
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ సంచలన త్రోతో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 9 ఓవర్‌లో బాబర్ ఆజం రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌లోనే ఇమామ్ ఉల్ హక్ దూరదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రెండో బంతికి ఇమామ్ మిడాన్ దిశగా ఆడాడు. షాట్ ఆడిన వెంటనే ఇమామ్ నాన్‌స్టైకర్ ఎండ్‌వైపు సింగిల్ కోసం ప్రయత్నించాడు.
కానీ మిడాన్‌లో ఉన్న అక్షర్ పటేల్ డైరక్ట్‌త్రోతో స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇమామ్ డైవ్ చేసినప్పటికి ఫలితం మాత్రం లేకపోయింది. దీంతో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఇమామ్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
అదేవిధంగా ఓ క్యాచ్‌ను అక్షర్ ఈ మ్యాచ్‌లో అందుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs PAK: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Bapu, tari fielding kamaal chhe...!!! 🔥 pic.twitter.com/uL1YObjwvJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025
Comments
Please login to add a commentAdd a comment