యూనిస్, మిస్బా సెంచరీలు | Batsmen Younis Khan and Misbah-ul Haq hit hundreds as Pakistan takes control in first Test | Sakshi
Sakshi News home page

యూనిస్, మిస్బా సెంచరీలు

Published Thu, Jan 2 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM

మిస్బావుల్ హక్ ,యూనిస్ ఖాన్

మిస్బావుల్ హక్ ,యూనిస్ ఖాన్

అబుదాబి: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. సీనియర్ ఆటగాళ్లు యూనిస్ ఖాన్ (198 బంతుల్లో 136; 19 ఫోర్లు, 1 సిక్స్), మిస్బావుల్ హక్ (250 బంతుల్లో 105 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ 123 పరుగులు ముందంజలో ఉంది.
 
 యూనిస్, మిస్బా నాలుగో వికెట్‌కు 218 పరుగులు జోడించడం విశేషం. 69 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్‌లో జయవర్ధనే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మిస్బా కెరీర్‌లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 46/1 పరుగులతో ఆట ప్రారంభించిన పాక్ తక్కువ వ్యవధిలోనే హఫీజ్ (11), షహజాద్ (38) వికెట్లు కోల్పోయినా యూనిస్, మిస్బా భాగస్వామ్యంతో కోలుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement