
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికలపడింది.
బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాక్ విఫలమైంది. ఈ క్రమంలో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం గుప్పించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదని ఆక్మల్ జోస్యం చెప్పాడు.
"ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు ఆడే ఆర్హత లేదు. ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో పాక్ జట్టు పాల్గోవాలి. కనీసం వారిపైనా విజయం సాధిస్తే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆర్హత ఉందని భావించవచ్చు. గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో న్యూజిలాండ్‌ను చూసి నేర్చుకోవాలి.
ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. కివీస్ బ్యాటర్లు సెటిల్ అయ్యాక మళ్లీ ఎదురుదాడికి దిగారు. పరిణితి చెందిన జట్టు చేసే పని అదే. కివీస్ లాంటి టాప్ క్లాస్‌కు జట్టుకు ఎల్లప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. రచిన్ రవీంద్ర గాయపడగా.. అతడి స్ధానంలో వచ్చిన విల్ యంగ్ సెంచరీతో మెరిశాడు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నాడు.
కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీలో కమ్‌బ్యాక్ ఇవ్వాలని పాక్ భావిస్తోంది. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.
తుది జట్లు(అంచనా)
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
చదవండి: భారత్‌తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment