పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్-2023 నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టం చేశాడు.
తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ తాజాగా స్పందించారు.
ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా
ఏఆర్‌వై న్యూస్‌తో కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు.
ఒకవేళ ఆసియా కప్-2023 గనుక పాకిస్తాన్‌లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్ ఆడదు. ఆసియా కప్ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌లో పాక్ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు.
ఒప్పుకొనే ప్రసక్తే లేదు
ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్- పాక్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే..
Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment