మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయారు. లంక బౌలర్లు మూకుమ్మడిగా రాణించిన పాక్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లంక బౌలర్ల ధాటికి 116 పరుగులకు ఆలౌటైంది.
సుగంధిక కుమారి, ఉదేషిక ప్రభోదని, చమారీ ఆటపట్టు తలో మూడు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. కవిష దిల్హరి ఓ వికెట్ తీసింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఫాతిమా సనా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. నిదా దార్ (23), మునీబా అలీ (11), సిద్రా అమిన్ (12), ఒమైమా సొహైల్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. గుల్ ఫెరోజా (2), తుబా హసన్ (5), అలియా రియాజ్ (0), డయానా బేగ్ (2), సదియా ఇక్బాల్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
ఇదిలా ఉంటే, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చదవండి: బంగ్లాదేశ్‌తో తొలి టీ20.. తెలుగు కుర్రాడికి అవకాశం లేనట్లే..!
Comments
Please login to add a commentAdd a comment