ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజులు అవుతున్నప్పటకి స్వర్ణ పతక విజేత, పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తొలి ఒలింపిక్ గోల్డ్‌మెడల్ అందించి ఓవర్‌నైట్ హీరోగా నదీమ్ మరిపోయాడు.
అతడిని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా నదీమ్‌కు రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును ప్రదానం కూడా చేయనున్నారు.
డ్రెస్సింగ్‌కు రూమ్ ఆహ్వానించిన గిల్లెస్పీ...
ఈ క్రమంలో పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ గోల్డన్ బాయ్ నదీమ్‌ను తమ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్తానీ అథ్లెట్ కలవడం ద్వారా తమ క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు.
కాగా పాక్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు సందర్భంగా పాక్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించే అవకాశముంది.
"అర్షద్ నదీమ్‌ని మా డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాం. ఒలింపిక్స్ సమయంలో మా క్రికెటర్ల అందరూ నదీమ్‌ని ఉత్సాహపరచడం నేను చూశాను. అతడు తన బంగారు పతకంతో మా డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శిస్తే ఆటగాళ్లలో మరింత పట్టుదల పెరుగుతుంది. మా క్రికెటర్లు అతడిని కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు" అని పీసీబీ పోడ్‌కాస్ట్‌లో గిల్లెస్పీ పేర్కొన్నాడు
Comments
Please login to add a commentAdd a comment