Ind vs Pak: క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త | World Championship Of Legends Season 2 Schedule Released: Ind vs Pak Check Date | Sakshi
Sakshi News home page

Ind vs Pak: క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

Published Tue, Dec 24 2024 4:52 PM | Last Updated on Tue, Dec 24 2024 5:26 PM

World Championship Of Legends Season 2 Schedule Released: Ind vs Pak Check Date

క్రికెట్‌ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌(World Championship Of Legends T20 League) రెండో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ  టోర్నీ షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. 

కాగా భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ తదితర ఆరు జట్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.

యువీ కె ప్టెన్సీలో 
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్‌ క్రికెటర్లు ఈ టీ20 లీగ్‌తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్‌ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చాంపియన్స్‌ టీమ్‌పై గెలుపొందింది. యువరాజ్‌ సింగ్‌ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్‌గా నిలిచింది.

పాక్‌ను ఓడించి టైటిల్‌ కైవసం
పాక్‌ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్‌ దశలో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్‌ జరుగనుంది. కాగా ఇంగ్లండ్‌ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 షెడ్యూల్‌
👉జూలై 18- ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌
👉జూలై 19- వెస్టిండీస్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌
👉జూలై 19- ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌
👉జూలై 20- ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌

👉జూలై 22- ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌
👉జూలై 22- ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌
👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌
👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ చాంపియన్స్‌

👉జూలై 25- పాకిస్తాన్‌ చాంపియన్స్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా చాంపియన్స్‌
👉జూలై 26- ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌
👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా చాంపియన్స్‌
👉జూలై 27- ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ చాంపియన్స్‌

👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చాంపియన్స్‌
👉జూలై 29- ఇండియా చాంపియన్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ చాంపియన్స్‌
👉జూలై 31- సెమీ ఫైనల్‌ 1(ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం, బర్మింగ్‌హాం)
👉జూలై 31- సెమీ ఫైనల్‌ 2(ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం, బర్మింగ్‌హాం)
👉ఆగష్టు 2- ఫైనల్‌(ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం, బర్మింగ్‌హాం).

చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. విధ్వంస‌క‌ర వీరుడు దూరం!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement