breaking news
World Championship Of Legends
-
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్‌లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్‌లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్‌లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్‌లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్‌బర్గ్‌లో అతను వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్‌ల్లో 151.68 స్ట్రైక్-రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సౌతాఫ్రికా కెప్టెన్‌గా డివిలియర్స్.. టీ20 టోర్నీతో రీఎంట్రీ
సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) పునరాగమనానికి రంగం సిద్ధమైంది. మరోసారి అతడు ప్రొటిస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా ప్రకటించాడు. తాను రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.కాగా సౌతాఫ్రికా(South Africa) తరఫున 2004లో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తనదైన బ్యాటింగ్ శైలితో లెజెండ్‌గా ఎదిగాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభం ఉంది. ఇక ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన ఇంటర్నేషనల్ కెరీర్లో 114 టెస్టు మ్యాచ్‌లు ఆడి 8765 పరుగులు చేశాడు.అదే విధంగా 228 వన్డేల్లో కలిపి 9577 రన్స్ సాధించాడు. ఇక ప్రొటిస్ జట్టు తరఫున 78 టీ20 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ 1672 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో డివిలియర్స్ 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు నమోదు చేశాడు.ఐపీఎల్‌లోనూ హవాఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చాలా ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడాడు ఏబీ డివిలియర్స్. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడి.. మూడు శతకాల సాయంతో 5162 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నలభై ఏళ్ల ఏబీ డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో కలిసి సమయం గడపడంతో పాటు.. సేవా కార్యక్రమాలు, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్‌గానూ అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగా ఉంటున్న మిస్టర్ ‘360’.. కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని ఉందంటూ ఇటీవలే రీఎంట్రీ గురించి సంకేతాలు ఇచ్చాడు.తాజాగా తన పునరాగమనాన్ని ఖరారు చేస్తూ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship of Legends- WCL) బరిలో దిగనున్నట్లు ఏబీడీ ప్రకటించాడు. ‘‘నాలుగేళ్ల క్రితం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను.ఇక నాలో క్రికెట్ ఆడే కోరిక మిగిలి లేదని భావించి నా నిర్ణయాన్ని వెల్లడించాను. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు నాలో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మళ్లీ క్రికెట్ ఆడేలా ప్రేరేపించారు. నా పిల్లలతో కలిసి ఆడిన ప్రతిసారి.. తిరిగి మైదానంలో దిగాలనే కోరిక బలపడింది. అందుకే జిమ్‌కు తరచుగా వెళ్లి వ్యాయామం చేయడంతో పాటు.. నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నా. జూలైలో జరిగే డబ్ల్యూసీఎల్ టోర్నీకి నేను సంసిద్ధంగా ఉన్నాను’’ అని డివిలియర్స్ తెలిపాడు.ఆరు జట్లుకాగా డబ్ల్యూసీఎల్ ఒక ప్రీమియర్ టీ20 టోర్నమెంట్. ఇందులో రిటైర్ అయిన, నాన్- కాంట్రాక్ట్ క్రికెట్ దిగ్గజాలు ఆడతారు. గతేడాది డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్ జరిగింది. భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో పాల్గొనగా.. భారత్ మొట్టమొదటి చాంపియన్‌గా అవతరించింది. ‘సిక్సర్ల కింగ్’ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక ఈసారి ఈ లీగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ బరిలోకి దిగనుండటం అదనపు ఆకర్షణ కానుంది. కాగా ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగష్టు 2 వరకు ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 టోర్నీ జరుగనుంది. సౌతాఫ్రికా తరఫున గత సీజన్లో జాక్వెస్ కలిస్, హర్షల్ గిబ్స్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ తదితరులు బరిలోకి దిగారు.చదవండి: Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. డబ్ల్యూసీఎల్ షెడ్యూల్ విడుదల -
Ind vs Pak: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!.. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(World Championship Of Legends T20 League) రెండో సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ షెడ్యూల్‌ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. కాగా భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ తదితర ఆరు జట్లు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL)లో భాగమవుతున్న విషయం తెలిసిందే.యువీ కె ప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో ఆయా దేశాలకు ప్రాతినిథ్యం వహించిన టాప్ క్రికెటర్లు ఈ టీ20 లీగ్‌తో మరోసారి వినోదాన్ని పంచుతున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రవేశపెట్టిన WCLలో ఇండియా చాంపియన్స్ జట్టు ఫైనల్లో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చాంపియన్స్ టీమ్‌పై గెలుపొందింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో.. దాయాదిని ఐదు వికెట్ల తేడాతో ఓడించి WCLలో మొట్టమొదటి చాంపియన్‌గా నిలిచింది.పాక్‌ను ఓడించి టైటిల్ కైవసంపాక్ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది లీగ్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మధ్య జూలై 20న తొలి మ్యాచ్ జరుగనుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా WCL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 షెడ్యూల్👉జూలై 18- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 19- వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 19- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 20- ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 22- ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 22- ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 23- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 24- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 25- పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్👉జూలై 26- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్👉జూలై 27- ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్👉జూలై 29- ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్👉జూలై 29- ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్👉జూలై 31- సెమీ ఫైనల్ 1(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉జూలై 31- సెమీ ఫైనల్ 2(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం)👉ఆగష్టు 2- ఫైనల్(ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం, బర్మింగ్‌హాం).చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?