టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుస్తున్న సంగతి తెలిసింది. ఐపీఎల్-2024 టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచిన కింగ్ కోహ్లి.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.
ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటర్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.
"విరాట్ కోహ్లి సాధించిన రికార్డులకు మా తమ్ముడు ఉమర్ అక్మల్ దగ్గరకలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి కంటే మెరుగైన స్ట్రైక్ రేట్, అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్ కలిగి ఉన్నాడు.
కానీ కోహ్లిలా మాకు పీఆర్ ఎజెన్సీలు లేవు. అందకే మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోటు చేసుకోలేము. పొట్టి ప్రపంచకప్‌లో మా తమ్ముడు కలిగి ఉన్న గణాంకాలు ప్రస్తుత 15 మంది సభ్యుల గల భారత జట్టులో ఎవరికి లేవు. ప్రస్తుత టోర్నీల్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు.
మెనెజ్‌మెంట్ విరాట్‌ను విమర్శించిన ఆశ్చర్యపోనక్కర్లలేదని ఏఆర్‌వై న్యూస్ డిబీట్‌లో కమ్రాన్ అక్మల్ విషం చిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరలవుతోంది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ అక్మల్‌కు కౌంటిరిస్తున్నారు. కోహ్లితో ఉమ్రాన్‌కు పోలికా, అందుకే మీ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment