ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ భారీగా ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 14, 72 స్థానాలకు చేరుకోగా.. పంత్ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు.
గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ విరాట్ కోహ్లి ఈ వారం ర్యాంకింగ్స్‌లో తలో ఐదు స్థానాలు కోల్పోయి 10, 12 స్థానాలకు దిగజారారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్, యశస్వి జైస్వాల్ టాప్-5 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలిసారి టాప్-10లోకి వచ్చాడు. జయసూర్య ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరాడు. బంగ్లాతో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. అశ్విన్, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు.
లంకతో టెస్ట్‌లో రాణించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరుకోగా.. అదే టెస్ట్‌లో రాణించిన కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ ప్లేస్‌కు చేరాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో నిలిచాడు.
చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment