వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.
ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.
రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసం
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.
30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్‌కు వరించింది.
Comments
Please login to add a commentAdd a comment