వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర ఎడిషన్ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
నాయకుడుగా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా ఆటగాడిగా యువీ రాణించాడు. కీలక సెమీస్‌లో సత్తాచాటి ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. అదేవిధంగా ఫైనల్లో కూడా 12 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ ఫైనల్లో విజయనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
తన అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మాత్రమే యువీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి యువరాజ్ చోటు ఇవ్వకపోవడం అందరని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక యువ ఎంచుకున్న జట్టులో కోహ్లి, రోహిత్, సచిన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లకు చోటు దక్కింది.
యువరాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 13, 2024
Comments
Please login to add a commentAdd a comment