ఇండియన్ మహరాజా టీమ్ కెప్టెన్‌గా సెహ్వాగ్
జనవరి 20 నుంచి ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) టి20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో ఇండియన్ మహారాజా, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్‌లు పాల్గొంటున్నాయి. కాగా షెడ్యూల్‌తో పాటు ఆయా జట్ల కెప్టెన్లను ప్రకటించారు. ఎల్ఎల్సీలో పాల్గొననున్న ఇండియన్ మహారాజా టీమ్‌కు.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా మరో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఎంపిక కాగా.. జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు జాన్ బుచానన్ ఎంపికయ్యాడు. ఇక సెహ్వాగ్ ఇంతకముందు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది.
చదవండి: 'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే
► ఇక ఆసియన్ లయన్స్ కెప్టెన్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా-ఉల్ హక్ ఎంపిక కాగా.. ఈ జట్టులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తరపున ఆడిన మాజీ క్రికెటర్లు ఉన్నారు. వారిలో షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, చమిందా వాస్, హబీబుల్ బషర్ లాంటి పేరున్న క్రికెటర్లు ఉండడంతో ఆసియా లయన్స్ బలంగా కనిపిస్తుంది. వైస్ కెప్టెన్‌గా దిల్షాన్ ఎంపికవగా.. 1996 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
► వరల్డ్ జెయింట్స్ టీమ్‌కు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోనూ పలువురు వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. బ్రెట్ లీ, డానియెల్ వెటోరి, కెవిన్ పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. వీరితో పాటు జాంటీ రోడ్స్ ప్లేయర్ కమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 20న ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియా లయన్స్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ సోనీ టెన్ వన్, టూ, త్రీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి
ఎల్ఎల్సీ టోర్నీ షెడ్యూల్:
20/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియన్ లయన్స్
21/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఏషియన్ లయన్స్
22/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్
24/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్
26/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్
27/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్