స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
అయితే ఈ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో ఖాళీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పీసీబీపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం కురిపించాడు. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువుపోతుందని ఆక్మల్ మండిపడ్డాడు.
"పాక్-బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కరాచీలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని మీకు ముందే తెలుసు కదా? అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు షెడ్యూల్ చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.
పాకిస్తాన్‌లో టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగడం మన దేశానికి అవమానకరం. మనకు కేవలం రెండు, మూడు స్టేడియంలు మాత్రమే లేవు. ఫైసలాబాద్ స్టేడియం కూడా ఉంది. అక్కడ కూడా మ్యాచ్‌ను నిర్వహించవచ్చు. అదొక టాప్ క్లాస్ స్టేడియం. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు అక్కడ జరిగాయి. అదేవిధంగా ముల్తాన్‌లో కూడా స్టేడియం ఉంది.
ముల్తాన్ స్టేడియం చాలా బాగుంటుంది. అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ రెండు వేదికలో ఏదో ఒక స్టేడియంలో సెకెండ్ టెస్టును నిర్వహించాల్సింది.
అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను నిర్వహించాలన్నది సరైన నిర్ణయం కాదు. ఇది నిజంగా మనకు సిగ్గు చేటు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరును తీసుకువస్తుందని" తన యూట్యాబ్ ఛానల్‌లో పీసీబీపై అక్మల్ ఫైరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment