వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధిలు సిద్దమయ్యారు.
అయితే ఈసారి ఇరు దేశాల మాజీ క్రికెటర్ల వంతు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా జూలై 6 (శనివారం) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న ఇరు జట్లు ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.
సీట్లు ఫుల్..
ఇక దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన మొత్తం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడు పోయాయి. మొత్తం 23000 సీట్లు అమ్ముడు పోయినట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన ఏ మ్యాచ్ టిక్కట్లకు అంత డిమాండ్ లేదు. కానీ భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లు మాత్రం హాట్‌కేకుల్లా సేల్ అయిపోయాయి.
చాలా సంతోషంగా ఉంది: యూనిస్ ఖాన్
ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ మీడియాతో మాట్లాడాడు. "ఈ టోర్నీలో భారత్‌తో తలపడేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము.
అంతేకాకుండా మళ్లీ ఛానళ్ల తర్వాత భారత్‌తో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మేము అన్ని విధాలగా సిద్దమయ్యాము. ఎందుకంటే ఇది ఒక గేమ్ మాత్రమే కాదు.. మా దేశానికి సంబంధించిన గౌరవమని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్‌కు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment