ఏడేళ్ల తరువాత మళ్లీ 'బెస్ట్' అయ్యాడు! | Younis Khan climbs to No. 2 in Test rankings | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తరువాత మళ్లీ 'బెస్ట్' అయ్యాడు!

Published Thu, Oct 27 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఏడేళ్ల తరువాత మళ్లీ 'బెస్ట్' అయ్యాడు!

ఏడేళ్ల తరువాత మళ్లీ 'బెస్ట్' అయ్యాడు!

దుబాయ్:వయసు పెరుగుతున్నా ఆటలో వన్నె తగ్గని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తన టెస్టు కెరీర్ లో మరోసారి  రెండో ర్యాంకు సాధించాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్లో యూనిస్ ఖాన్ టాప్-2లో నిలిచాడు. వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో శతకం సాధించిన యూనిస్ ఖాన్.. నంబర్ టూ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. దాదాపు ఏడేళ్ల తరువాత యూనిస్ ఖాన్ తన టెస్టు ర్యాంకింగ్స్ లో టాప్-2లో నిలవడం ఇదే తొలిసారి.

2009లో మార్చి నెలలో అగ్రస్థానం దక్కించుకున్న యూనిస్.. అదే ఏడాది జూలైలో రెండో స్థానానికి పడిపోయాడు.  ప్రస్తుతం 860  రేటింగ్ పాయింట్లతో యూనిస్ రెండో్ స్థానానికి ఎగబాకాడు. ఈ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 906 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 852 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో పాక్ స్పిన్నర్ యాసిర్ షా మరోసారి టాప్-5లో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement