టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియం వస్తారో లేదన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పట్టుకుంది.
ఎందుకంటే ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఖాళీ స్టాండ్స్ మధ్య ఈ టీ20 లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరను భారీగా తగ్గించింది.
రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టిక్కెట్ కనీస ధరగా పీకేఆర్ 200 (భారత కరెన్సీలో సుమారు రూ.60)గా నిర్ణయించిన పీసీసీ.. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే రెండు టెస్టు ఎంట్రీ టిక్కెట్ పీకేఆర్ 50(భారత కరెన్సీలో రూ.15)గా ఫిక్స్ చేశారు.
కాగా దశాబ్ద కాలంలో కరాచీ నేషనల్ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టిక్కెట్లను విక్రయించడం ఇదే మొదటి సారి. ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆగస్టు 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక తొలి టెస్టుకు గరిష్ట టిక్కెట్ ధరగా 60,000 కాగా.. కరాచీ టెస్టు అత్యధిక టిక్కెట్ ధర 83,000గా ఉంది. ఈ టిక్కెట్లు కొనుగొలు చేసిన వారికి పీసీబీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment