భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 49 మ్యాచ్‌ల్లో 498 వికెట్లు పడగొట్టారు.
వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్‌ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్‌తో నేటి మ్యాచ్‌లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు.
ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్‌ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్‌గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్‌ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75), తేజ్‌నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్‌కెంజీ (32), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment