్రికెటింగ్ మైండ్. ప్రత్యర్థి జట్టును కచ్చితంగా అంచనా వేసి అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట. తనతో కలిసి ఆడిన అనుభవం నాకుంది.కలిసే భోజనం చేసేవాళ్లం. ఆట గురించి చర్చించుకునే వాళ్లం. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఉంది. టచ్‌లోనే ఉంటాం’’ అని పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రమే సరైన ఆప్షన్ అని నొక్కి వక్కాణించాడు. అతడి మార్గదర్శనంలో టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.బౌలింగ్ కోచ్‌గా వారిలో ఒకరు బెటర్ఇక గంభీర్ ప్రధాన కోచ్‌గా ఉంటే.. ఆశిష్ నెహ్రా లేదంటే జహీర్ ఖాన్లలో ఒకరిని బీసీసీఐ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంచుకోవాలని సూచించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వారసుడిగా గౌతం గంభీర్ ఎంపిక దాదాపుగా ఖాయమైపోయింది.మెంటార్‌గా మాత్రమేఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు మెంటార్‌గా పనిచేశాడు గౌతీ. అయితే, కోచ్‌గా మాత్రం అతడికి అనుభవం లేదు. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో విజయ వంతంగా ముందుకు సాగుతున్న టీమిండియా గురువారం సూపర్-8 దశలో తొలి మ్యాచ్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో బార్బడోస్ వేదికగా తలపడనుంది. -
కోహ్లి కంటే మా తమ్ముడు ఎంతో బెటర్: పాక్ మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుస్తున్న సంగతి తెలిసింది. ఐపీఎల్-2024 టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచిన కింగ్ కోహ్లి.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటర్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి సాధించిన రికార్డులకు మా తమ్ముడు ఉమర్ అక్మల్ దగ్గరకలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి కంటే మెరుగైన స్ట్రైక్ రేట్, అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్ కలిగి ఉన్నాడు.కానీ కోహ్లిలా మాకు పీఆర్ ఎజెన్సీలు లేవు. అందకే మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోటు చేసుకోలేము. పొట్టి ప్రపంచకప్‌లో మా తమ్ముడు కలిగి ఉన్న గణాంకాలు ప్రస్తుత 15 మంది సభ్యుల గల భారత జట్టులో ఎవరికి లేవు. ప్రస్తుత టోర్నీల్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు. మెనెజ్‌మెంట్ విరాట్‌ను విమర్శించిన ఆశ్చర్యపోనక్కర్లలేదని ఏఆర్వై న్యూస్ డిబీట్లో కమ్రాన్ అక్మల్ విషం చిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరలవుతోంది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ అక్మల్‌కు కౌంటిరిస్తున్నారు. కోహ్లితో ఉమ్రాన్‌కు పోలికా, అందుకే మీ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు. -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు'
పాకిస్తాన్ యువ ఆటగాడు సౌద్ షకీల్‌పై ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌద్ షకీల్ భవిష్యత్తులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్ధాయికి చేరుకుంటాడని అక్మల్ కొనియాడాడు. సౌద్ షకీల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో షకీల్ అదరగొడుతున్నాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో షకీల్ సంచలన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన షకీల్.. 87.5 సగటుతో 875 పరుగులు చేశాడు. అదేవిధంగా శ్రీలంకపై గడ్డపై టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్‌గా రికార్డెలకెక్కాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్‌తో అక్మల్ మాట్లాడుతూ.. "సౌథ్ షకీల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉంది. అతడిని పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో దగ్గర నుంచి చూశాను. ప్రపంచ క్రికెట్లో షకీల్ అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడు. అతడు కచ్చితంగా విరాట్ కోహ్లి, బాబర్ ఆజం అంతటి వాడవుతాడు. వచ్చే మూడు నాలుగేళ్లలో వారి స్ధాయికి షకీల్ చేరుకుంటాడని ఆశిస్తున్నా. క్లిష్టమైన పరిస్ధితుల్లో జట్టు ఉన్నప్పుడు అతడు ఆడిన విధానం అద్భుతం. టెస్టుల్లో ఆడటం చాలా కష్టం. చిన్న వయస్సులోనే షకీల్ ఈ విధంగా ఆడటం.. పాకిస్తాన్‌కు శుభసూచికమని" చెప్పుకొచ్చాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ -
ఇలాంటి చెత్త పనులు చేయొద్దు: పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
ICC ODI WOrld Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. అర్థంపర్ధంలేని అభ్యర్థనలతో పరువు తీయొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దయచేసి.. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే పనులు చేయకండని బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మారుస్తారా ప్లీజ్! అయితే, షెడ్యూల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో చెన్నైలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడాల్సిన మ్యాచ్‌లను మార్చాల్సిందిగా పీసీబీ ఐసీసీని కోరినట్లు సమాచారం. పిచ్‌ల స్వభావం రిత్యా అఫ్గన్‌తో మ్యాచ్ బెంగళూరులో, ఆసీస్‌తో మ్యాచ్ చెన్నైలో ఆడేలా వేదికలు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ పీసీబీ తీరును ఎండగట్టాడు. పాక్ టీవీతో మాట్లాడుతూ ‘‘వాతావరణ పరిస్థితులు, వేదికలు జట్ల విజయావకాశాలను ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో వీటి గురించి ప్రస్తావన అనవసరం. చెత్త రిక్వెస్టులు వద్దు భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడిస్తూ పోతోంది. అది వాళ్ల సత్తా. మనమేమో ఆసీస్‌తో అక్కడే ఆడతాం.. అఫ్గనిస్తాన్‌తో ఇక్కడే ఆడతామంటూ కుంటిసాకులు వెదుక్కోవడం ఎందుకు? మన దృష్టి మొత్తం కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి. బోర్డు సభ్యులకు ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి చెత్త ప్రమాణాలతో కూడిన అభ్యర్థనలు చేయకండి. అంతర్జాతీయ క్రికెట్ విస్తృతి మరింత పెరిగింది. ఆటగాళ్లు తమ విజయాల గురించి సగర్వంగా చాటిచెప్పుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మాత్రం మేము ఇక్కడైతేనే ఆడి గెలవగలం అంటూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. ఇలాంటి వాటికి బోర్డు సభ్యులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేశ క్రికెట్ స్థాయిని పెంచాలే గానీ తగ్గించేలా వ్యవహరించకూడదు’’ అని అక్మల్ పీసీబీని తూర్పారబట్టాడు. వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: ►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 ►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ ►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా ►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ ►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా ►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ ►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ ►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్. చదవండి: భార్యతో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్! మరీ.. మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్‌లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్‌లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన అక్మల్‌కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్‌లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్‌లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్‌లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్‌కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్‌కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
అలా సెలెక్టర్ అయ్యాడో లేదో రిటైర్మెంట్ ఇచ్చాడు
పాకిస్తాన్ వికెట్ కీపర్ క్రమాన్ అక్మల్ అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ జాతీయ సెలెక్షన్ కమిటీకి ఎంపికైన కమ్రాన్ అక్మల్ తాజాగా రిటైర్మెంట్ ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది. ఇక పీఎస్ఎల్లో తాను ప్రాతినిధ్యం వహించిన పెషావర్ జాల్మీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక కమ్రాన్ అక్మల్ 2002లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 15 ఏళ్ల పాటు పాక్ జట్టు తరపున ఆడిన కమ్రాన్ ఫ్రంట్‌లైన్ వికెట్ కీపర్‌గా పనిచేశాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ తరపున 157 వన్డేల్లో 3236 పరుగులు, 53 టెస్టుల్లో 2648 పరుగులు, 58 టి20ల్లో 987 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో ఐదు సెంచరీలు, టెస్టుల్లో ఆరు సెంచరీలు బాదాడు. 2009లో టి20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో కమ్రాన్ అక్మల్ సభ్యుడిగా ఉన్నాడు. 2010లో పాకిస్తాన్ టెస్టు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. కొన్ని రోజుల్లోనే స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఆరోపణలు రావడంతో వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. అలా రెండేళ్ల పాటు ఆటకు దూరమైన కమ్రాన్ అక్మల్ తిరిగి 2012లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు దూసుకురావడంతో కమ్రాన్‌కు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. 2017లో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్ కమ్రాన్ అక్మల్‌కు చివరిది. ఇక ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో కమ్రాన్ అక్మల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో 2016 నుంచి 2022 వరకు పెషావర్ జాల్మీ తరపున ప్రాతినిధ్యం వహించిన కమ్రాన్ 2017 సీజన్లో లీగ్‌లో తొలి సెంచరీ అందుకున్నాడు. ఇక ఆ సీజన్లో కమ్రాన్ అక్మల్ నుంచి మంచి ప్రదర్శన రాగా.. జట్టు కూడా ఫైనల్ వరకు వెళ్లగలిగింది. చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు -
క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు ఇండియాలో లేరు.. అందుకే ఇలా: పాక్ ప్లేయర్
Team India- BCCI: టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవనంత మాత్రాన తక్కువ చేయాల్సిన పనిలేదని.. ఇప్పటికీ భారత్ గొప్ప జట్టేనని వ్యాఖ్యానించాడు. దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలే టీమిండియా విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రధాన కారణమని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! మిగతా బోర్డులకు.. బీసీసీఐకి ఉన్న తేడా అదేనంటూ పీసీబీ అధికారుల తీరును ఉద్దేశించి విమర్శలు చేశాడు. పాక్‌టీవీతో మాట్లాడిన కమ్రాన్ అక్మల్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదంటూ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఐసీసీ టైటిల్ గెలవడమే ప్రధానం అనుకుంటే.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి జట్లను ఇప్పటికే నిషేధించాల్సింది. ప్రతిసారి మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలవాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఇండియా ఇప్పటికీ గొప్ప జట్టే. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్లు వివిధ ఫార్మాట్లలో సత్తా చాటుతూనే ఉన్నారు. భ్రష్టు పట్టించేవాళ్లు లేరు నిజానికి ఇండియాలో దేశవాళీ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే వాళ్లు ఎవరూ లేరు. అయితే, గత 7-8 ఏళ్లుగా పాకిస్తాన్లో మాత్రం కొంతమంది పనిగట్టుకుని డొమెస్టిక్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పనితీరుపై ఘాటు విమర్శలు చేశాడు. కాగా 1983, 2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 ప్రపంచకప్, 2002, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. చదవండి: Ind Vs NZ: రాంచిలో మ్యాచ్ అంటే అంతే! టాస్ గెలిస్తే... ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై -
Ind Vs Pak: ‘అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’
T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్-2023 నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ తాజాగా స్పందించారు. ఏ ఐసీసీ ఈవెంట్లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా ఏఆర్వై న్యూస్‌తో కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ ఆసియా కప్-2023 గనుక పాకిస్తాన్లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్ ఆడదు. ఆసియా కప్ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌లో పాక్ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఒప్పుకొనే ప్రసక్తే లేదు ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్- పాక్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే.. Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్: పాక్ మాజీ క్రికెటర్
India Vs South Africa T20 Series 2022: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వెస్టిండీస్ టూర్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీకి ఎంపికైన ఈ యువ పేసర్.. మెగా టోర్నీలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో క్యాచ్ నేలపాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న అర్ష్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ప్రొటిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన అర్ష్‌దీప్ తిరువనంతపురం వేదికగా జరిగిన టీ20లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బంతిని స్వింగ్ చేస్తూ.. సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా ప్రొటిస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అర్ష్‌దీప్ సింగ్ మరో జహీర్ ఖాన్ ఇక అదే జోష్‌లో మిగిలి ఉన్న మరో రెండు మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అర్ష్‌దీప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన బౌలర్. నా అభిప్రాయం ప్రకారం టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు. అర్ష్‌దీప్ సింగ్ పేస్‌లో వైవిధ్యం.. బంతిని స్వింగ్ చేయగల నైపుణ్యం అతడిని ప్రత్యేకంగా నిలిపాయి. మానసికంగా కూడా తను ఎంతో బలవంతుడు. తన శక్తిసామర్థ్యాలేమిటో అతడికి బాగా తెలుసు. వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా పూర్తి అవగాహన ఉంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో రీలీ రొసోవ్, డికాక్‌ను అవుట్ చేసిన తీరు బాగుంది. నువ్వు సూపర్ అయితే, డేవిడ్ మిల్లర్ వికెట్ మాత్రం అద్భుతం. ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు. ఇంత చిన్న వయసులోనే అర్ష్‌దీప్ రాణిస్తున్న తీరు అమోఘం. టీమిండియాకు జహీర్ ఖాన్ లాంటి లెఫ్టార్మ్ పేసర్ సేవలు అవసరమైన తరుణంలో అతడు వచ్చాడు’’ అంటూ 23 ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్‌పై కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో సైతం అర్ష్‌దీప్‌నకు చోటు దక్కిన విషయం తెలిసిందే. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ పేసర్... 17 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Pak Vs Eng 6th T20: పాక్ బౌలర్లకు చుక్కలు.. 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో సాల్ట్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో పాక్ చిత్తు National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!
ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ కోసం 1020 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అదే విధంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కింగ్ కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం రన్మిషన్ను ప్రశంసలలో ముంచెత్తారు. ట్విటర్ వేదికగా హాసన్ అలీ, మహ్మద్ అమీర్, కమ్రాన్ ఆక్మల్ వంటి పాక్ ఆటగాళ్లు కోహ్లిని అభినందిచారు. "ఫామ్ తాత్కాలికమైనది.. క్లాస్ అనేది ఎప్పటికీ పోదు. కోహ్లి ఆటను ఎల్లప్పుడూ చూడడానికి ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కోహ్లి నిజమైన కింగ్" అంటూ ట్విటర్ వేదికగా ఆక్మల్ పేర్కొన్నాడు. మరో వైపు హాసన్ అలీ "ది గ్రేట్ కోహ్లి ఈజ్ బ్యాక్" అని ట్వీట్ చేశాడు. కాగా ఈ మెగా ఈవెంట్ గ్రూపు దశలో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. సూపర్-4లో మాత్రం దాయాది జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక సూపర్-4 దశలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన భారత్ ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
SL Vs PAK: ఒకటీ అరా గెలిచి.. ఏదో పొడిచేసినట్లు విర్రవీగడం!
Sri Lanka Vs Pakistan Test Series: శ్రీలంక చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ విమర్శలు చేశాడు. మొదటి టెస్టులో గెలుపుతో సంతృప్తి పడ్డారని.. అందుకే రెండో మ్యాచ్‌లో కనీస పోరాటం కూడా చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డాడు. ఒకటీ అర విజయాలతో ఏదో పొడిచేశామని విర్రవీగడం అలవాటులా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా శ్రీలంక టూర్‌కు వెళ్లింది పాకిస్తాన్. గాలే వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పర్యాటక పాక్ తొలి టస్టులో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, రెండో మ్యాచ్‌లో ఆతిథ్య లంక ధీటుగా బదులిచ్చింది. ఏకంగా 246 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ పాక్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ప్రభాత్ మొత్తంగా ఎనిమిది వికెట్లు తీయగా.. రమేశ్ 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కమ్రాన్ అక్మల్ ఈ నేపథ్యంలో పాక్ ఓటమి పాలైంది. సిరీస్ 1-1తో సమమైంది. అంతేగాక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానం కోల్పోయింది. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఒక్క టెస్టు మ్యాచ్‌లో విజయంతో పాకిస్తాన్ జట్టు సంతృప్తి పడిపోయింది. ఇక ఇప్పుడు వీళ్లు నెదర్లాండ్స్ వంటి జట్టును ఓడిస్తారు. ఆసియా కప్‌లో ఎలాగోలా నెగ్గుకొస్తారు. ఆలోపు అభిమానులు ఈ టెస్టు సిరీస్ గురించి మర్చిపోతారు. ఒకటీ రెండు విజయాలు సాధించి ఏదో సాధించినట్లు ఫీలవుతూ ఉంటారు. మూడు నాలుగేళ్ల పాటు ఈ అరకొర గెలుపు గురించి మాట్లాడుకుంటూ ఉంటారని అనుకుంటారు. శ్రీలంకతో రెండో టెస్టులో భారీ టార్గెట్ ఛేదించలేక ఏదో మొక్కుబడిగా ఆడారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది’’ అని మండిపడ్డాడు. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ రెండో టెస్టు స్కోర్లు: టాస్: శ్రీలంక- బ్యాటింగ్ శ్రీలంక ఇన్నింగ్స్: 378 & 360/8 డిక్లేర్డ్ పాక్ ఇన్నింగ్స్: 231 & 261 విజేత: 246 పరుగులతో శ్రీలంక గెలుపు.. సిరీస్ 1-1తో సమం చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ A series played in the right spirit 🤗 🇵🇰🇱🇰 post-match interactions 🙌#SLvPAK pic.twitter.com/q8T2E91JFl — Pakistan Cricket (@TheRealPCB) July 28, 2022 -
SL Vs Pak: ఇది టెస్టు మ్యాచ్.. టీ20 కాదు.. వాళ్లిద్దరిని ఎందుకు సెలక్ట్ చేయలేదు?
SL Vs Pak 1st Test- “It’s a Test match, not a T20 game” - Kamran Akmal: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శనివారం(జూలై 16) గాలే వేదికగా మొదటి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు, హసన్ అలీ రెండు, యాసిర్ షా రెండు వికెట్లతో చెలరేగారు. నసీమ్ షా, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. దీంతో మూడో సెషన్ సమయానికి లంక 9 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. మహీశ్ తీక్షణ, కసున్ రజిత క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ తుదిజట్టులో ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లకు చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. ఇదేమీ టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు క్రికెట్ అంటూ మేనేజ్మెంట్ను విమర్శించాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘ఇది టెస్టు మ్యాచ్.. టీ20 గేమ్ కాదు... చాలా మంది ఆల్‌రౌండర్లు ఆడుతున్నట్లున్నారు.. నిజానికి టెస్టు క్రికెట్కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. ఫవాద్ ఆలం, ఫాహీమ్ అష్రఫ్‌లను శ్రీలంకతో మ్యాచ్‌కు ఎందుకు తప్పించడం నన్ను విస్మయానికి గురిచేసింది’’ అని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు. It’s a test match not a T20 game…too many Allrounders playing and what i think is test match game is all about specialists…its pretty shocking why @iamfawadalam25 and @iFaheemAshraf both have been dropped 🤔 #PAKvsSL — Kamran Akmal (@KamiAkmal23) July 16, 2022 కాగా ఆలం ఇప్పటి వరకు 18 టెస్టులాడి 986 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహీమ్ 14 టెస్టు మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 636 పరుగులు సాధించాడు. ఇలా ఇద్దరూ టెస్టు క్రికెట్లో సత్తా చాటారు. ఈ నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. శ్రీలంకతో మొదటి టెస్టు ఆడుతున్న పాక్ జట్టు: అబ్దుల్లా షఫిక్, ఇమామ్ ఉల్ హక్, అజర్ అలీ, బాబర్ ఆజం(కెప్టెన్), ఆఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నసీమ్ షా. శ్రీలంక తుదిజట్టు: ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వా, దినేశ్ చండిమాల్, నిరోషన్ డిక్విల్లా(వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, మహీశ్ తీక్షణ, ప్రభాత్ జయసూర్య, కసున్ రజిత. చదవండి: Lalit Modi- Sushmita Sen: తనకంటే తొమ్మిదేళ్లు పెద్దది.. మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్! చివరికి ఇలా! Sri Lanka won the toss and elected to bat first: 🔴 LIVE | 1st Test - Day 1 | #SLvPAK https://t.co/oru4bTD9it — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 16, 2022 -
'ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు'
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా మాలిక్‌ను భారత జట్టులోకి వెంటనే తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ అసక్తికర వాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ అరంగేట్రం చేసే వాడని ఆక్మల్ అభిప్రాయపడ్డాడు. "మాలిక్ పాకిస్తాన్లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆడి ఉండేవాడు. అతడు బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే అతడు వికెట్ టేకింగ్ బౌలర్. అతడు గంటకు 155 కిమీ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కు అతడి బౌలింగ్‌లో వేగం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఉమ్రాన్ గత సీజన్లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. బ్రెట్ లీ, అక్తర్ కూడా చాలా పరుగులు ఇచ్చే వారు. కానీ వికెట్లు పడగొట్టేవారు. ఇంతకుముందు, భారత క్రికెట్లో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు లేరు, కానీ ఇప్పుడు వారికి నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ జస్ప్రీత్ బుమ్రా వంటి పేసర్లు చాలా మంది ఉన్నారు. ఉమేష్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 10 నుంచి12 మంది పేసర్లు ఉండడంతో భారత సెలెక్టర్లు ఎంపిక చేయడం కష్టతరంగా మారింది" అని కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'నా తొలి మ్యాచ్‌ను మా నాన్న ప్రొజెక్టర్‌లో చూశారు' -
'మా కెప్టెన్ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్ నుంచి దింపేశాడు'
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 షురూ కానుంది. ఈసారి కూడా ప్రారంభ వేడుకలు లేకుండానే సీజన్ ఆరంభం కానుంది. ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మనకు భౌతికంగా దూరమైనప్పటికి అతని జ్ఞాపకాలు మాత్రం చాలానే ఉన్నాయి. మార్చి 30న మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాంటి వార్న్‌కు ఐపీఎల్‌తోనూ విడదీయరాని అనుబంధం ఉంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్లో తొలి విన్నర్ రాజస్తాన్ రాయల్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అండర్‌డాగ్స్‌గా కనిపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చాంపియన్‌గా అవతరించింది. వార్న్ తన కెప్టెన్సీతో పెద్దన్న పాత్ర పోషించగా రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్, అజింక్యా రహానే, అప్పటి పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. తాజాగా పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ రాజస్తాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యూసఫ్ పఠాన్, జడేజా, వార్న్‌ల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వివరించాడు. ''మ్యాచ్‌కు ముందురోజు ప్రాక్టీస్ చేయడానికి మేం స్టేడియానికి వెళ్లాం. ఆరోజు యూసఫ్ పఠాన్, జడేజాలు ట్రెయినింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి నేను కూడా లేటుగానే వచ్చాను. కానీ వార్న్ మా ముగ్గురిని ఒక్క మాట అనలేదు.. క్లాస్ పీకుతాడేమోనని భయపడ్డాం. అయితే ప్రాక్టీస్ ముగించుకొని హోటల్ రూమ్‌కు బస్సులో బయలేదేరాం. కొద్దిదూరం వెళ్లాకా వార్న్ బస్సు డ్రైవర్‌తో బస్సు ఆపండి అన్నాడు. ఆ తర్వాత జడేజా, పఠాన్ల వైపు తిరిగి మీరిద్దరు ఇక్కడ దిగి హోటల్ రూమ్ వరకు నడుచుకుంటూ రండి అని చెప్పాడు. అంతే పఠాన్, జడేజా ముఖాలు వాడిపోయాయి. వార్న్ సైలెంట్‌గా పనిష్మెంట్ ఇస్తాడని ఆ క్షణమే మనసులో అనుకున్నా. ఆ సందర్బం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది.'' అంటూ పేర్కొన్నాడు. ఇక 2008 మినహా మరోసారి టైటిల్ గెలవని రాజస్తాన్ రాయల్స్ ఈసారి కప్ కొట్టాలనే కసితో ఉంది. అందుకు తగ్గట్లే.. మెగావేలంలో అశ్విన్, చహల్, హెట్‌మైర్, జేమ్స్ నీషమ్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఈసారి కప్ సాధించాలనే పట్టదలతో ఉన్నాడు. మార్చి 29న ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: టోక్యో ఒలింపిక్స్ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..! -
టీ20 ప్రపంచ కప్‌కు ముందు అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు...
Mohammad Hafeez Might Not Play T20 World Cup: పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ టీ20 ప్రపంచ కప్‌కు ముందు తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని ఆ జట్టు వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న హఫీజ్‌ను త్వరగా స్వదేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కాగా సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతున్న సీపీల్లో పాల్గొనడానికి హఫీజ్‌కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయబడింది. అయితే, న్యూజిలాండ్‌తో జరగబోయే హోమ్ సిరీస్ కోసం సెప్టెంబర్ 16లోపు హఫీజ్‌ను జట్టులో పీసీబీ చేరమంది. ఇందుకోసం రెండు రోజులు గడువు ఇవ్వాలన్న హఫీజ్ అభ్యర్థనను కూడా బోర్డు తిరస్కరించింది. దీంతో హఫీజ్ న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో పీసీబీ తీసుకున్న నిర్ణయంపై హఫీజ్ మండిపడుతున్నాడని సమాచారం. ఈ విషయం పై స్పందించిన అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లడతూ.. హఫీజ్ వంటి సీనియర్ ఆటగాడి పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు చేశాడు. హఫీజ్‌తో ఈ విధంగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదని అక్మల్ అన్నాడు. "నేను మొహమ్మద్ హఫీజ్‌తో మాట్లాడలేదు కానీ అతడు చాలా బాధపడ్డాడని.. టీ20 ప్రపంచకప్ ఆడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. పీసీబీ అతడితో సంప్రదింపులు జరపకపోతే , అతడు ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని అక్మల్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రమీజ్ రాజాను.. భవిష్యత్తులో హఫీజ్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు ఈ విధంగా జరగకుండా చూసుకోవాలని అక్మల్ అభ్యర్థించాడు. తమ మధ్య ఉన్న వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి హఫీజ్‌కి మద్దతు ఇవ్వాలని అక్మల్ కోరాడు. కాగా రమీజ్ రాజా కంటే పన్నెండేళ్ల వయస్సున్న తన కొడుకుకే క్రికెట్ గురించి ఎక్కువ తెలుసంటూ హఫీజ్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే? -
స్పెల్లింగ్ మిస్టెక్తో బుక్కైన పాక్ క్రికెటర్
ఎన్ని పండుగలున్నా.. జెండా పండుగను కులమతాలకతీతంగా దేశం మొత్తం కలిసి సంబురంగా చేసుకుంటుంది. ఆగష్టు 15న భారత దేశం.. జిన్నా ఒత్తిడితో అధికార బదలాయింపు ఒకరోజు ముందు జరగడం, మరికొన్ని కారణాలతో 14వ తేదీనే పాకిస్తాన్‌లు స్వాతంత్య్ర సంబురాలు జరుపుతాయని తెలిసిందే. కాబట్టి, ఇవాళ పాక్ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భంగా క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేసిన ఓ ట్వీట్.. ట్రోలింగ్‌కు దారి తీసింది. శనివారం పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్Independence డేకి బదులు.. ఇండిపెన్స్Indepence అంటూ ఇంగ్లీష్‌లో తప్పు ఫొటో పోస్ట్ చేశాడు కమ్రాన్. మూములుగానే పాక్ క్రికెటర్లను ఎప్పుడు.. ఎక్కడ దొరుకుతారా? అని ఎదురు చూస్తున్న మన నెటిజన్స్.. ఈ తప్పును గుర్తించారు. pic.twitter.com/ZG397jz3RT — Kamran Akmal (@KamiAkmal23) August 13, 2021 Perfect revenge on Britishers 👏🏻 Proud of you Brother @KamiAkmal23 pic.twitter.com/uYFZq8QifX — Unsocially M’idiotic (@m_idiotic) August 13, 2021 Respect for you brother, you the only person taking revenge from British for what they did to our country by doing same to their language — Scar (@Scar3rd) August 13, 2021 Pakistan waalon ka apna ek alag english dictionary.. respect! — Keh Ke Peheno (@coolfunnytshirt) August 14, 2021 Meet English He/She was really a nice person But now he/She is no more.... pic.twitter.com/jTd1k1HQnk — खडकवासल्याचा कोलंबस🇮🇳 (@aapalacolumbus) August 14, 2021 Carrying on Umar's Legacy 👌 Time to modify the dictionary — YOGESH (@i_yogesh22) August 13, 2021 ఇంకేం సోషల్ మీడియాలో కమ్రాన్ అక్మల్‌ను ఇలా ట్రోల్ చేసేస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు. కానీ, ఇలా గుర్తించే పెద్ద తప్పు.. అదీ దేశం మీద వేయడంతో పాక్‌లోనూ కొందరు కమ్రాన్ విమర్శిస్తుండడం విశేషం. -
కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..?
కరాచీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు సారధి విరాట్ కోహ్లీని బాధ్యున్ని చేస్తూ జరుగుతున్న రాద్దాంతంపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘన చరిత్ర కలిగిన కోహ్లీని కేవలం ఒక్క మ్యాచ్ ఓటమి వల్ల ఈ స్థాయిలో నిందించడాన్ని ఆయన తప్పుపట్టాడు. కోహ్లీ సాధించిన విజయాలపై అవగాహన లేని వాళ్లే ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారని దుయ్యబట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఒక్క కోహ్లీని మాత్రమే తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని, కోహ్లీ స్థానంలో మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశాడు. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలని, ఫైనల్ ఫోబియా వీడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీనే సరైన వ్యక్తి అని, భవిష్యత్తులో అతని సారధ్యంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని కోహ్లీకి బాసటగా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కోహ్లీ కెప్టెన్సీనే కారణమని, అందుకు జట్టు సారధ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ దాయాది దేశ ఆటగాడు కోహ్లీకి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. 'మై మాస్టర్ క్రికెట్ కోచ్' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక క్రికెట్లో కోహ్లీ గొప్ప ఆటగాడని, అంత కంటే అద్భుతమైన కెప్టెన్ అని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడని, ఎంతో భావోద్వేగంతో ఉంటాడని, ఆ లక్షణాలే అతన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్లో మార్పు సౌరవ్ గంగూలీతో మొదలైందని, ఆతర్వాత ధోనీ, కోహ్లీలు దాన్ని కంటిన్యూ చేశారని పేర్కొన్నాడు. ఇక, ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న కారణంగా కోహ్లీని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్న వారికి ఈ పాక్ వికెట్ కీపర్ తారాస్థాయిలో చురకలంటించాడు. ఒక్క ఐసీసీ టోఫ్రీ మినహాయించి కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే, ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో తడబడడంతో భారత మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ.. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. చదవండి: మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు -
భారత సీ జట్టు వెళ్లినా సునాయాసంగా గెలుస్తుంది..
కరాచీ: ప్రస్తుతం భారత క్రికెట్ చాలా పటిష్ఠంగా ఉందని, ఏక కాలంలో మూడు జట్లను బరిలోకి దించి, విజయాలు సాధించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ ఈ స్థాయికి చేరడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవలంబిస్తున్న విధానాలే కారణమని, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బీసీసీఐని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ పాక్ మాజీ డాషింగ్ క్రికెటర్ సూచించాడు. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ లాంటి లీగ్‌లు భారత యువ ఆటగాళ్ల పాలిట వరంలా మారాయని, ఈ తరహా టోర్నీల వల్ల మేటి ఆటగాళ్లు ఉద్భవిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. శ్రీలంక పర్యటనకు భారత్ రెండో జట్టు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పాక్ మాజీ ఆటగాడు స్పందిస్తూ.. శ్రీలంక పర్యటనకు భారత సీ జట్టు వెళ్లినా సునాయసంగా గెలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాడు మార్గనిర్దేశం చేస్తుండటం భారత క్రికెట్ ఉన్నతికి మరో కారణమని ఆయన పేర్కొన్నాడు. ద్రవిడ్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది యువ క్రికెటర్లు లైమ్‌లైట్‌లోకి వచ్చారని, టీమిండియా హెడ్ కోచ్రవిశాస్త్రి కూడా జట్టుకు అద్భుతంగా సేవలందిస్తున్నాడని ప్రశంసించాడు. మాజీ కెప్టెన్ ధోనీ నాయకత్వాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ అందిపుచ్చుకున్నాడని, విరాట్ అందుబాటులో లేకపోతే ఆ బాధ్యతలు రోహిత్ చూసుకుంటాడని, అతను కూడా గాయపడితే ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్ చూసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. భారత బి జట్టు శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత జట్టు ఏక కాలంలో రెండు అంతార్జాతీయ జట్లతో రెండు వేర్వేరు సిరీస్‌లలో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు యూకే పర్యటనకు వెళ్తుండగా.. అదే సమయంలో భారత బి జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. భారత బి జట్టుకు కోచ్‌గా భారత మాజీ క్రికెటర్, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనుండగా, బి జట్టుకు సీనియర్ ఆటగాడు ధవన్ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: Sachin Tendulkar: ఆ రెండు కోరికలు నెరవేరలేదు -
ఇంతకంటే అధ్వాన్నం ఉండదు!
కరాచీ: దాదాపు 14 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో పర్యటించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ సాధించిన సంగతి తెలిసిందే. కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఓపెనర్ సల్మాన్ భట్‌తో పాటు మహ్మద్ యూసఫ్, యూనిస్ ఖాన్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించి తొలి ఓవర్ ఆ ఫీట్ నమోదు చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. అదే సమయంలో పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.కాగా, ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయినా పాకిస్తాన్నే విజయం వరించింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో కమ్రాన్ అక్మల్ సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ జట్టులో అప్పుడు కొత్తగా అడుగుపెట్టిన అక్మల్‌పై ఎటువంటి ఒత్తిడి లేకుండా శతకం నమోదు చేశాడు. అయితే తాను సెంచరీ చేయడానికి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఇచ్చిన సలహానే కారణమన్నాడు. క్రిక్ కాస్ట్ యూట్యూబ్ చాట్‌లో 2006 కరాచీ టెస్టు మ్యాచ్ విశేషాల్ని కమ్రాన్ గుర్తు చేసుకున్నాడు. ‘ నిజం చెప్పాలంటే నా మైండ్‌లో ఏమీ లేదు. అప్పటికే ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి మా జట్టును కష్టాల్లోకి నెట్టాడు. నేను కూడా కొత్త ముఖాన్నే. దాంతో పెద్దగా ఒత్తిడి తీసుకోలేదు. ఆ మ్యాచ్‌కు ఇంజీ భాయ్ వెన్నుగాయంతో దూరమయ్యాడు. (గంగూలీ చేసిందేమీ లేదు!) కాకపోతే డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంజీ ఒక్కటే చెప్పాడు. ఇప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దది. ఇంతకంటే అధ్వానం ఏమీ ఉండదు. నువ్వు మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోవద్దు. నీ సహజసిద్ధమైన ఆటనే ప్రదర్శించు. భారత్‌పై ఎలా ఆడతావో అలానే ఆడు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకో. కేవలం నీ నేచురల్ గేమ్‌ను మాత్రమే ఆడు. ఏదీ జరిగినా పర్వాలేదు. ఇప్పటికే చాలా పెద్ద నష్టం జరిగింది. నువ్వు ఎలా ఆడిన ఇంతకంటే అధ్వానం కాదు’ అని ఇంజీ తనలో ప్రేరణ నింపినట్లు కమ్రాన్ తెలిపాడు. దాంతోనే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి పాక్‌ను పటిష్ట స్థితిలో నిలిపినట్టు తెలిపాడు. ఇదే తమ విజయానికి బాటలు వేసిందన్నాడు. అది తన కెరీర్లోనే అత్యుత్తమ మ్యాచ్ అని ఈ సందర్భంగా కమ్రాన్ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 245 పరుగులకు ఆలౌట్ కాగా, కమ్రాన్ 113 పరుగులు చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 238 పరుగులకే ఆలౌట్ కాగా, పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఫలితంగా భారత్‌కు 607 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా 265 పరుగులకే చాపచుట్టేయడంతో పాకిస్తాన్ 341 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
‘ఆ ఇద్దరే సిరీస్ స్వరూపాన్ని మార్చేశారు’
కరాచీ: 2004-05 సీజన్లో భారత్‌లో పర్యటించిన విశేషాలను పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. అదొక ఒత్తిడితో కూడిన సిరీస్ కావడంతో భారత్‌లో వారిపై గెలవడం రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అప్పటికే తమ గడ్డపై భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోవడంతో విపరీతమైన ఒత్తిడితో అడుగుపెట్టినా అందుకు తగిన ఫలితమే లభించిందన్నాడు. తన యూట్యూబ్ చానల్లో ఆనాటి జ్ఞాపకాలను ఇంజీ గుర్తు చేసుకున్నాడు. ఆ ద్వైపాకిక్షిక సిరీస్‌లో టెస్టు సిరీస్‌ను సమం చేయడమే కాకుండా, వన్డే సిరీస్‌ను 4-2 తేడాతో గెలుచుకోవడం మరిచిపోలేని అనుభూతిగా పేర్కొన్నాడు.(233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..) ‘తొలి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో గంగూలీ నేతృత్వంలోని భారత్ గెలిచింది. అయినా మేము పట్టువదల్లేదు. మూడో టెస్టులో అమీతుమీకి సిద్ధమయ్యాం. అది మేము గెలిచి సిరీస్‌ను సమం చేశాం. ఆ సిరీస్‌లో అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మాల్‌లు మా తలరాతను మార్చారు. వారిద్దరి వల్లే మేము సిరీస్‌ను చేజార్చుకోలేదు. వారు సిరీస్ స్వరూపాన్నే మార్చేశారు. జూనియర్ స్థాయి క్రికెటర్లే ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడలేకపోతున్నాం అనే ప్రశ్నను వారు లేవనెత్తారు. చండీగఢ్‌లో జరిగిన టెస్టులో కమ్రాన్ సెంచరీ చేయగా, రజాక్ 70 పరుగులకు పైగా చేశాడు. దాంతో మ్యాచ్‌ను కాపాడుకున్నాం. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలను కోల్పోయి వెనుకబడ్డాం. అది ఆరు వన్డేల సిరీస్. ఆ తర్వాత వరుసగా నాలుగు వన్డేలు గెలిచి సిరీస్‌ను భారీ తేడాతో గెలిచాం. జూనియర్ స్థాయి క్రికెటర్లు ఆడుతున్నప్పుడు మేము ఎందుకు ఆడటం లేదు అని నాతో పాటు యూనిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్ల్లో పట్టుదల వచ్చింది. దాంతోనే టీమిండియాపై చాలా కసిగా ఆడాం. ఏది ఏమైనా కమ్రాన్, రజాక్లే సిరీస్ స్వరూపాన్ని మార్చింది’ అని ఇంజీ పేర్కొన్నాడు. (టై అంటే టై.. సూపర్ ఓవర్ ఏమిటి?) -
గంభీర్‌తో గొడవపై పదేళ్ల తర్వాత..
కరాచీ: పదేళ్ల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌తో జరిగిన వాగ్వాదంపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పెదవి విప్పాడు. ఆనాటి గొడవపై మాట్లాడుతూ.. అది కావాలని జరిగింది కాదని, ఆ సమయంలో అపార్థం చోటు చేసుకోవడంతోనే అలా జరిగిందన్నాడు. 2010లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గౌతం గంభీర్-కమ్రాన్ అక్మల్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కొట్టుకునేలా తమ నోటికి పని చెప్పడంతో అంపైర్లు చొరవతో దానికి ముగింపు పలికారు. గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్ పదే పదే కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఓవర్లో వచ్చిన బ్రేక్‌తో ఇద్దరూ మరోసారి మాటలు తూటాలు పేల్చుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు అక్కడే ఉన్న ఎంఎస్ ధోని.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆపై 2012-13 సీజన్లో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ శర్మపై అక్మల్ నోరు పారేసుకున్నాడు.(తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో) ఈ రెండు ఘటనలు అనుకోకుండా జరిగినవేనని కమ్రాన్ అక్మల్ తెలిపాడు. ‘నేను-గంభీర్ మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం లిస్ట్-ఎ క్రికెట్ ఆడే క్రమంలో స్నేహితులుగా ఉండేవాళ్లుం. ఆనాడు గంభీర్‌తో గొడవ ఎందుకు వచ్చిందో కూడా సరిగా తెలియదు. కావాలని గంభీర్‌తో గొడవ పడలేదు. ఇషాంత్ శర్మతో గొడవ ఘటన కూడా అంతే. నాకు ఇషాంత్ కూడా స్నేహితుడే. నేను ఫీల్డ్‌లో ఎక్కువగా మాట్లాడను. అవి చాలా చిల్లర ఘటనలు. మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఫీల్డ్‌లో జరిగింది అక్కడికే పరిమితం’ అని కమ్రాన్ తెలిపాడు. పాకిస్తాన్ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లను కమ్రాన్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ తరఫున చివరిసారి కనిపించాడు కమ్రాన్. ఆ తర్వాత పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ స్థానాన్ని సర్ఫరాజ్ అహ్మద్ భర్తీ చేయడంతో కమ్రాన్‌కు చోటు లేకుండా పోయింది. ఒకానొక సమయంలో కమ్రాన్‌పై సర్ఫరాజ్ బహిరంగ విమర్శలు కూడా చేశాడు. కమ్రాన్ జట్టులో చోటు కోల్పోవడానికి సర్ఫరాజ్ లాబీయింగ్ చేశాడనేది అప్పట్లో బాగా వినిపించింది. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) -
తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలను చూసి తన తమ్ముడు ఉమర్ అక్మల్ బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. వారిని చూసైనా మైదానంలోనూ, బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలంటూ ఉమర్ అక్మల్‌కు సూచించాడు. ఉమర్‌పై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని రహస్యంగా ఉంచినందుకుగానూ పీసీబీ ఈ శిక్ష విధించింది. నిషేధ కాలంలో ఏ స్థాయి క్రికెట్ ఆడకూడదంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘ఉమర్ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విరాట్, సచిన్, ధోని జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్ నీతిగా క్రికెట్ ఆడాడు. విరాట్, ధోని, బాబర్ ఆజమ్‌ల నుంచి ఉమర్ ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కమ్రాన్ అన్నాడు. -
తొలి ఆసియా వికెట్ కీపర్‌గా..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దుమ్ము రేపాడు. దేశవాళీ క్రికెట్లో భాగంగా సెంట్రల్ పంజాబ్ తరఫున ఆడుతున్న అక్మల్.. ఉత్తర పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదేశాడు. దాంతో తన ఫస్ట్ కెరీర్లో 31వ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ మార్కును చేరిన తొలి ఆసియన్ వికెట్ కీపర్‌గా అక్మల్ రికార్డు సాధించాడు. అదే సమయంలో ఓవరాల్‌గా రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక్కడ ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ కంటే ఎక్కువ ఫస్ట్‌క్లాస్ సెంచరీలు చేసిన ఘనతను నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ లెస్ ఏమ్స్(56) అగ్రస్థానంలో ఉన్నాడు.తన సెంచరీతో సెంట్రల్ పంజాబ్ 5వికెట్లకు 369 పరుగులతో గౌరవప్రధానమైన స్కోర్ సాధించగలిగింది. అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్‌లేమి కారణంగా సెలక్టర్లు అక్మల్‌కు మొండిచేయి చూపగా దేశవాళీ క్రికెట్లో రాణించడం విశేషం. అక్మల్ చివరిసారిగా 2010లో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడగా, వన్డేల్లో 2017లో వెస్ట్ండీస్‌తో చివరి వన్డే ఆడాడు. -
ఆరంభం నుంచి భారతే ఫేవరెట్: పాక్ క్రికెటర్
హైదరాబాద్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్-2019లో తన ఫేవరేట్ జట్టు టీమిండియానేనని పాకిస్తాన్ వెటరన్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ తెలిపాడు. బుధవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌తో కోహ్లి సేననే విజయం సాధించాలని ఆకాంక్షించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భీకర ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఆరంభం నుంచి భారత్ జట్టే తనకు ఫేవరెట్ అని స్పష్టం చేశాడు. ఈ మేరకు భారత్- కివీస్ జట్లకు ఆల్ ద బెస్ట్ చెబుతూ కమ్రాన్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిందని కమ్రాన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పాక్ ఆటగాళ్లు చాలా ఆలస్యంగా మెలుకున్నారని విమర్శించాడు. ఆది నుంచి ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడితే పాక్ సెమీస్‌లో ఉండేదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్, పాక్ సమాన విజయాలు సాధించినప్పటికీ రన్‌రేట్ ఆధారంగా సెమీస్‌కు కివీస్ చేరింది. ఇక వెస్టిండీస్ మ్యాచే పాక్ కొంముంచిందని సారథి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓటమిపై ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరంలేదని, శక్తి మేర పోరాడమని వివరించాడు. -
‘పాక్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకోండి’
ఇస్లామాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ జట్టుపై విమర్శలు ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాక్ క్రికెట్ జట్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ విజ్ఞప్తి చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించి దేశం పరువుతీసిన ఆటగాళ్లను సాగనంపాలన్నారు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ దారుణంగా విఫలమయ్యాడని విమర్శించారు. ‘ప్రపంచకప్ టోర్నిలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఛేజింగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయి 105కే ఆలౌటైంది. మన బ్యాటింగ్ దారుణంగా ఉంది. మన లోపాలను ప్రత్యర్థులు సోపానాలుగా మలుచుకున్నార’ని అక్మల్ మండిపడ్డాడు. పాకిస్తాన్లో సమర్థులైన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసివుంటే పాక్ క్రికెట్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసివుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రపంచకప్‌లో తమ జట్టు ప్రదర్శనపై లోతుగా సమీక్ష చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంతకుముందు ప్రకటించింది. -
‘బెస్ట్ వికెట్ కీపర్’ అక్మల్.. జోకులొద్దు!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. అంతర్జాతీయ, డొమెస్టిక్ క్రికెట్లో 2017-18లో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బుధవారం అవార్డులు ప్రకటించింది. డొమెస్టిక్ క్రికెట్లో భాగంగా బెస్ట్ వికెట్ కీపర్ అవార్డు కమ్రాన్ అక్మల్‌ను వరించింది. అయితే కమ్రాన్ బెస్ట్ వికెట్ కీపర్ ఏంటనీ? జోకులొద్దని ఆ దేశ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నేను విన్నది నిజమా? జోక్ చేయకురబ్బా..’ అని ఒకరు కామెంట్ చేయగా.. బెస్ట్ వికెట్ కీపర్ అక్మల్ దక్కిందంటే.. మన డొమెస్టిక్ క్రికెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని మరొకరు కామెంట్ చేశారు. ఇంత చెత్త ఆటగాడు బెస్ట్ కీపర్ అయితే పాక్‌లో వికెట్ కీపర్ల కొరత ఉన్నట్లేనని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ఇటీవల జింబాబ్వేపై డబుల్ సెంచరీ సాధించిన ఫకార్ జమాన్‌కు 2.5 మిలియన్ల రూపాయలతో ప్రత్యేక అవార్డును అందజేశారు. బెస్ట్ టెస్ట్ ప్లేయర్‌గా మహమ్మద్ అబ్బాస్, వన్డే ప్లేయర్‌గా హసన్ అలీలు అవార్డులు అందుకున్నారు. What did i just read?? R u serious? No i mean is this a joke or what? Kamran Akmal for the best WK????😳😳😫😭pls someone tell me it was an error RIP Talent! https://t.co/UwcR9kn001 — NasreeN (@Nas_k27) August 8, 2018 -
కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్ ధోని
సాక్షి, స్పోర్ట్స్ (మాంచెస్టర్): మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్ కూల్’ ధోని అధిగమించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. అదే ఫామ్ కొనసాగిస్తే ఆతిథ్య జట్టుకు 200 పరుగులు సులువే. కానీ 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. ఈ చైనామన్ బౌలర్ మూడో(ఇన్నింగ్స్14వ) ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. ఓ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అందుకోగా నిరాశగా వెనుదిరిగాడు. అపై అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ఎంఎస్ ధోని సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని నిలిచాడు. ధోని ఆలోచనల్ని సరిగ్గా అమలుచేసిన కుల్దీప్(5/24) అద్భుత బౌలింగ్‌కు ఇంగ్లండ్ నుంచి సమాధానం కరువై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) పరవాలేదనిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి రాహుల్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్‌లో టీమిండియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు 33 ఎంఎస్ ధోని 32 కమ్రాన్ అక్మల్ 28 మహ్మద్ షెహజాద్ 26 ముష్ఫీకర్ రహీం 20 కుమార సంగక్కర -
'అతని వల్లే మా క్రికెట్ నాశనమైంది'
కొలంబో:పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వకార్ యూనిస్ పై ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనంలో పయనించడానికి వకారే ప్రధాన కారణమంటూ అక్మాల్ ధ్వజమెత్తాడు. రెండుసార్లు పాకిస్తాన్ కోచ్ గా పని చేసిన వకార్ వల్ల తమ ఆటకు జరిగిన మేలు ఏమిలేకపోగా, సర్వనాశనం చేశాడంటూ అక్మల్ విమర్శలు గుప్పించాడు. 'వకార్ ఒక ఫెయిల్యూర్ కోచ్. అదే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ నాశనం కావడానికి కూడా కారణమయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ ను మూడేళ్లు వెనక్కినెట్టాడు. అతనికి వేరే ఆటగాళ్లతో విభేదాల గురించి నాకైతే తెలీదు. అసలు పాకిస్తాన్ క్రికెట్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై వకార్ కు ఎప్పుడూ ప్రణాళికలు లేవు. 2015 వరల్డ్ కప్ లో యూనిస్ ఖాన్ ను ఓపెనింగ్ చేయమనడమే వకార్ వద్ద ప్రణాళికలు లేవనడానికి ఒక ఉదాహరణ. మరొకవైపు ఆసియా కప్ కు సంబంధించి ఒక మ్యాచ్ లో ఉమర్ అక్మల్ సెంచరీ చేస్తే, ఆ తరువా మ్యాచ్ లో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత కిందకి నెట్టాడు. ఎవరితో విభేదాల కారణంగా ఇలా చేసాడో నాకైతే తెలీదు...కానీ పాకిస్తాన్ క్రికెట్ ను మాత్రం వకార్ నాశనం చేశాడు. ఆటగాడిగా వకార్ గొప్పవాడు కావొచ్చు.. కోచ్ గా మాత్రం ఫెయిల్యూర్'అని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు.పాకిస్తాన్ కోచ్ వకార్ యూనిస్ రెండుసార్లు పనిచేసిన సంగతి తెలిసిందే. 2010 నుంచి 2011 వరకూ, 2014 నుంచి 2016 వరకూ వకార్ కోచ్ గా పాక్ కు సేవలందించాడు.