test rankings
-
మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ భారీగా ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 14, 72 స్థానాలకు చేరుకోగా.. పంత్ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ విరాట్ కోహ్లి ఈ వారం ర్యాంకింగ్స్‌లో తలో ఐదు స్థానాలు కోల్పోయి 10, 12 స్థానాలకు దిగజారారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్, యశస్వి జైస్వాల్ టాప్-5 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలిసారి టాప్-10లోకి వచ్చాడు. జయసూర్య ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరాడు. బంగ్లాతో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. అశ్విన్, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. లంకతో టెస్ట్‌లో రాణించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరుకోగా.. అదే టెస్ట్‌లో రాణించిన కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ ప్లేస్‌కు చేరాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో నిలిచాడు.చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తలో స్థానం మెరుగుపర్చుకున్నారు. ఈ ముగ్గురు తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలకు ఎగబాకారు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ క్రికెట్ ఆడనప్పటికీ ఈ ముగ్గురి ర్యాంకింగ్స్ మెరుగుపడటం గమనార్హం. వీరితో పాటు టాప్-10లో ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, మార్నస్ లబూషేన్ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలకు చేరారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ టాప్-4 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.లంక ఆటగాళ్ల హవాఈ వారం ర్యాంకింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో సత్తా చాటిన ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి.. అదే టెస్ట్‌లో రాణించిన కమిందు మెండిస్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారీ లబ్ది పొందిన లంక ఆటగాళ్లలో పథుమ్ నిసాంక ముందువరుసగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు. ఇది మినహా టాప్-100 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ..!టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ లంక ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. మిలన్ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. ఈ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జోష్ హాజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా టాప్-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.జడ్డూ@1.. అశ్విన్@2టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ 1, 2, 6 స్థానాలను నిలబెట్టుకున్నారు. లంక ఆటగాడు మిలన్ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. చదవండి: ’ముంబై ఇండియన్స్‌తో రోహిత్ ప్రయాణం ముగిసినట్టే’ -
విజ్డెన్ అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు.. కోహ్లికి నో ప్లేస్
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా విజ్డెన్ ఎంపిక చేసిన అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా విజ్డెన్ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రస్తుత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.వికెట్‌కీపర్ కోటాలో పాక్ ఆటగాడు, ఐసీసీ పదో ర్యాంకర్ మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మతో (ఆరో ర్యాంక్) పాటు ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ (నాలుగో ర్యాంక్) ఎంపికయ్యాడు.Wisden picks Current Best Test XI based on ICC Rankings:1. Rohit Sharma.2. Steve Smith.3. Kane Williamson.4. Joe Root.5. Daryl Mitchell.6. Mohammad Rizwan.7. Ravindra Jadeja.8. Ravi Ashwin.9. Pat Cummins.10. Jasprit Bumrah.11. Josh Hazelwood. pic.twitter.com/xUSQPYjA09— Tanuj Singh (@ImTanujSingh) September 10, 2024వన్ డౌన్లో కేన్ విలియమ్సన్ (రెండో ర్యాంక్), నాలుగో స్థానంలో జో రూట్ (మొదటి ర్యాంక్), ఐదో ప్లేస్‌లో డారిల్ మిచెల్ (మూడో ర్యాంక్), వికెట్‌కీపర్‌గా మొహమ్మద్ రిజ్వాన్ (పదో ర్యాంక్), ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా (నంబర్ వన్ ఆల్‌రౌండర్), స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ (నంబర్ వన్ టెస్ట్ బౌలర్), పేసర్లుగా పాట్ కమిన్స్ (నాలుగో ర్యాంక్), జస్ప్రీత్ బుమ్రా (రెండో ర్యాంక్), జోష్ హాజిల్‌వుడ్ (రెండో ర్యాంక్) విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే విజ్డెన్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో నలుగురు టీమిండియా ప్లేయర్లు, ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఇద్దరు న్యూజిలాండ్ ప్లేయర్లు, ఇంగ్లండ్, పాక్‌ల నుంచి చెరొకరు చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు ఎంపిక కేవలం ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగానే జరిగింది. ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆటగాళ్లను విజ్డెన్ తమ అత్యుత్తమ జట్టుకు ఎంపిక చేసుకుంది. -
ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్..
టెస్టు క్రికెట్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా మరోసారి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్... టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఫస్ట్ ర్యాంక్‌ను సాధించడం ఇది ఆరోసారి. 2015 డిసెంబర్లో తొలిసారి టాప్ ర్యాంక్‌ను అశూ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అశ్విన్ తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. ఓవరాల్‌గా ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 26 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అశ్విన్‌తో పాటు ఈ సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబరిచిన కుల్దీప్ యాదవ్ తన కెరీర్లో బెస్ట్ ర్యాంక్‌ను పొందాడు. కుల్దీప్ 15 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన బుమ్రా.. మూడో స్ధానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో సత్తాచాటిన హేజిల్‌వుడ్ రెండో స్థానానికి ఎగబాకాడు. చదవండి: ICC Test Rankings: సత్తాచాటిన రోహిత్ శర్మ, జైశ్వాల్.. టాప్ 10 లోకి -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్‌మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు. -
సత్తా చాటిన టీమిండియా ఓపెనర్లు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన యశస్వి ఒక్కసారిగా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్‌కు దూసుకురాగా.. రాజ్‌కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకుని 12వ స్థానానికి ఎగబాకాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి కేవలం విరాట్ కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. విరాట్.. ఇటీవల భారత్ ఆడిన మూడు టెస్ట్‌లకు దూరంగా ఉన్నా తన ఏడో ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకున్నాడు. భారత్‌తో సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోగా.. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నాలుగు నుంచి మూడుకు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు నుంచి నాలుగో స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో వరుస సెంచరీలతో విజృంభించిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నే ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో ప్లేస్‌కు చేరగా.. భారత్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం సాధించిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రాజ్‌కోట్ టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ప్లేస్‌కు ఎగబాకగా..అదే రాజ్‌కోట్ టెస్ట్‌లో 500 వికెట్ల మైలురాయికి తాకిన రవిచంద్రన్ అశ్విన్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. ఈ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకోగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ 3 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ప్లేయర్లు జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. -
చరిత్ర సృస్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ఎవరికీ సాధ్యంకాని రికార్డులు సొంతం
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సహచరుడు అశ్విన్‌ను మూడో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకాడు. విశాఖ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనల నేపథ్యంలో బుమ్రాకు టాప్ ర్యాంక్ దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా 9 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు ముందు బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం ద్వారా బుమ్రా పలు రికార్డులు నెలకొల్పాడు. భారత్ తరఫున టెస్ట్‌ల్లో టాప్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా (బుమ్రాకు ముందు భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు) నిలిచాడు. అలాగే విరాట్ కోహ్లి తర్వాత అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచిన రెండో ఆసియా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా (హేడెన్, పాంటింగ్, కోహ్లి తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. గతంలో బుమ్రా వేర్వేరు సందర్భాల్లో వన్డే, టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా ఉన్నాడు. ఈ రికార్డుతో పాటు బుమ్రా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో టాప్ ర్యాంక్ సాధించిన తొలి బౌలర్‌గా, తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ వరుస ఇలా ఉంది. బుమ్రా రబాడ అశ్విన్ కమిన్స్ హాజిల్‌వుడ్ ప్రభాత్ జయసూర్య జేమ్స్ఆండర్సన్ నాథన్ లయోన్ రవి జడేజా ఓలీ రాబిన్సన్ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి (ఏడో ర్యాంక్) ఒక్కడే టాప్ 10లో ఉన్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రేటింగ్ పాయింట్స్‌ను మరింత పెంచుకుని అగ్రపీఠాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టాప్ టెన్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ వరుస ఇలా ఉంది. కేన్ విలియమ్సన్ స్టీవ్ స్మిత్ జో రూట్ డారిల్ మిచెల్ బాబర్ ఆజమ్ ఉస్మాన్ ఖ్వాజా విరాట్ కోహ్లి హ్యారీ బ్రూక్ దిముత్ కరుణరత్నే మార్నస్ లబూషేన్ జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరి 117 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఐదో ప్లేస్‌కు ఎగబాకాడు. -
అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలువగా... స్పిన్నర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
తొమ్మిదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్ 10లో ఒకే ఒక్కడు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ విరాటే కావడం విశేషం. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్ నాలుగు స్థానాలు (761 రేటింగ్ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. ఇదే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ (101) సైతం భారీగా పాయింట్లు మెరుగుపర్చుకుని (508 పాయింట్లు) 51వ స్థానానికి చేరాడు. రాహుల్ తన శతక ప్రదర్శనతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. మరోవైపు తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు దిగజారి 14వ స్థానానికి పడిపోగా.. యాక్సిడెంట్ కారణంగా ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 12వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు పుజారా 35, రవీంద్ర జడేజా 38, శ్రేయస్ అయ్యర్ 42, అజింక్య రహానే 44, అక్షర్ పటేల్ 50, శుభ్‌మన్ గిల్ 55, యశస్వి జైస్వాల్ 69, అశ్విన్ 79, శార్దూల్ ఠాకూర్ 99వ స్థానాల్లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. జో రూట్, స్టీవ్ స్మిత్ ఆతర్వాతి స్థానాలను కాపాడుకున్నారు. మరో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరగా.. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో అశ్విన్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. జడేజా, బుమ్రా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. షమీ రెండు స్థానాలు పడిపోయి 20వ స్థానానికి చేరగా.. సిరాజ్ 30, అక్షర్ పటేల్ 32 స్థానాల్లో నిలిచారు. భారత్‌తో తొలి టెస్ట్‌లో రెచ్చిపోయిన రబాడ రెండు స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాకిస్తాన్‌తో రెండో టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన కమిన్స్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే టాప్ 10లో నిలిచాయి. -
'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుందంటారు. అలాంటి ఐసీసీ గురువారం క్రికెట్ అభిమానులను క్షమాపణ కోరింది. కారణం ఏంటనేది ఈ పాటికే మీకందరికి అర్థమయ్యే ఉంటుంది. పెద్దన్న(ఐసీసీ) బుధవారం ర్యాంకింగ్స్‌లో చిన్న తప్పిదం చేసింది. బుధవారం మధ్యాహ్నం టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నెంబర్‌వన్ స్థానంలో నిలిచిదంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. భారత్ ఖాతాలో 115 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 111 పాయింట్లతో ఉందని పేర్కొంది. దీంతో టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా అవతరించడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే దాదాపు ఏడు గంటల తర్వాత ఐసీసీ తప్పిదాన్ని గుర్తించింది. భారత్ ఇంకా టాప్ ర్యాంక్‌కు చేరుకోలేదని... రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతోందని... తమ రేటింగ్ పాయింట్ల లెక్కల్లో తప్పిదంతో ఈ గందరగోళం చోటు చేసుకుందని బుధవారం రాత్రి ఐసీసీ వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుత టెస్టు ర్యాంకింగ్స్ లో ఆ్రస్టేలియా 126 రేటింగ్‌తో టాప్ ర్యాంక్‌లో, భారత్ 115 రేటింగ్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. తాజాగా గురువారం తమ తప్పిదానికి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఐసీసీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి తొలి టెస్టుకు ముందు టీమిండియా 111 పాయింట్లతో రెండో స్థానంలో.. 126 పాయింట్లతో ఆసీస్ తొలిస్థానంలో ఉన్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్ టేబుల్‌ను అప్డేట్ చేసింది. మ్యాచ్ గెలిచిన భారత్‌కు నాలుగు పాయింట్లు రాగా.. ఆసీస్‌కు ఎలాంటి పాయింట్లు రాలేదు. అయితే ఐసీసీ పొరపాటున టీమిండియా 115 పాయింట్లను టాప్‌గా పరిగణించి.. ఆస్ట్రేలియాకు 111 పాయింట్లు అంటూ చూపించింది. దీంతో టీమిండియా నెంబర్‌వన్ అని ప్రకటించింది. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ విషయంలో పొరపాటు చేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు ఇదే ఏడాది జనవరి 17న టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్ సాధించిందంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా 126 పాయింట్లతో నెంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు 15 పాయింట్లు కోత పడడంతో వారి రేటింగ్ 111కు పడిపోయింది. దీంతో 115 పాయింట్లతో టీమిండియా నెంబర్‌వన్ అయినట్లు తెలిపింది. అయితే రెండు గంటల వ్యవధిలోనే తప్పిదాన్ని గుర్తించిన ఐసీసీ లెక్క సరిచేసింది. అయితే ఈ ఏడాదిలో నెల వ్యవధిలో ఐసీసీ రెండుసార్లు పొరపాటు చేయడంపై క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తావు.. ఇలా అయితే ఎలా''.. ''తప్పు చేస్తే దండిచాల్సిన నువ్వే పొరపాటు చేస్తే ఎలా పెద్దన్న''.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాలు ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆడనున్నాయి. టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. India 🇮🇳 spot on the 🔝 in #icc new Test Ranking 1. India 🇮🇳 India 🇮🇳 now T20- no.1 , ODI no.4,Test no.1#bcci #TeamIndia #ranking #believeinblue pic.twitter.com/8XXLnvygqE — Sartaj 🇮🇳 (@i_amSartaj) January 17, 2023 చదవండి: భారత్ నంబర్‌వన్... కాదు కాదు నంబర్ 2 'ఆరడుగుల బౌలర్ కరువయ్యాడు'.. ద్రవిడ్ అదిరిపోయే కౌంటర్ -
టాప్కు చేరిన రూట్.. పదో స్థానానికి పడిపోయిన కోహ్లి
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సత్తా చాటాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రూట్ టెస్ట్‌ల్లో మరోసారి టాప్ ప్లేస్‌కు ఎగబాకాడు. కివీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) పాటు రెండో టెస్ట్‌లో భారీ శతకాన్ని (176) నమోదు చేసిన రూట్ మొత్తం 897 రేటింగ్ పాయింట్లు సాధించి ఆసీస్ ఆటగాడు లబూషేన్ (892)ను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ (845) మూడో స్థానంలో, పాక్ స్కిప్పర్ బాబర్ ఆజమ్ (815) నాలుగో ప్లేస్‌లో, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్ (798) ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (754), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (742) వరుసగా 8, 10 స్థానాలకు దిగజారారు. తాజా ర్యాంకింగ్స్‌లో రూట్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 🔹Joe Root reclaims No.1 spot 🥇 🔹Trent Boult bursts into top 10 🔥 Plenty of movement in the @MRFWorldwide ICC Test Player Rankings after the second #ENGvNZ match 👉 https://t.co/J6m5cEKRSA pic.twitter.com/CqV1mlBMmF — ICC (@ICC) June 15, 2022 ఈ సందర్భంగా ఐసీసీ రూట్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఏడాదిన్నర కాలంలో టెస్ట్‌ల్లో 10 సెంచరీలు చేసిన రూట్.. ప్రస్తుత తరంలో సుదీర్ఘ ఫార్మాట్లో తిరుగులేని ఆటగాడని కొనియాడింది. ఇక బౌలర్ల జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (901), టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు తొలి రెండు స్థానాలను పదిలంగా కాపాడుకోగా.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, పాక్ స్పీడ్‌గన్ షాహీన్ అఫ్రిది 3, 4 స్థానాలకు ఎగబాకారు. చదవండి: Ishan Kishan: టాప్-10లోకి తొలిసారి .. ఒకేసారి 68 స్థానాలు ఎగబాకి -
భారత్ ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆసీస్; టి20ల్లో మనమే నెంబర్ వన్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం వార్షిక ర్యాంకింగ్స్ ప్రకటించింది. టి20ల్లో నెంబర్‌వన్‌గా టీమిండియా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా 270 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. 265 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో.. 261 పాయింట్లతో పాకిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక 253 పాయింట్లతో దక్షిణాఫ్రికా 4వ స్థానంలో.. 251పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే టెస్టుల్లో మాత్రం టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా ఐదేళ్ల పాటు టెస్టుల్లో టాప్ స్థానంలో కొనసాగిన భారత్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను 4-0తో, ఆ తర్వాత పాకిస్తాన్‌ను వారి గడ్డపైనే 1-0తో కమిన్స్ సేన ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో భారత్ రెండోస్థానంలో నిలవగా.. 111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. కోహ్లి నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో ఐదేళ్ల పాటు అంటే 2017 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. మేజర్ టోర్నీలు గెలవలేదనే అపవాదు ఉన్న కోహ్లికి టెస్టుల్లో మాత్రం మంచి రికార్డు ఉంది. టీమిండియా కెప్టెన్‌గా అత్యధిక టెస్టు విజయాలు చూసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు అందుకున్నాడు. భారత్‌కు 60 టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన కోహ్లి 40 విజయాలు అందించాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా స్వదేశంలో రికార్డు స్థాయిలో 11 సిరీస్ విజయాలు సాధించింది. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విక్టరీ అందుకొని కోహ్లి సేన చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2021లో ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై సెంచురియన్ వేదికగా కెప్టెన్‌గా చారిత్రక విజయాన్ని అందుకున్న కోహ్లి.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులు ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ తర్వాత కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడం.. రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. ఆ తర్వాత స్వదేశంలోన్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో టెస్టు సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. ఇక వన్డేల్లో న్యూజిలాండ్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా..ఇంగ్లండ్ 124 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడోస్థానంలో ఉండగా.. భారత్ 105 పాయింట్లతో నాలుగోస్థానానికి పరిమితమైంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది. India stay on top of the ICC men's T20I team rankings 🇮🇳 South Africa, Australia, Bangladesh and Sri Lanka rise; New Zealand and Afghanistan fall in the annual points update 👀 📸: ESPNcricinfo#ICCRankings #Cricket #CricketTwitter pic.twitter.com/5RUlOURy5D — CricStats (@_CricStats_) May 4, 2022 -
దూసుకుపోతున్న పాక్ ప్లేయర్లు.. టీమిండియా నుంచి ఆ ముగ్గురు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా కొనసాగింది. స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ జట్టు ఆటగాళ్లు బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హాక్, షాహీన్ అఫ్రిదిలు తాజా వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఆసీస్‌తో జరిగిన 3 వన్డేల్లో (103, 106, 89 నాటౌట్) 298 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హాక్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి (795 రేటింగ్ పాయింట్లు) చేరుకోగా, అదే సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో ( 57, 114, 105) 276 పరుగులు చేసిన బాబర్ ఆజమ్.. భారీగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రస్థానంలో (891 పాయింట్లు) స్థిరపడ్డాడు. 🔸 Shaheen Afridi continues to climb 🔸 Imam-ul-Haq makes significant gains Pakistan players make major movements in the @MRFWorldwide ICC Men's Player Rankings for ODIs and Tests after #PAKvAUS series 📈 Details 👉 https://t.co/zoY06jyBJ3 pic.twitter.com/dxVyiF78oK — ICC (@ICC) April 6, 2022 ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టిన షాహీన్ అఫ్రిది బౌలింగ్ విభాగంలో ఏకంగా 8 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు (671 పాయింట్లు) చేరాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి (811), రోహిత్ శర్మ (791) తమ 2, 4 స్థానాలను పదిలం చేసుకోగా.. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (679) ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ, బంగ్లా స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగనప్పటికీ, టీమిండియా పేసర్ బుమ్రా (830) ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు, పాక్ స్పీడ్ గన్ షాహీన్ అఫ్రిది (827) నాలుగో స్థానానికి ఎగబాకారు. ఈ జాబితాలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 901 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (850) రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. చదవండి: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..? -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాళ్లు హవా కొనసాగింది. టెస్ట్ మ్యాచ్‌లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ ఆటగాళ్లు అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్‌లో లబూషేన్ (892), స్టీవ్ స్మిత్ (845) తొలి రెండు స్థానాలను పదిలం చేసుకోగా, పాక్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (757) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఖ్వాజా ఏకంగా 6 స్థానాలు ఎగబాకి 7వ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (754), విరాట్ కోహ్లి (742)లు తలో ర్యాంక్ కోల్పోయి 8, 10 స్థానాలకు పడిపోయారు. Major changes in the latest @MRFWorldwide ICC Men’s Player Rankings for Tests and ODIs 👀 More ➡️ https://t.co/MsmAFEH2gG pic.twitter.com/5Cr3GbWccp — ICC (@ICC) March 30, 2022 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఓ ర్యాంకును మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ఈ జాబితా టాప్ 10లో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్, సఫారీ స్పీడ్‌స్టర్ రబాడ, భారత పేసు గుర్రం బుమ్రా, పాక్ నయా సంచలనం షాహీన్ అఫ్రిది వరుసగా 1 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ కేటగిరీలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా (385), రవిచంద్రన్ అశ్విన్ (341)తొలి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. మరోవైపు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో (బ్యాటింగ్ విభాగంలో) పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ ఆటగాడు రాస్ టేలర్ తొలి మూడు స్థానాలను నిలబెట్టుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానం ఎగబాకి ఫోర్త్ ప్లేస్‌కు చేరాడు. ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పాక్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌లు చెరో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 6, 10 స్థానాలకు ఎగబాకారు. బౌలింగ్‌లో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి, బంగ్లా వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, న్యూజిలాండ్ స్టార్ పేసర్ బౌల్ట్, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2022: జోరుమీదున్న కేకేఆర్‌ను ఆర్సీబీ నిలువరించేనా..? -
ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..!
ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్‌కు ఎగబాకాడు. ఇదే టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్‌కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్‌కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. Latest ICC Test Rankings for Batting!#Cricket #ICCRankings pic.twitter.com/fl10mW6QV5 — InsideSport (@InsideSportIND) January 5, 2022 pic.twitter.com/L5F5cKWGER — Krikut Expert Rohit (@_rohitjangra_) January 5, 2022 ఈ జాబితాలో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్పాట్‌ను నిలబెట్టుకోగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ జాబితాలో సైతం టీమిండియా బౌలర్లు తమ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్-10(9వ స్థానం)లోకి చేరుకోగా, ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు ఎనిమిది వికెట్లతో సత్తా చాటిన షమీ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్పాట్‌ను కాపాడుకోగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ టాప్‌లో కొనసాగుతున్నాడు. చదవండి: Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా -
ICC Rankings: టాప్‌లో లబూషేన్.. దిగజారిన కోహ్లి ర్యాంక్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు లబూషేన్(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్ సారధి జో రూట్(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్ స్మిత్(884) మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్(775) ఆరు, ట్రవిస్ హెడ్(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్ సారధి విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు. 🔝 Labuschagne dethrones Root 💪 Starc makes significant gains Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings. 👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP — ICC (@ICC) December 22, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్ సారధి రూట్ కెరీర్(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 🔹 Babar Azam surges to the 🔝 🔹 Mohammad Rizwan into the top three 🔥 Significant gains for Pakistan batters in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/hBFKXGWUp4 pic.twitter.com/qqUfYsFGkA — ICC (@ICC) December 22, 2021 మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే! -
టాప్-10లోకి బుమ్రా.. దూసుకొస్తున్న శార్దూల్
దుబాయ్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత స్పెల్‌తో ఇంగ్లండ్ వెన్నువిరిచిన బుమ్రా.. 771 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ ప్యాట్ కమిన్స్(908) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(831), న్యూజిలాండ్ టిమ్ సౌథీ(824) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ జాబితాలో ఇంగ్లండ్ సారధి జో రూట్(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కివీస్ కేన్ విలియమ్సన్(901), ఆసీస్ స్టీవ్ స్మిత్(891) రెండు, మూడు ర్యాంక్‌ల్లో నిలిచారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో సూపర్ శతకంతో చెలరేగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(813).. తన రేటింగ్ పాయింట్లను భారీగా పెంచుకున్నప్పటికీ ఐదో స్థానానికే పరిమితయ్యాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(783) ఆరో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఓవల్ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్.. రెండు విభాగాల్లో తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకుని టాప్-10 దిశగా దూసుకొస్తున్నాడు. బ్యాటింగ్‌లో 79, బౌలింగ్‌లో 49వ ర్యాంకుకు ఎగబాకాడు. చదవండి: సరికొత్త అవతారంలో ట్రంప్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికన్లు -
కోహ్లిని వెనక్కు నెట్టిన రోహిత్.. అగ్రస్థానానికి ఎగబాకిన రూట్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిని అధిగమించి ఐదో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో నిలకడగా ఆడుతున్న రోహిత్.. 773 రేటింగ్ పాయింట్లు సాధించి కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌ను సొంతం చేసుకోగా, ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ కోహ్లి 766 పాయింట్లకే పరిమితమై ఆరో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ సారధి జో రూట్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియాతో మూడో టెస్ట్‌లో సూపర్ శతకం సాధించిన రూట్.. 916 పాయింట్లు తన ఖాతాలో వేసుకుని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901)ను రెండో స్థానానికి నెట్టి దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న రూట్.. ప్రస్తుత సిరీస్‌లో మూడు అద్భుత శతకాల సాయంతో 507 పరుగులు సాధించి కోహ్లి, లబూషేన్(878), స్టీవ్ స్మిత్(891), విలియమ్సన్లను ఒక్కొక్కరిగా వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇక ఈ జాబితా టాప్-10 లిస్ట్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఔట్ కాగా, పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్(749) ఏడో స్థానానికి ఎగబాకాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పంత్(695) ఏకంగా ఐదు స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి దిగజారాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. గత వారం ర్యాంకింగ్స్‌లో దాదాపు ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్(800) రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 6వ ప్లేస్‌కు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది(783) 14 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ ప్లేస్‌కు ఎగబాకగా, కమిన్స్(908), అశ్విన్(848), సౌథీ(824) వరుసగా మొదటి మూడు స్థానాల్లో కొనసాగతున్నారు. చదవండి: వైడ్ ఇవ్వలేదన్న కోపంలో పోలార్డ్ ఏం చేశాడో చూడండి.. -
10 వికెట్ల ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకుని టాప్-10లోకి..
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ ఆటగాళ్లు దుమ్మురేపారు. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న అనంతరం విడుదలైన ఈ ర్యాంకింగ్స్‌లో పాక్ సంచలన పేసర్ షాహిన్ అఫ్రిది, రెండో టెస్ట్ సెంచరీ హీరో ఫవాద్ ఆలమ్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తమతమ స్థానాలను మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ ర్యాంకులను సాధించారు. విండీస్‌తో రెండో టెస్ట్‌లో పది వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షాహిన్ అఫ్రిది ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 8వ స్థానానికి ఎగబాకగా, బాబర్ ఆజమ్ ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని 7వ స్థానానికి, ఫవాద్ ఆలమ్ 34 స్థానాలు మెరుగుపర్చుకుని 21వ ప్లేస్‌కు ఎగబాకారు. Shaheen Afridi launches up in the @MRFWorldwide ICC Men’s Test Bowling rankings after his stellar series in the West Indies 🚀 Full list: https://t.co/zWeR1wwvYA pic.twitter.com/jnAesHzo9v — ICC (@ICC) August 25, 2021 బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లు టాప్-10లో తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. కోహ్లి(776), రోహిత్(773) ఐదు, ఆరు స్థానాల్లో నిలువగా, పంత్(724) ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(893) రెండో స్థానాన్ని, ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(891) మూడో ప్లేస్‌ను పదిలం చేసుకున్నారు. Pakistan captain Babar Azam has climbed a spot on the @MRFWorldwide ICC Men’s Test Batting rankings ⬆️ Full list: https://t.co/17s2PmICbp pic.twitter.com/uFHHbpeRAE — ICC (@ICC) August 25, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ కేటగిరీలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 848 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ పేసర్ సౌథీ(824), ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(816), కివీస్ పేసర్ నీల్ వాగ్నర్(810), ఇంగ్లండ్ స్టార్ పేసర్ అండర్సన్(800) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. చదవండి: కోహ్లి, రూట్ కొట్టుకున్నంత పని చేశారట..! -
ICC Test Rankings: భారత్‌దే అగ్రస్థానం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో 121 రేటింగ్‌తో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 120 రేటింగ్‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ (109 రేటింగ్) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్‌ను కేటాయించింది. ఇందులో భారత్ 24 మ్యాచ్‌ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్ 18 మ్యాచ్‌ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. -
ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు
దుబాయ్: జూన్‌లో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఐసీసీ గురువారం టాప్ 10లో ఉన్న జట్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. మే 2020 నుంచి మే 2021 వరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకులు ఇచ్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. ఆసీస్, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా ఒక పాయింట్ సాధించి 121 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. రెండు పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ 120 పాయింట్లతో రెండో స్థానంలో.. 109 పాయింట్లతో ఇంగ్లండ్ మూడు, 108 పాయింట్లతో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై టెస్టు సిరీస్‌లను నెగ్గిన పాకిస్తాన్ 84 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌పై సిరీస గెలిచి.. లంకతో డ్రా చేసుకున్న వెస్టిండీస్ 84 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఏడో స్థానంలో నిలిచి దక్షిణాఫ్రికా చెత్త రికార్డును నమోదు చేసింది. తమ టెస్టు ర్యాంకింగ్ చరిత్రలో అత్యంత తక్కువ పాయింట్లతో నిలిచింది. ఇక శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలు వరుసగా 8,9,10 స్థానాల్లో ఉన్నాయి. కాగా జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో తొలి స్థానంలో కమిన్స్(908 పాయింట్లు), అశ్విన్ (850 పాయింట్లతో) రెండో స్థానంలో, నీల్ వాగ్నర్( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: అశ్విన్ ఒక్కడే.. పాక్ బౌలర్ల కెరీర్ బెస్ట్ ↗️ England overtake Australia ↗️ West Indies move up two spots to No.6 India and New Zealand remain the top two sides after the annual update of the @MRFWorldwide ICC Test Team Rankings. 📈 https://t.co/79zdXNIBv3 pic.twitter.com/tUZsgzkE0z — ICC (@ICC) May 13, 2021 -
ఐసీసీ ర్యాంకింగ్స్: అశ్విన్ ఒక్కడే.. పాక్ బౌలర్ల కెరీర్ బెస్ట్
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్ బౌలర్లు సత్తా చాటారు. హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నుమాన్ అలీలు ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్ బెస్ట్‌ను అందుకున్నారు. హసన్ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలవగా.. షాహిన్ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలో.. నుమాన్ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో ఈ త్రయం ముఖ్యపాత్ర పోషించింది. అందునా ఒకే మ్యాచ్‌లో ఈ ముగ్గురు ఐదు వికెట్లు తీయడం విశేషం. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హసన్ అలీ(5-27) ఐదు వికెట్లతో మెరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది(5-52), నుమాన్ అలీ(5- 86)తో మెరిశారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే కావడం విశేషం. ఇక టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్‌టెన్‌లో నిలిచాడు. అశ్విన్ (850 పాయింట్లతో) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. బుమ్రా 11వ స్థానంలో నిలిచాడు. ఇక తొలి స్థానంలో కమిన్స్(908 పాయింట్లు), నీల్ వాగ్నర్( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా నుంచి కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో నిలిచారు. చదవండి: 'చాలా థ్యాంక్స్.. మమ్మల్ని బాగా చూసుకున్నారు' 'విమర్శలు పట్టించుకోం.. మా పనేంటో మాకు తెలుసు' Pakistan players make significant gains after the successful #ZIMvPAK Test series 📈 More on the latest @MRFWorldwide ICC Test Player Rankings 👇 — ICC (@ICC) May 12, 2021 How impressed are you with Hasan Ali? 🤩 pic.twitter.com/BSvaGjlzTf — ICC (@ICC) May 11, 2021 -
న్యూజిలాండ్ నంబర్‌వన్
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (6/48) మళ్లీ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. దీంతో ఆఖరి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 8/1తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 81.4 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆలౌటైంది. అజహర్ అలీ (37; 6 ఫోర్లు), జాఫర్ గోహర్ (37; 7 ఫోర్లు), ఫహీమ్ అష్రఫ్ (28; 3 ఫోర్లు) మినహా మిగతా వారెవరూ ఆతిథ్య బౌలర్లకు ఎదురునిలిచే సాహసం చేయలేకపోయారు. జేమీసన్ 6 వికెట్లు పడగొట్టగా... సీనియర్ సీమర్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్ 297 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 659/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. జేమీసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... విలియమ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్నారు. ఆసీస్‌ను వెనక్కినెట్టి ‘టాప్’లోకి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఇన్నాళ్లు అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో పాయింట్ల పరంగా న్యూజిలాండ్ (116 పాయింట్లు) సమంగా నిలిచింది. అయితే డెసిమల్ పాయింట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైన న్యూజిలాండ్ ఇప్పుడు స్పష్టమైన తేడాతో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పాక్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా న్యూజిలాండ్ 118 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఆసీస్ (116), భారత్ (114) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పాక్‌తో రెండు టెస్టుల్లో కలిపి 388 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్ లో 890 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
కోహ్లిని ముంచిన పింక్ బాల్ టెస్ట్
దుబాయ్ : ఐసీసీ ఆదివారం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 901 పాయింట్లతో టాప్ స్థానం నిలుపుకోగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 888 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉన్నాడు. తాజాగా ఆసీస్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఘోర ప్రదర్శన నమోదు చేసింది. మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. పింక్‌బాల్ టెస్టులో టీమిండియా ఆటగాళ్ల చెత్త ప్రదర్శన తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనబడింది. ఒకవేళ కెప్టెన్ కోహ్లి ఆసీస్‌తో జరిగిన మొదటి టెస్టులో సెంచరీ చేసి ఉంటే మొదటిస్థానానికి ఎగబాకే అవకాశం ఉండేది. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.(చదవండి : నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) ఇక ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోకపోయినా మొదటిస్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసీస్‌తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్ మూడో స్థానానికి చేరుకోగా.. కోహ్లి, విలియమ్సన్ల మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. (చదవండి : అచ్చం ధోని తరహాలో..) ఇక బౌలింగ్ విషయానికి వస్తే పింక్‌బాల్ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హాజిల్‌వుడ్ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్ బౌలర్లలో అశ్విన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు.. పింక్‌బాల్ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్‌తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు -
దుమ్మురేపిన కోహ్లి.. జడేజా
దుబాయ్ : 2020 ఏడాది ముగింపు సందర్భంగా ఐసీసీ మంగళవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండ్ ఇలా అన్ని విభాగాల్లో టీమిండియా ఆటగాళ్లు చోటు దక్కించుకొని తమ సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లి 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా 766 పాయింట్లతో ఏడవ స్థానం, రహానే 726 పాయింట్లతో పదో స్థానాన్ని దక్కించుకున్నారు. (చదవండి : రబ్బిష్.. కోహ్లిని మేమెందుకు తిడతాం) ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ 904 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా నుంచి బుమ్రా 779 పాయింట్లతో 8వ స్థానం, 756 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ 10వ స్థానంలో నిలిచాడు. లు చోటు సంపాదించారు. ఆల్‌రౌండ్ విభాగంలో జడేజా 397 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. 281 పాయింట్లతో అశ్విన్ 6వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ 446 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవడం విశేషం.