Younis Khan
-
కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్
పాకిస్తాన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి పాక్‌కు ఏదీ కలిసిరావడం లేదు. వన్డే వరల్డ్‌కప్ లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన బాబర్ సేన.. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది.అదేవిధంగా గత నెలలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సైతం పాక్ ఘోర పరాభవం పొందింది. తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో తొలిసారి బంగ్లాపై టెస్టు సిరీస్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటుంది. సొంత జట్టు మాజీ ఆటగాళ్లే పాక్ టీమ్‌ను టార్గెట్ చేశారు. తాజాగా ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ చేరాడు. ప్రస్తుతం బాబర్ ఆజం వంటి టాప్ పాక్ ఆటగాళ్లు జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని యూనిస్ మండిపడ్డాడు."బాబర్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణిస్తే మెరుగైన ఫలితాలు వాటింతట అవే వస్తాయి. కానీ మన ప్లేయర్స్ ఆట కంటే అనవసర విషయాలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. నేను అన్ని చూశాకే ఇలా మాట్లాడుతున్నాను.బాబర్ కచ్చితంగా విరాట్ కోహ్లి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. విరాట్ తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందకు భారత కెప్టెన్సీ వదులుకున్నాడు. ఆ తర్వాత అతడు ఎన్నో వరల్డ్ రికార్డులను బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా ఉంటేనే దేశం కోసం ఆడనిట్లు కాదు, ఒక ప్లేయర్‌గా కూడా మన దేశానికి మంచి పేరును తీసుకు రావచ్చు. బాబర్‌కు నేను ఓ సలహా ఇవ్వాలనకుంటున్నాను.బాబర్ ప్రస్తుతం తన ఆటపై దృష్టి పెట్టాలి. అతడు తన ఆట తీరును మెరుగుపరుచుకోవాలి. అనవసర విషయాలపై దృష్టిపెట్టకూడదు. తనపై భారీ అంచనాలు ఉన్నందున ప్రతిచోటా రాణించాలి.అతడు తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమధానం చెప్పాలి. అంతే తప్ప సోషల్ మీడియాలో కాదు. ఆజం ఫిట్నెస్ మెరుగు పరుచుకోవాలి అని క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనిస్ పేర్కొన్నాడు.చదవండి: ‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’ -
పాకిస్తాన్‌కు టీమిండియా రావాలి.. ఆ బాధ్యత అతడిదే: యూనిస్ ఖాన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ఆతిథ్యమిచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఇప్పటికే తమ స్టేడియాల పునర్నిర్మాణ పనులను కూడా పీసీబీ ప్రారంభించింది. కాగా 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్తాన్‌కు ఆతిథ్యమివ్వనుంది.పాక్‌లో చివరగా 1996లో ఐసీసీ టోర్నీ(వన్డే వరల్డ్‌కప్) జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని పీసీబీ ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఈవెంట్లో పాల్గోనేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. భారత్ ఆడే మ్యాచ్‌లను తాత్కాలిక వేదికగా నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుంటే.. పీసీబీ మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశానికి రావల్సిందే అని మొండి పట్టుతో ఉంది. కాగా ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అన్నది తేల్చాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఐసిసి ఛైర్మన్ జై షాపై పడింది.ఆ బాధ్యత అతడిదే..ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టును పాకిస్తాన్‌కు పంపే బాధ్యతను జైషా తీసుకోవాలని యూనిస్ సూచించాడు. "ఐసీసీ చీఫ్‌గా జై షా నియామకంతో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వచ్చేవిధంగా జై షా చొరవ తీసుకోవాలి. అతడు క్రీడా స్ఫూర్తిని చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు పాక్ జట్టు కూడా ఆడేందుకు భారత్‌కు వస్తుంది" అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీకి సంబంధించి డ్రాప్ట్ షెడ్యూల్‌ను కూడా ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు పంపించింది. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 19, 2025న పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.చదవండి: మళ్లీ స్కూల్‌కు వెళ్తా.. విండీస్ టూర్లో కూడా చదువుకున్నా: సఫారీ బౌలర్ -
విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌లో సెంచరీలు కొట్టాలి: యూనిస్ ఖాన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని యూనిస్ విజ్ఞప్తి చేశాడు. పాక్ అభిమానులంతా విరాట్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. పాక్‌కు వచ్చి సెంచరీలు చేయడం ఒక్కటే విరాట్ కెరీర్లో లోటుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. విరాట్‌కు పాక్‌లో చాలామంది అభిమానులున్నారని తెలిపాడు.కాగా, యూనిస్ ఖాన్ లాగే చాలా మంది మాజీలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీసీసీఐకు సంబంధించిన కొందరు వ్యక్తులు అందిస్తున్న సమాచారం మేరకు భారత ప్రభుత్వం టీమిండియా పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీని కోరినట్లు సమాచారం. భారత్ అభ్యర్దనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని పీసీబీ వస్తే రాండీ.. పోతే పోండీ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఐసీసీ సమావేశంలో కూడా పాక్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అంశాన్ని పాక్ ఐసీసీకి వదిలిపెట్టినట్లు సమాచారం. టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉండటంతో ఈ విషయంపై మున్ముందు మరిన్ని చర్చలకు ఆస్కారం ఉంది. క్రికెట్‌ను అభిమానించే నిజమైన భారతీయులు మాత్రం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. కాగా, ముంబై దాడుల ఘటన అనంతరం టీమిండియా పాకిస్తాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ఈ మధ్యలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్‌లు ఎదురెదురుపడ్డాయి. ఇటీవలికాలంలో భారత్, పాక్ తలపడినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మంచి సఖ్యత ఉన్నట్లు కనిపించింది. పాక్ జట్టులోని కొందరు విరాట్, రోహిత్ శర్మలతో కలిసి మెలిసి తిరిగారు. బాబర్, రిజ్వాన్ లాంటి పాక్ స్టార్లు పలు సందర్భాల్లో విరాట్, రోహిత్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తంగా చూస్తే.. భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య సహృదయ వాతావరణం ఉన్నట్లే కనిపిస్తుంది. మరి టీమిండియా ఈసారైనా పాక్‌లో పర్యటిస్తుందో లేదో వేచి చూడాలి. -
WCL 2024: భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు సర్వం సిద్దం.. సీట్లన్నీ ఫుల్
వరల్డ్ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధిలు సిద్దమయ్యారు.అయితే ఈసారి ఇరు దేశాల మాజీ క్రికెటర్ల వంతు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా జూలై 6 (శనివారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న ఇరు జట్లు ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.సీట్లు ఫుల్..ఇక దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. మొత్తం 23000 సీట్లు అమ్ముడు పోయినట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన ఏ మ్యాచ్ టిక్కట్లకు అంత డిమాండ్ లేదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్‌కేకుల్లా సేల్ అయిపోయాయి.చాలా సంతోషంగా ఉంది: యూనిస్ ఖాన్ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. "ఈ టోర్నీలో భారత్‌తో తలపడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము.అంతేకాకుండా మళ్లీ ఛానళ్ల తర్వాత భారత్‌తో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మేము అన్ని విధాలగా సిద్దమయ్యాము. ఎందుకంటే ఇది ఒక గేమ్ మాత్రమే కాదు.. మా దేశానికి సంబంధించిన గౌరవమని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. -
రాణించిన యూనిస్ ఖాన్, మిస్బా.. ఆసీస్‌పై పాక్ విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రాణించిన ఫించ్టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కౌల్టర్ నైల్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. బెన్ డంక్ (27), ఫెర్గూసన్ (26 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సోహైల్ తన్వీర్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్ తలో వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన మిస్బా, యూనిస్190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కెప్టెన్ యూనిస్ ఖాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్బా ఉల్ హక్ (30 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో షోయబ్ మక్సూద్ (21), షోయబ్ మాలిక్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, కౌల్టర్ నైల్ చెరో 2 వికెట్లు.. జేవియర్ దోహర్తి ఓ వికెట్ పడగొట్టారు. -
Ind Vs Pak: ‘అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’
T20 World Cup 2022- India Vs Pakistan- October 23: ఆసియా కప్-2023 నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని పాక్ వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, జై షా మాత్రం ఈ ఈవెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టం చేశాడు. తటస్థ వేదికపైనే నిర్వహిస్తామని పేర్కొన్నాడు. జై షా వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ.. ఏసీసీ అధ్యక్షుడి తీరు తమను నిరాశకు గురిచేసిందంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, యూనిస్ ఖాన్ తాజాగా స్పందించారు. ఏ ఐసీసీ ఈవెంట్లోనూ ఆడదు.. అక్టోబరు 23న కూడా ఏఆర్వై న్యూస్‌తో కమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘జై షా నుంచి ఈ ప్రకటన ఊహించలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆయన మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. అయితే, కేవలం రాజకీయాలకే ఆయన పరిమితం అయినట్లు అనిపిస్తోంది. క్రీడల్లోకి రాజకీయాలను లాగాల్సిన పనిలేదు. ఒకవేళ ఆసియా కప్-2023 గనుక పాకిస్తాన్లో జరుగకపోతే.. ఇండియాతో ఇకపై పాక్ ఆడబోదు. ఐసీసీ ఈవెంట్లు అయినా సరే ఇండియాతో మ్యాచ్ ఆడదు. ఆసియా కప్ వరకు ఆగాల్సిన పనిలేదు.. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌లో పాక్ ఇండియాతో ఆడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఒప్పుకొనే ప్రసక్తే లేదు ఇక యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘పాకిస్తాన్‌కు రావొద్దన్న నిర్ణయానికే బీసీసీఐ గనుక కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ కూడా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కోసం ఇండియాకు ఎళ్లదు. అంతేకాదు తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహణకు కూడా అంగీకరించదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న భారత్- పాక్ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక పీసీబీ, పాక్ మాజీ ప్లేయర్ల వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా ఫ్యాన్స్.. ‘‘తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు. ఇండియాతో ఆడకపోతే నష్టపోయేది పాక్ జట్టే!’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Rishabh Pant: అలీ బౌలింగ్‌లో ఒంటిచేత్తో వరుసగా రెండు సిక్స్‌లు.. పాక్‌తో మ్యాచ్ అంటేనే.. Predicted Playing XI: పాక్‌తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెప్పకుండానే నిర్ణయాలు.. రాజీనామా చేసిన యూనిస్‌ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముసలం మొదలైనట్లు కనబడుతోంది. జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జట్టు ప్రధాన బ్యాటింగ్ కోచ్ పదవికి దిగ్గజ ఆటగాడు యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. అయితే, కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశాడు. పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో యూనిస్ ఖాన్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు ఇంగ్లండ్, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూనిస్ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాక్‌కు పెద్ద లోటేనని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ వెల్లడించారు. కాగా, యూనిస్ ఖాన్ పాక్ తరఫున 118 టెస్ట్‌లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 41 సెంచరీలు, 81 అర్ధసెంచరీల సాయంతో దాదాపు 18000 పరుగులను సాధించాడు. యూనిస్ ఖాన్ ఖాతాలో ఓ ట్రిపుల్ హండ్రెడ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే, పాక్ జట్టు.. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. జూలై 20 వరకు సాగే ఈ పర్యటనలో పాక్, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం పాక్ అక్కడి నంచే నేరుగా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరుతుంది. జూలై 21 నుంచి ఆగస్టు 24 వరకు సాగే ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా! -
Younis Khan: కుంబ్లే బౌలింగ్‌లో డకౌట్.. మొయిన్ భాయ్ తిట్టాడు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యూనిస్ ఖాన్. ముఖ్యంగా టెస్టు జట్టు మిడిలార్డర్ గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. సంప్రదాయ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతడు... వన్డేల్లో 7 వేల పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన యూనిస్ ఖాన్... ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అతడి శిక్షణలోని పాక్ గత కొన్ని నెలలుగా మంచి విజయాలు నమోదు చేస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా, జింబాబ్వేల్లో పర్యటించిన పాక్ జట్టు ఆ దేశాలను ఓడించి వరుస సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇలా ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్న యూనిస్ ఖాన్.. కెరీర్ ఆరంభంలో మాత్రం బాగా తిట్లు తిన్నాడట. మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అతడికి చివాట్లు పెట్టాడట. ఈ విషయాల గురించి యూనిస్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ... ‘‘నాకు గుర్తుంది. మొయిన్ ఖాన్ సారథ్యంలోనే నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాను. అయితే, భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేను డకౌట్‌గా వెనుదిరగటంతో భాయ్ నన్ను బాగా తిట్టాడు. తనకు చాలా కోపం వచ్చింది. ఏదేమైనా తనకు ధన్యవాదాలు చెప్పాలి. నిజానికి తన కారణంగానే నా తప్పులు సరిదిద్దుకోగలిగాను. ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. అంతర్జాతీయ క్రికెట్లో నా విజయం వెనుక భాయ్ పాత్ర మరువలేనిది’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. కాగా 2000 సంవత్సరం మార్చిలో షార్జాలో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో యూనిస్ డకౌట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా 5 వికెట్ల తేడాతో దాయాది జట్టుపై ఘన విజయం సాధించింది. మహ్మద్ అజారుద్దీన్(54 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా యూఏఈఓలో నిర్వహించిన కోకా కోలా కప్ మక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. చదవండి: Viral: సిగ్గు పడాలి.. ఇలాగేనా పోరాడేది: భజ్జీ Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! -
యూనిస్ సరదాగా చేశాడు
కరాచీ: యూనిస్‌ఖాన్ తన పీకపై కత్తి పెట్టాడంటూ పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది. అయితే ఫ్లవర్ ఆరోపించినట్లుగా యూనిస్‌ఖాన్ కోపంతో అతని గొంతుపై కత్తి పెట్టలేదని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘గ్రాంట్ ప్రచారం చేస్తున్నట్లుగా అతన్ని గాయపరచడం యూనిస్‌ఖాన్ ఉద్దేశం కాదు. అందులో నిజం లేదు. యూనిస్ అల్పాహారం తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. అతను బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న సమయంలో గ్రాంట్ ఏదో చెప్పబోతుండగా... యూనిస్ సరదాగా బటర్ తీసుకునే కత్తితో అతన్ని ఆపాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై ఆట గురించిన సలహాలు ఎందుకు? నన్ను ముందు ప్రశాంతంగా తిననివ్వండంటూ గ్రాంట్‌తో యూనిస్ అన్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గ్రాంట్ ఆరోపణలపై స్పందించేందుకు యూనిస్‌ఖాన్ సుముఖంగా లేడని అన్నారు. -
యూనిస్ జోక్ చేస్తే.. సీరియస్ వ్యాఖ్యలా?
మాంచెస్టర్: తన పీకపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ కత్తి పెట్టి బెదిరించాడంటూ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో కలకలం రేపాయి. తాను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో యూనిస్ ఖాన్ కత్తితో బెదిరింపులకు దిగాడంటూ ఫ్లవర్ చేసిన కామెంట్స్‌ను పీసీబీతో పాటు పాక్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఖండించింది. ‘ గ్రాంట్ ఫ్లవర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం వాస్తవం కాదు. యూనిస్ ఖాన్ ఏదో సరదాగా కూరగాయాలు తరిగే కత్తి తీసుకుని గ్రాంట్ ఫ్లవర్‌ను ఆట పట్టించాడు. (రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?) బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర సలహాలు ఎందుకు అని యూనిస్ అలా చేసి ఉండవచ్చు. అంతేకానీ కావాలని బెదిరింపులకు దిగలేదు’ అని పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. మరొకవైపు పాక్ జట్టుతో పని చేసిన కోచ్‌లు కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఒకసారి తమ కాంట్రాక్ట్‌లు ముగిసిపోయిన తర్వాత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా బహిర్గతం చేయడాన్ని పీసీబీ తప్పుబట్టింది. ఇది వారికి తగదంటూ హితవు పలికింది. ఒక జట్టుకు కోచ్‌గా పని చేసి వెళ్లిపోయినప్పుడు ఎందుకు కొన్ని అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పీసీబీలో ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్‌కు యూనిస్ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని గ్రాంట్ ఫ్లవర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు తరఫున బ్యాటింగ్ కోచ్‌గా ఉండగా ఆసీస్ పర్యటనలో ఇది జరిగిందన్నాడు. బ్యాటింగ్‌లో సలహా ఇస్తుండగా ఏకంగా పీకపై కత్తి పెట్టాశాడని, ఇది నచ్చకే ఇలా చేసి ఉండవచ్చన్నాడు. ఈ ఘటనతో తాను షాక్‌కు గురైనట్లు ఫ్లవర్ తెలిపాడు. ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ కలగజేసుకుని సముదాయించడన్నాడు. ఇది 2016 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన విషయాన్ని ఫ్లవర్ తెలిపాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు నెలలో ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌తోపాటు మూడు టీ20ల సిరీస్ జరుగనుంది. దీనికి పాక్ బ్యాటింగ్ కోచ్‌గా చేయడానికి యూనిస్ ఖాన్ గతనెల్లో పీసీబీతో ఒప్పందం చేసుకున్నాడు.(యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్) -
యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్
న్యూఢిల్లీ: పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ‘పాక్ జట్టు తరఫున ఆసీస్ పర్యటనలో ఉండగా ఓ సంఘటన నన్ను బాగా కలవరపెట్టింది. బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా నేను యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్ కలగజేసుకొని సముదాయించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా ఖిన్నుడినయ్యా. కానీ కోచ్‌గా ఇదంతా నా ప్రయాణంలో భాగమే అనుకొని సరిపెట్టుకున్నాను’ అని అన్నాడు. జింబాబ్వేకు చెందిన ఫ్లవర్‌కు 2016లో కంగారూ టూర్లో ఈ అనుభవం ఎదురైంది. ఇతను 2015 నుంచి 2019 వరకు పాక్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. దీనిపై 42 ఏళ్ల మాజీ కెప్టెన్ యూనిస్ స్పందించలేదు. -
‘ఐదేళ్లలో కింగ్ కోహ్లి స్థానం అతడిదే’
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్‌ను టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లితో పోల్చడాన్ని పాక్ బ్యాటింగ్ కోచ్ యునిస్ ఖాన్ తప్పుపట్టాడు. వీరిద్దరూ అండర్-19 జట్లకు సారథ్యం వహించడం, ప్రస్తుతం జాతీయ జట్లకు సైతం నాయకత్వం వహిస్తున్న విషయాలను అభిమానులు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ శైలి, నిలకడైన బ్యాటింగ్ తీరు, రికార్డులు.. ఇలా పలు విషయాలను తెరపైకి తీసుకొచ్చి ఇద్దరినీ పోల్చుతున్నారు. అయితే ఈ పోలికపై యూనిస్ ఖాన్ తాజాగా స్పందించాడు. (ఆ ఇద్దరిని ఔట్ చేయాలి.. ఎలా అంపైర్?) ‘ఇలా పోల్చడం సరైనది కాదు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందకుంటే అతడి సాధించిన రికార్డులు, పరుగులు చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బాబర్ విషయానికి వస్తే అన్ని ఫార్మట్లలో నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే కోహ్లి ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో ఐదేళ్లలో బాబర్ అజామ్ ఆ స్థానానికి కచ్చితంగా చేరుకుంటాడు’ అని యునిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక పాక్ తరుపున టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా యూనిస్ నిలిచిని విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’) -
కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్ క్రికెట్లోని మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు ఏదొక సరికొత్త వివాదాన్ని తెరపైకి తెస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పాకిసాన్ మాజీ పేసర్ రాణా నవీద్.. సంచలన ఆరోపణలు చేశాడు. దాదాపు 11 ఏళ్ల నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ అప్పుడు తమ క్రికెటర్లు ఎలా తిరుగుబాటు చేశారో చెప్పుకొచ్చాడు. 2009లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ జరిగిన క్రమంలో తమ జట్టులోని పలువురి ఆటగాళ్లు కావాలనే మ్యాచ్‌లు ఓడిపోయారన్నాడు. తాము తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించి గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేలను కోల్పోయామన్నాడు. అందుకు ఆనాడు కెప్టెన్‌గా ఉన్నయూనిస్ ఖానే కారణమన్నాడు. ‘ ఆ సమయంలో యూఏఈ వేదికగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మేము 1-2తో కోల్పోయాం. (‘పాక్ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’) ఇక్కడ తొలి వన్డేలో గెలిచి ఆధిక్యంలో నిలిచినా మిగిలిన రెండు వన్డేల్లో పరాజయం చెంది సిరీస్‌ను సమర్పించుకున్నాం. ఆ సిరీస్‌లో కుట్ర జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను దూరంగా ఉన్నా. నీపై కుట్ర జరుగుతుందనే విషయాన్ని యూనిస్‌కు చెప్పా. కానీ నన్ను కూడా కుట్రలో భాగం కావాలని పట్టుబట్టారు. ఇందుకు కారణం యూనిస్ ఖాన్ కెప్టెన్సీనే. వ్యక్తిగా యూనిస్ ఖాన్‌పై మా సీనియర్ క్రికెటర్లకు ఎవరికీ వ్యతిరేకత లేకపోయినా, కెప్టెన్‌గా అతని వైఖరి నచ్చలేదు. కెప్టెన్ అయిన తర్వాత యూనిస్ మొత్తం మారిపోయాడు. అతని వ్యక్తిత్వం,నడవడిక పూర్తిగా మారిపోయాయి. దీనిపై కొంతమంది ఆటగాళ్లు ఫిర్యాదు కూడా చేశారు. అనవసరంగా యూనిస్ తిడుతున్నాడని వాపోయారు. ఇదే మా ఆటగాళ్ల ఆనాటి తిరుగుబాటుకు కారణం’ అని రాణా నవీద్ చెప్పుకొచ్చాడు. ఆనాటి సిరీస్‌లో మహ్మద్ యూసఫ్, షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్,కమ్రాన్ అక్మల్, సయాద్ అజ్మల్‌లు సీనియర్ క్రికెటర్లుగా ఉన్నారు. ఇక పాకిస్తాన్ తరఫున 9 టెస్టులు, 74 వన్డేలు, 4 టీ20ల్లో నవీద్ ప్రాతినిథ్యం వహించాడు. (విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్) -
చిక్కుల్లో పడ్డ అక్తర్‌కు మాజీ క్రికెటర్ సపోర్ట్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) లీగల్ డిపార్ట్‌మెంట్‌పై సంచలన కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డ ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు మాజీ క్రికెటర్ అండగా నిలిచాడు. అక్తర్ చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటు తప్పూ లేదని అందుకు తాను కూడా మద్దతు ఇస్తున్నానని యూనిస్ ఖాన్ ముందుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్‌ను విశ్లేషించడానికి ఇదే సరైన సమయమని యూనిస్ పేర్కొన్నాడు. ‘ అక్తర్ మాట్లాడింది చేదు నిజం. అతని వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పుల్లేదు. రాజీ పడకుండా ఉండటానికి అక్తర్ వ్యాఖ్యలే నిదర్శనం. అక్తర్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇకనైనా విశ్లేషణ ఆరంభించాలి. పాకిస్తాన్ క్రికెటర్ల భవిష్యత్తు, దేశ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నేను అక్తర్‌కు అండగా ఉంటా’ అని యూనిస్ పేర్కొన్నాడు. (అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) కేవలం బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పలేదని ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం సమంజసం కాదని అక్తర్ ప్రశ్నించాడు. అవినీతి క్రికెటర్లపై ఏదో చర్యలను తీసుకుంటున్నామని బిల్డప్ ఇచ్చేందుకు, కొంతమంది అవినీతి క్రికెటర్లను కాపాడటానికే ఉమర్ కెరీర్‌ను పణంగా పెట్టారంటూ ధ్వజమెత్తాడు. ఈ విషయంలో పీసీబీ లీగల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. మీకు నచ్చిన మ్యాచ్ ఫిక్సర్లను రక్క్షించడానికి మరి కొంతమందిపై ఇలాంటి చర్యలు తీసుకుంటారా అంటూ నిలదీశాడు. ఒక చిన్నపాటి తప్పు చేస్తే అందుకు ఆరు నెలలో రెండు సంవత్సరాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని, కెరీర్ నాశనం అయిపోయేలా మూడేళ్ల నిషేధం ఎందుకోసం, ఎవరి కోసం అంటూ విమర్శించాడు. పీసీబీ లీగల్ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై తన యూట్యూబ్ చానల్ వీడియోను విడుదల చేసి మరీ పీసీబీ చర్యలను ప్రశ్నించాడు. దాంతో పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్ అక్తర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి సిద్ధమైంది. తమ లీగల్ వ్యవహారాల్లో తలదూర్చి అక్తర్ తప్పుచేశాడంటూ పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజ్జుల్ రిజ్వి పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. న్యాయపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు అక్తర్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యానిస్తే మంచిదనే సలహా ఇచ్చారు. దీనిపై పీసీబీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు అక్తర్ బహిరంగంగా పీసీబీ లీగల్ డిపార్ట్మెంట్తో పాటు తమ అడ్వైజరీపై ఇలా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది అక్తర్‌కు సరికాదని మండిపడింది.(అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్) -
‘కోహ్లి అంటే పాక్‌లో పిచ్చి అభిమానం’
లండన్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి అంటేనే రికార్డుల రారాజు. ఇప్పటికే ఎన్నో రికార్డుల, అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే దాయాది పాకిస్తాన్లో కోహ్లి అంటే పడి చచ్చిపోతారని ఆ జట్టు మాజీ సారథి యునిస్ ఖాన్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లో నిర్వహించిన సలాం క్రికెట్ 2019లో పాల్గొన్న యునిస్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పాక్ ప్రజలు విరాట్ కోహ్లి అంటే అమితంగా ప్రేమిస్తారు. మా దేశంలోని ప్రస్తుత యువత అతడిలా బ్యాటింగ్ చేయాలని, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో టీమిండియా పరుగుల యంత్రం ఆడకపోవడం పట్ల మా దేశ క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. కోహ్లి ఆసియా కప్‌లో పాల్గొని ఉంటే స్టేడియం దద్దరిల్లి పోయేది. ప్రపంచకప్‌లో టీమిండియాకు కోహ్లినే కీలకం. అతడి రాణింపుపైనే ఆ జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి’అంటూ పాక్ మాజీ సారథి యునిస్ ఖాన్ పేర్కొన్నాడు. భారత బ్యాట్స్‌మెన్ అంటే నాకు ఇష్టం ఇకే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివి రిచర్డ్స్ టీమిండియా ఆటగాళ్లను కొనియాడాడు. ‘నాకు భారత బ్యాట్స్‌మెన్ అంటే చాలా ఇష్టం. వారిలో ఎలాంటి గర్వం, పొగరు ఉండదు. వారిలో ఆటపై ఇష్టం, శ్రధ్ద మాత్రమే కనిపిస్తుంది. ఇక విరాట్ కోహ్లిలో గెలవాలనే కసి నాకు బాగా నచ్చింది. ఏ ఆటగాడయినా గెలవాలనే కోరుకుంటాడు. కానీ కోహ్లిలో ఆ గుణం కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలలో గెలవాలనే పట్టుదల ఇంకా ఎక్కువగా ఉండాలి. కోహ్లినే టీమిండియా బలం’అంటూ రిచర్డ్స్ వ్యాఖ్యానించాడు. -
ఆ షాట్ ను అతని నుంచే నేర్చుకున్నా:ఏబీ
లండన్:ప్రస్తుతమున్న విధ్వంసకర క్రికెటర్లలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించడంతో పాటు అనేక రకాల షాట్లను ఆడటంలో ఏబీ సిద్ధహస్తుడు. స్వీప్, రివర్స్ స్వీప్, అప్పర్ కట్, రివర్స్ స్కూప్ ఇలా ఏ షాట్ నైనా ఏబీ చాలా ఈజీగా ఆడగలడు. అయితే స్వీప్ షాట్ ను ఆడటాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ నుంచి ఏబీ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని ఏబీనే స్వయంగా వెల్లడించాడు. 'నెమ్మదిగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్ట్రైయిట్ గా ఆడితే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లే ఆస్కారం ఎక్కువ. అందుకు నేను ఇష్టపడను. అలాంటి బంతిని స్వీప్ షాట్ ద్వారా బౌండరీకి తరలించేందుకు యత్నిస్తా. ఆ షాట్ ను నేర్చుకున్నది యూనిస్ ఖాన్ నుంచి అనే కచ్చితంగా చెప్పగలను. యూనిస్ ఆ షాట్ ఆడే విధానం బాగుంటుంది. అతని వద్ద నుంచి స్వీప్ షాట్ ను ఆడటం నేర్చుకున్నా'అని ఏబీ పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యలపై యూనిస్ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్ల ఆట తీరును పరిశీలించడం సాధారణంగా జరుగుతూ ఉంటుందని యూనిస్ అన్నాడు. అసలు స్వీప్ షాట్లు ఆడటానికి చాలా ధైర్యం కావాలన్నాడు. ఆ షాట్లు ఆడేటప్పుడు అవుటైతే మనకు విమర్శలు కూడా తప్పవన్నాడు. తాను టెస్టుల్లో పదివేల పరుగుల మార్కును చేరేటప్పుడు కూడా స్వీప్ షాట్ నే ఆడినట్లు యూనిస్ తెలిపాడు. మరొకవైపు తాను కూడా డివిలియర్స్ నుంచి కొన్ని షాట్లు ఆడటాన్ని నేర్చుకున్నట్లు యూనిస్ తెలిపాడు. -
'ఇక్కడ 400 టార్గెట్ కూడా ఈజీనే'
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఓడించే సత్తా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉందని అంటున్నాడు ఆ దేశ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్.ఇటీవల క్రికెట్ గుడ్ బై చెప్పిన యూనిస్ ఖాన్.. తమ జట్టు ప్రదర్శనకు సంబంధించి అపారమైన విశ్వాసం వ్యక్తం చేశాడు. 'చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై ఉన్న మెరుగైన రికార్డును కొనసాగిస్తాం. గతంలో భారత్ ను పలుసార్లు ఓడించాం.సర్ఫరాజ్ ఖాన్ నేతృత్వంలోని పాక్ మరోసారి భారత్ ను ఓడిస్తుంది' అని యూనిస్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లోని పిచ్‌లు చాలా బాగున్నాయంటూ కితాబు ఇచ్చాడు. బ్యాటింగ్ కు అనుకూలించే ఈ తరహా పిచ్‌లపై ఎంతటి లక్ష్యమైనా సునాయాసమేనని యూనిస్ పేర్కొన్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 400 టార్గెట్ ను నిర్దేశించినా ఈజీగా ఛేదించవచ్చన్నాడు. వన్డే, ట్వంటీ 20ల్లో విజయాలు సాధించాలంటే ఫీల్డింగ్ అనేది చాలా కీలకమన్నాడు. ఈ ఆధునిక క్రికెట్ లో ఫీల్డింగ్ లో మెరుగ్గా ఉన్న జట్టునే విజయాలు వరిస్తాయని యూనిస్ అభిప్రాయపడ్డాడు. -
యువీ హార్ట్ టచింగ్ మెసేజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్‌లపై టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌కు వీరిద్దరూ అందించిన సేవలను కొనియాడాడు. మిస్బా, యూనిస్‌లను స్ఫూర్తిప్రదాతలుగా వర్ణించాడు. ‘పాకిస్తాన్ క్రికెట్‌కు చెందిన ఇద్దరు గొప్ప బ్యాట్స్మన్లు ఆటకు వీడ్కోలు పలికారు. మిస్బా, యూనిస్ ఖాన్ క్రికెట్‌కు అందించిన సేవలు మా అందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చాయ’ని యువీ ట్వీట్ చేశాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ రిటైర్మెంట్ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదని మిస్బా స్పష్టం చేశాడు. మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. Good bye two greats of Pakistan cricket @captainmisbahpk and younis khan your contribution towards the game was inspiring to all of us 👏🏽 — yuvraj singh (@YUVSTRONG12) May 15, 2017 -
విజయంతో వీడ్కోలు
►చివరి టెస్టులో పాక్ విజయం ►ఆటకు మిస్బా, యూనిస్ టాటా ►విండీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ సొంతం రొసియూ (డొమినికా): ఒక్క బంతి... ఒకే ఒక్క బంతి... ఉత్కంఠకు తెరదించింది. చివరి వరుస బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేసింది. ఓ జట్టును చివరి టెస్టులో గెలిపించింది. 1–1తో సమమయ్యే సిరీస్‌ను 2–1తో మురిపించింది. ...ఆ బంతి యాసిర్ షాది. ఈ విజయం పాకిస్తాన్‌ది. అంతేకాదు... పాక్ వెటరన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్లకు ఘనమైన వీడ్కోలు పలికింది. పాక్ బౌలర్ యాసిర్ షా చివరి బంతి వేసేందుకు సిద్ధమయ్యాడు. ఐదో రోజు ముగిసేందుకు... అతని తర్వాత మరో ఓవర్ మాత్రమే మిగిలుంది. ఈ ఏడు బంతులాడితే వెస్టిండీస్ చివరి టెస్టును డ్రా చేసుకుంటుంది. మూడు టెస్టుల సిరీస్ 1–1తో డ్రా అవుతుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ మధ్య యాసిర్ బంతి వేశాడు. క్రీజులో ఉన్న గాబ్రియెల్ (4) వైడ్‌గా వెళుతున్న దాన్ని వికెట్లపై ఆడుకున్నాడు. అతని బ్యాట్ అంచును తాకుతూ బంతి వికెట్లకు తగిలింది. అంతే గాబ్రియెల్ బౌల్డ్! ఇక ‘డ్రా’ తప్పదేమో... అనుకునే దశలో అనూహ్య మలుపు పాక్‌ను గెలుపు వైపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో పాక్ 101 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో వెస్టిండీస్ గడ్డపై పాక్ తొలిసారి సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 304 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ చివరి రోజు 96 ఓవర్లలో 202 పరుగుల వద్ద ఆలౌటైంది. కడదాకా మొండిగా పోరాడిన చేజ్ (239 బంతుల్లో 101 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించిన మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సంక్షిప్త స్కోర్లు: పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 376; వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 247; పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్: 174/8; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (96 ఓవర్లలో) (చేజ్ 101 నాటౌట్, హెట్మెయిర్ 25, హోల్డర్ 22; యాసిర్ షా 5/92, హసన్ అలీ 3/33). అన్ని రకాల క్రికెట్‌ను ఆడేశాను. ఏ జట్టుకు ఆడినా... నూటికి 200 శాతం అంకితభావంతో ఆడా. నా లైఫ్‌లో నేను 27, 28 ఏళ్లు క్రికెట్‌కే వెచ్చించానని భావిస్తున్నా. ఇక మళ్లీ రిటైర్మెంట్ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదు. –యూనిస్ ఖాన్ నా కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే... నేను చేయగలిగిన దానికంటే కొంచెం ఎక్కువే చేశానన్న అనుభూతి ఉంది. జట్టు కోసం నా శక్తిమేర పోరాడాను. సారథిగా నడిపించాను. ఉన్న వనరులతో, గడ్డు పరిస్థితుల్లో సాధించిన విజయాలతో సంతృప్తిగా ఉంది. –మిస్బా ఉల్ హక్ -
యూనిస్ @ 10,000
►పది వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్‌మన్ ►ఈ ఘనత సాధించిన తొలి పాక్ క్రికెటర్ కింగ్స్టన్: పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు సాధించిన 13వ క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడు యూనిస్ కావడం విశేషం. వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు శనివారం ఛేజ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో అతని పేరు రికార్డు పుస్తకాల్లో నమోదైంది. 116వ టెస్టు ఆడుతున్న యూనిస్, 208వ ఇన్నింగ్స్‌లో పది వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత అందుకునే సమయానికి మిగతా 12 మంది కంటే యూనిస్దే ఎక్కువ వయసు (39 ఏళ్ల 145 రోజులు) కావడం మరో విశేషం. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద అవుటయ్యే సమయానికి యూనిస్ 53.09 సగటుతో 10,035 పరుగులు సాధించాడు. అతని కెరీర్లో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 11 దేశాల్లోనూ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కూడా యూనిస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ఇప్పటికే ప్రకటించాడు. పాకిస్తాన్‌కు ఆధిక్యం...: తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌పై పాక్‌కు ఆధిక్యం లభించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం కడపటి వార్తలందే సమయానికి పాక్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. -
పాక్ క్రికెటర్ అరుదైన ఘనత
జమైకా: పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్ గా ఖ్యాతికెక్కాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో అతడు ఈ రికార్డు లిఖించాడు. 208 ఇన్నింగ్స్ తో ఈ ఘనత సాధించాడు. ప్రపంచ టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు పూర్తి చేసిన 13వ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీనికి ఒకరోజు ముందే రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. వెస్టిండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత తన 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పబోతున్నట్టు తెలిపారు. కెప్టెన్ మిస్సా-వుల్-హక్ కూడా ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్నట్టు ప్రకటించాడు. 39 ఏళ్ల యూనిస్ ఖాన్ ఐసీసీ ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా అతడే. అంతకుముందు జావేద్ మియందాద్ (8832) పేరిట ఉన్న ఈ రికార్డును 2015లో యూనిస్ ఖాన్ కైవసం చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు కలిపి 17284 పరుగులు సాధించాడు. వన్డేల్లో యూనిస్ ఖాతాలో 7249 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ తరపున వన్డేల్లో ఇంజమాముల్ హక్(11739) అత్యధిక పరుగులు సాధించాడు. అత్యధిక టెస్టు పరుగుల వీరులు వీరే 1. సచిన్ టెండూల్కర్(15921) 2. రికీ పాంటింగ్(13378) 3. జాక్వెస్ కలిస్ (13289) 4. రాహుల్ ద్రవిడ్(13288) 5. కుమార సంగక్కర(12400) 6. బ్రియన్ లారా(11953) 7. చంద్రర్పాల్(11867) 8. మహేల జయవర్ధనే(11814) 9. అలెన్ బోర్డర్(11174) 10. అలిస్టర్ కుక్(11057) 11. స్టీవ్ వా(10927) 12. సునీల్ గవాస్కర్(10122) 13. యూనిస్ ఖాన్(10035) -
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో సీనియర్
కరాచీ:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే సిరీస్ అనంతరం క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు యూనిస్ తెలిపాడు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తన రిటైర్మెంట్ పై 40 ఏళ్ల యూనిస్ స్పష్టతనిచ్చాడు. పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న రోజు వ్యవధిలోనే యూనిస్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ప్రస్తుత పాక్ జట్టులో యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్లే సీనియర్ క్రికెటర్లు. యూనిస్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పాక్ సీనియర్ క్రికెటర్ వసీం అక్రమ్ స్వాగతించాడు. 'యూనిస్ ఎప్పుడూ కష్టించే తత్వం ఉన్న క్రికెటర్. క్రికెట్ లో ప్రతీ విషయంలో యూనిస్ చాలా చురుకుగా ఉండేవాడు. జట్టుకు సేవలందించడంలో ఎప్పుడూ ముందుండే ఆటగాడు యూనిస్. అతనంటే నాకు చాలా గౌరవం' అని అక్రమ్ పేర్కొన్నాడు. యూనిస్ తన టెస్టు కెరీర్ లో 115 మ్యాచ్‌లాడి 9,977 పరుగులు చేశాడు. అయితే పది వేల టెస్టు పరుగుల్ని పూర్తి చేసుకునేందుకు యూనిస్ కొద్ది దూరంలో ఉన్నాడు. ఒకవేళ విండీస్ తో టూర్ లో 23 పరుగులు చేస్తే పది వేల పరుగుల్ని పూర్తి చేసిన తొలి పాకిస్తాన్ టెస్టు ఆటగాడిగా యూనిస్ గుర్తింపు పొందుతాడు. ఇటీవల యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన యూనిస్ ఖాన్.. పదకొండు దేశాల్లో శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. టెస్టు హోదా లేని యూఏఈపై సెంచరీ చేసిన ఘనత కూడా యూనిస్ దే. అంతకుముందు 10 టెస్టు హోదా కల్గిన దేశాల్లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు. -
యూనిస్ మిస్సయ్యాడు!
సిడ్నీ: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ అరుదైన ఘనతను సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో్ జరిగిన చివరిదైన మూడో టెస్టులో యూనిస్ ఖాన్ పదివేల టెస్టు పరుగుల క్లబ్లో చేరే అవకాశాన్ని మిస్సయ్యాడు. ఈ మ్యాచ్‌లో మరో 23 పరుగులు చేసి ఉంటే పదివేల పరుగుల క్లబ్ లో యూనిస్ చేరేవాడు. తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగులతో అజేయంగా నిలిచిన యూనిస్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 13 పరుగులను మాత్రమే చేసి అవుటయ్యాడు. దాంతో ఈ సిరీస్‌లో పదివేల టెస్టు పరుగుల్ని సాధించే అవకాశాన్నిస్వల్ప తేడాలో కోల్పోయాడు. ఇప్పటికి 115 టెస్టు మ్యాచ్‌లను ఆడిన యూనిస్ ఖాన్ 9,977 పరుగుల్ని సాధించాడు. ఇప్పటివరకూ పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవ్వరూ 10 వేల టెస్టు పరుగుల క్లబ్లో లేని సంగతి తెలిసిందే. రాబోవు రోజుల్లో యూనిస్ ఖాన్ కు మరికొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కితే ఆ ఘనతను అందుకునే తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలుస్తాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా ఐసీసీ ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా యూనిస్ ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 220 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 244 పరుగులకే పరిమితం కావడంతో ఘోర ఓటమి పాలైంది. దాంతో సిరీస్‌ను పాకిస్తాన్ 0-3 తేడాతో కోల్పోయింది. -
యూనిస్‌ఖాన్ సెంచరీ
పాకిస్తాన్ 271/8 సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ ఫాలో ఆన్ తప్పించుకునేందుకు పోరాడుతోంది. వర్షం కారణంగా దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో మ్యాచ్ మూడో రోజు గురువారం 53 ఓవర్లే సాధ్యమయ్యాయి. ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (279 బంతుల్లో 136 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 126/2తో ఆట ప్రారంభించిన పాక్ ఆరంభంలోనే అజహర్ అలీ (71) వికెట్ కోల్పోయింది. అజహర్, యూనిస్ మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత యూనిస్ ఒంటరి పోరాటం చేయగా, అతనికి మరో ఎండ్‌నుంచి ఏమాత్రం సహకారం లభించలేదు. ఇతర బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. ప్రస్తుతం పాక్ 267 పరుగులు వెనుకబడి ఉండగా, క్రీజ్‌లో యూనిస్‌తో పాటు యాసిర్ షా (5) ఉన్నాడు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ జట్టు మరో 68 పరుగులు చేయాలి. మరో వైపు షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సర్ఫరాజ్ కొట్టిన షాట్ బలంగా తలకు తగలడంతో ఆసీస్ ఆటగాడు మాట్ రెన్షా తలనొప్పితో మైదానం వీడాడు. ఈ టెస్టులో అతని తలకు దెబ్బ తగలడం ఇది రెండో సారి. 1 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా యూనిస్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 10 టెస్టు దేశాలతో పాటు యూఏఈలో కూడా అతను సెంచరీ సాధించాడు. 10 దేశాల్లో శతకం చేసిన రాహుల్ ద్రవిడ్ యూఏఈలో ఎప్పుడూ టెస్టు ఆడలేదు. 6 అత్యధిక టెస్టు సెంచరీల జాబితాలో యూనిస్ ఖాన్ (34), గవాస్కర్, లారా, జయవర్ధనేలతో సమంగా నిలిచాడు. మరో ఐదుగురు మాత్రమే ఇంతకంటే ఎక్కువ శతకాలు సాధించారు. -
యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర
సిడ్నీ:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన యూనిస్ ఖాన్.. పదకొండు దేశాల్లో శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో టెస్టు హోదా లేని యూఏఈలో కూడా యూనిస్ ఖాన్ సెంచరీ చేయడంతో ఆ ఘనతను సాధించాడు. అంతకుముందు 10 టెస్టు హోదా కల్గిన దేశాల్లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు. గురువారం మూడో రోజు ఆటలో భాగంగా 64 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన యూనిస్.. టీ బ్రేక్ తరువాత శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపై వెయ్యి టెస్టు పరుగులను యూనిస్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐదో పాకిస్తానీ ఆటగాడిగా, 81వ ఓవరాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 538/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 244 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. యూనిస్ ఖాన్ సెంచరీకి తోడు, అజర్ అలీ(71) హాఫ్ సెంచరీ చేశాడు.