ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్‌కు ఎగబాకాడు. ఇదే టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్‌కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్‌కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు.
Latest ICC Test Rankings for Batting!#Cricket #ICCRankings pic.twitter.com/fl10mW6QV5
— InsideSport (@InsideSportIND) January 5, 2022
— Krikut Expert Rohit (@_rohitjangra_) January 5, 2022
ఈ జాబితాలో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్పాట్‌ను నిలబెట్టుకోగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ జాబితాలో సైతం టీమిండియా బౌలర్లు తమ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్-10(9వ స్థానం)లోకి చేరుకోగా, ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు ఎనిమిది వికెట్లతో సత్తా చాటిన షమీ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్పాట్‌ను కాపాడుకోగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ టాప్‌లో కొనసాగుతున్నాడు.
చదవండి: Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా
Comments
Please login to add a commentAdd a comment