యువీ హార్ట్ టచింగ్ మెసేజ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్స్ మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్‌లపై టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌కు వీరిద్దరూ అందించిన సేవలను కొనియాడాడు. మిస్బా, యూనిస్‌లను స్ఫూర్తిప్రదాతలుగా వర్ణించాడు.
‘పాకిస్తాన్ క్రికెట్‌కు చెందిన ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మన్లు ఆటకు వీడ్కోలు పలికారు. మిస్బా, యూనిస్ ఖాన్ క్రికెట్‌కు అందించిన సేవలు మా అందరికీ ఎంతో ప్రేరణ ఇచ్చాయ’ని యువీ ట్వీట్ చేశాడు.
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ రిటైర్మెంట్‌ను సమీక్షించుకునే అవసరంగానీ, తిరిగి బరిలోకి దిగాలన్న ఆశగానీ లేదని మిస్బా స్పష్టం చేశాడు. మిస్బా 75 టెస్టులు ఆడి 5,222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యూనిస్ 118 టెస్టులు ఆడి 10,099 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Good bye two greats of Pakistan cricket @captainmisbahpk and younis khan your contribution towards the game was inspiring to all of us 👏🏽
— yuvraj singh (@YUVSTRONG12) May 15, 2017