West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ముందుగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డొమినికా వేదికగా జూలై 12న తొలి మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా భారత స్పిన్నర్ అశ్విన్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్(20), తేజ్‌నరైన్ చందర్‌పాల్(12)లను అవుట్ చేసి ఆరంభంలోనే షాకిచ్చాడు.
అల్జారీ జోసెఫ్‌ను అవుట్ చేయడం ద్వారా
అదే విధంగా.. టెయిలెండర్లు అలిక్ అథనాజ్(47), అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐదు వికెట్లతో రాణించి తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించేందుకు సహకరించాడు. ఇదిలా ఉంటే.. అల్జారీ జోసెఫ్‌ను అవుట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్‌లో అశూ 700వ వికెట్ సాధించాడు.
కుంబ్లే, భజ్జీ తర్వాత
తన 271వ మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత 700 వికెట్ల క్లబ్‌లో చేరిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా కుంబ్లే తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా 403 మ్యాచ్‌లలో 956 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు.
16వ స్థానంలో
ఇక భజ్జీ 711 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. అశూ త్వరలోనే అతడి రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ జాబితాలో అశూ(702 వికెట్లు) 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment