
బెస్ట్ ర్యాంక్ సాధించిన జడేజా
దుబాయ్: భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా కెరీర్ లో బెస్ట్ టెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో 8 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో జడేజా 8 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీశాడు. రెండో టెస్టులో మొదటి రోజే 4 వికెట్లు నేలకూల్చాడు. అశ్విన్ 5వ ర్యాంకులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ అగ్రస్థానాన్ని మళ్లీ దక్కించుకున్నాడు.
బ్యాట్స్ మన్ పతనం కొనసాగుతోంది. మురళీ విజయ్, పుజారా, కోహ్లి వరుసగా 12, 14, 17 ర్యాంకులకు పడిపోయారు. ధావన్ 5 స్థానాలు పెరిగి 33వ ర్యాంకులో నిలిచాడు. బెంగళూరులో 100వ టెస్టు ఆడిన ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ రెంగో ర్యాంకులో ఉన్నాడు.